Wisden unveils their 10 best cricket images of 2021 : విజ్డెన్ సంస్థ 2021 సంవత్సరంలో 10 ఉత్తమ క్రికెట్ చిత్రాలను విడుదల చేసింది. అదిప్పుడు వైరల్ గా మారింది. క్రికెట్ ఆటలోని అపురూప అద్వితీయ చిత్రాలను ఇది పంచుకుంది. ఆ టాప్ ఏంటో తెలుసుకుందాం.

గత ఏడాది టీ20 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియాపై ఇంగ్లాండ్ ఎనిమిది వికెట్ల తేడాతో గెలిచింది. ఈ మ్యాచ్ లో స్టీవ్ స్మిత్‌పై జోస్ బట్లర్ దూకిన చిత్రం 2021 ‘విజ్డెన్ ఫోటోగ్రాఫ్ ఆఫ్ ది ఇయర్’ అవార్డును పొందింది. అక్టోబరు 30, 2021న దుబాయ్‌లో జరిగిన గ్రూప్ స్టేజ్ మ్యాచ్ లో బట్లర్ 32 బంతుల్లో 71 నాటౌట్‌తో మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. ఆ మ్యాచ్ సందర్భంగా తీసిన చిత్రమిదీ.. ఆస్ట్రేలియన్ డేవిడ్ గ్రే ఈ ఫొటో తీయడంతో వైరల్ అయ్యింది. నంబర్ 1 ఫొటోగా నిలిచింది.

ఈ పోటీ ప్రపంచవ్యాప్తంగా 300 కంటే ఎక్కువ ఎంట్రీలను ఆకర్షించింది, విజ్డెన్ న్యాయమూర్తులు గ్రే యొక్క ఫోటో “టీ20 క్రికెట్ అథ్లెటిసిజం, ఉత్సాహం.. వేగాన్ని సంపూర్ణంగా సంగ్రహించింది” అని కొనియాడారు.

ఇక ఆ తర్వాత 2020లో భారతదేశంలోని సముద్ర తీరం సమీపంలోని ఇసుక దిబ్బల మధ్య క్రికెట్ ఆడుతున్న పిల్లల చిత్రాల రెండోస్థానంలో నిలిచింది.

ఇక మూడో స్థానంలో క్యాచ్ అందుకోబోతున్న స్టీవ్ వా నిలిచింది. ఇక నార్తంబర్‌ల్యాండ్‌లోని వూలర్ క్రికెట్ క్లబ్‌కు చెందిన నలుగురు ఆటగాళ్ళు సైలేజ్ ఫీల్డ్‌లో కోల్పోయిన బంతి కోసం వెతుకుతున్న ఫొటో నాలుగో స్థానంలో నిలిచింది. బర్మింగ్‌హామ్ ఫీనిక్స్ మెన్‌కు చెందిన ఫిన్ అలెన్ ప్రారంభ హండ్రెడ్ పోటీలో క్యాచ్‌ను వదులుతున్న ఫోటో ఆ తర్వాత స్థానంలో నిలిచింది.

టీ20 ప్రపంచ కప్ మ్యాచ్‌కు ముందు సూర్యాస్తమయం సమయంలో జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్ చేస్తున్న ఫొటో ఎవర్ గ్రీన్ గా ఉంది. ఈ ఫోటోతో సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న మరో ఏడు చిత్రాలు షార్ట్‌లిస్ట్ చేయబడ్డాయి, 10 విన్నింగ్ ఎంట్రీలు లండన్‌లోని ఓవల్‌లో 12 నెలల పాటు ప్రదర్శించబడతాయి.

Recommended Videos:
[…] Also Read: Wisden : విజ్డెన్ : 2021లో 10 బెస్ట్ ‘క్రికెట్’ … […]