Sunrisers Eastern Cape: సౌతాఫ్రికా లీగ్ ఫైనల్లో ‘సన్ రైజర్స్.. ఈసారి కూడా కప్ గెలుస్తుందా..?

సన్ రైజర్స్ టీం ఆడిన మొదటి క్వాలిఫైయర్ మ్యాచ్ లో గెలిచి ఫైనల్ కి చేరుకొని అందరికీ షాక్ ఇచ్చింది. ఇక శనివారం ఫైనల్ లో కూడా వాళ్ల సత్తా చాటుకోవాలని చూస్తున్నారు.

Written By: Gopi, Updated On : February 7, 2024 2:22 pm
Follow us on

Sunrisers Eastern Cape: ప్రస్తుతం సౌతాఫ్రికా లీగ్ మ్యాచ్ లు చివరి దశకు చేరుకున్నాయి. గత సీజన్ మాదిరిగానే ఇప్పుడు కూడా ‘సన్ రైజర్స్ ఈస్టరన్ కేప్’ టీమ్ ఫైనల్ కి చేరుకుంది. అయితే గత సంవత్సరం కూడా ఈ టీమ్ ఫైనల్ కి చేరుకొని భారీ విజయం సాధించి ఛాంపియన్స్ గా నిలిచింది. ఇక అదే ఉత్సాహంతో ఈ సీజన్ లో బరిలోకి దిగిన సన్ రైజర్స్ టీమ్ ఇప్పుడు కూడా ఫైనల్ కి చేరుకుంది.

మరి ఫైనల్ లో విజయం సాధించి మరోసారి ఛాంపియన్స్ గా నిలుస్తారా లేదా అనే విషయాలు కూడా తెలియాల్సి ఉంది. అయితే ఈ టీమ్ తో పోటీపడే మరో టీమ్ ఏది అనే విషయం లో ఇప్పటి వరకైతే క్లారిటీ రాలేదు. మరి ఇప్పుడున్న టీముల్లో ఏ టీమ్ ఫైనల్ కొచ్చినా కూడా సన్ రైజర్స్ టీమ్ మీద గెలిచే సత్తా అయితే ఆ టీమ్ లకి లేదనే చెప్పాలి.

ఇక ఇప్పటికే సన్ రైజర్స్ టీం ఆడిన మొదటి క్వాలిఫైయర్ మ్యాచ్ లో గెలిచి ఫైనల్ కి చేరుకొని అందరికీ షాక్ ఇచ్చింది. ఇక శనివారం ఫైనల్ లో కూడా వాళ్ల సత్తా చాటుకోవాలని చూస్తున్నారు. ఇక ఈ టీమ్ మలన్, మార్కరం, మాక్రో జాన్సన్, బర్టుమాన్ లాంటి స్టార్ ప్లేయర్లతో చాలా స్ట్రాంగ్ గా ఉంది. అందువల్లే వీళ్ళను ఓడించే టీమ్ లు ఈ లీగ్ లో కనిపించడం లేదు. అయితే గత సంవత్సరం ఫైనల్ లో ప్రిటోరియస్ క్యాపిటల్స్ టీమ్ ను చిత్తు చేసి సన్ రైజర్స్ ఘన విజయం సాధించింది. అయితే ఈసారి కూడా అదే బాటలో పయనిస్తూ భారీ విజయాన్ని అందుకోవడానికి రెడీ అయింది. ఇక ఈ టీం లో ఉన్న ప్రతి ప్లేయర్ వాళ్ళ సపరేట్ ఐడెంటిటీతో ఆడుతున్నారు.

క్వాలిఫైయర్ మ్యాచ్ లో మలన్ బ్యాట్ తో తన సత్తా చాటాడు. కాబట్టి ఈ టీమ్ లో ఉన్న ప్లేయర్లు ఎవరికి వాళ్లు ఇండివిజువల్ గా పరుగులను రాబట్టడంలో ముందు వరుసలో ఉంటున్నారు. ఇక బౌలర్లు కూడా అవకాశం దొరికిన ప్రతిసారి చెలరేగి బౌలింగ్ చేసి ప్రత్యర్థుల గుండెల్లో గుబులు పుట్టిస్తున్నారు. అదే ఈ టీం యొక్క విజయ రహస్యంగా మారింది. ఇక ఫైనల్ లో కూడా ఈ టీమ్ ఈజీగా విజయాన్ని సాధిస్తుంది అనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది…