https://oktelugu.com/

Adivi Sesh : అడవి శేష్ ని చూసి హీరోయిన్లు పారిపోవడానికి అసలు కారణం అదేనా..? ఎందుకు ఇలా పూటకి ఒకరు మారిపోతున్నారు!

ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ ఇమేజ్ లేకుండా క్యారక్టర్ ఆర్టిస్టుగా, విలన్ గా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి ఆ తర్వాత హీరో గా మారి వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ ని అందుకొని, తనకంటూ ఒక ప్రత్యేకమైన ఆడియన్స్ ని ఏర్పాటు చేసుకున్న హీరోలలో ఒకరి అడవి శేష్.

Written By:
  • Vicky
  • , Updated On : January 9, 2025 / 07:56 AM IST

    Adivi Sesh

    Follow us on

    Adivi Sesh : ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ ఇమేజ్ లేకుండా క్యారక్టర్ ఆర్టిస్టుగా, విలన్ గా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి ఆ తర్వాత హీరో గా మారి వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ ని అందుకొని, తనకంటూ ఒక ప్రత్యేకమైన ఆడియన్స్ ని ఏర్పాటు చేసుకున్న హీరోలలో ఒకరి అడవి శేష్. ముఖ్యంగా స్పై జానర్ చిత్రాలంటే మన అందరికీ గుర్తుకు వచ్చే ఏకైక హీరో ఆయన మాత్రమే. ‘క్షణం’ చిత్రం తో మొదలైన ఆయన జైత్ర యాత్ర ‘గూఢచారి’, ‘ఎవరు’, ‘మేజర్’, ‘హిట్ : ది సెకండ్ కేస్’ వంటి సూపర్ హిట్ చిత్రాల వరకు కొనసాగింది. ప్రస్తుతం ఆయన ‘గూఢచారి 2’, ‘డెకాయిట్’ అనే సినిమాలు చేస్తున్నాడు. ఈ రెండు చిత్రాలపై అంచనాలు భారీ రేంజ్ లోనే ఉన్నాయి. ఈ రెండు చిత్రాల్లో కామన్ విషయం ఏమిటంటే, రెండు సినిమాలకు ముందు అనుకున్న హీరోయిన్లు వేరు, ఆ తర్వాత తెరమీదకు వచ్చిన హీరోయిన్లు వేరు.

    పూర్తి వివరాల్లోకి వెళ్తే ‘డెకాయిట్’ చిత్రానికి ముందుగా శృతి హాసన్ ని హీరోయిన్ గా తీసుకున్నారు. ఆమెతో కొంతభాగం షూటింగ్ కూడా పూర్తి చేసారు. టీజర్ ని కూడా విడుదల చేసారు. కానీ చివరికి ఏమైందో ఏమో తెలియదు కానీ ఆమెని సినిమా నుండి తప్పించారు. ఆమెకి బదులుగా మృణాల్ ఠాకూర్ ని తీసుకున్నారు. శృతి హాసన్ కి డేట్స్ విషయం లో అయోమయం కి గురి చేయడం వల్లే ఆమె ఈ సినిమా నుండి తప్పుకుందని లేటెస్ట్ గా వినిపిస్తున్న సమాచారం. అదే విధంగా ‘గూఢచారి 2 ‘ కి ముందుగా బంటియా సందూను ని హీరోయిన్ గా తీసుకున్నారు. ఆ తర్వాత ఏమైందో ఏమో తెలియదు, ఆమెని రీప్లేస్ చేస్తూ హాట్ బ్యూటీ వామికా గబ్బి ని తీసుకున్నారు. దీనికి సంబంధించిన పోస్టర్ ని నిన్న విడుదల చేసారు.

    కనీసం వీళ్ళిద్దరితో అయినా ఈ రెండు సినిమాలను పూర్తి చేస్తారా?, లేకపోతే మళ్ళీ హీరోయిన్స్ ని మారుస్తారా అనేది తెలియాల్సి ఉంది. అడవి శేష్ విషయం లో డేట్స్ సరిగా ప్లాన్ చేయకపోవడం వల్లే ఇలాంటి పొరపాట్లు జరిగాయని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్. అడవి శేష్ తన సినిమాలకు కేవలం 5 కోట్ల బడ్జెట్ తోనే టాప్ క్లాస్ క్వాలిటీ ని చూపిస్తాడు. అలాంటిది ‘గూఢచారి 2 ‘ చిత్రానికి ఏకంగా 75 కోట్ల రూపాయిల బడ్జెట్ ని ఖర్చు చేస్తున్నారు. ఇక ఏ రేంజ్ క్వాలిటీ ఉంటుందో మీరే ఊహించుకోండి. ఈ రెండు సినిమాలతో ఆయన పాన్ ఇండియా లెవెల్ లో వంద కోట్ల రూపాయిల గ్రాస్ మార్కుని అవలీలగా అందుకుంటాడని బలమైన నమ్మకంతో చెప్తున్నారు ట్రేడ్ పండితులు. చూడాలి మరి ఈ రెండు సినిమాల భవిష్యత్తు ఏమిటి అనేది. ఈ ఏడాది ద్వితీయార్థం లోనే ఈ రెండు సినిమాలు విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి.