Homeజాతీయ వార్తలుYogi Adityanath : యోగి పాలనలో రోడ్డు రవాణాకు మహర్దశ

Yogi Adityanath : యోగి పాలనలో రోడ్డు రవాణాకు మహర్దశ

Yogi Adityanath : ఉత్తరప్రదేశ్ అభివృద్ధి ముఖచిత్రాన్ని మార్చేస్తూ, రాష్ట్ర రవాణా రంగానికి సరికొత్త జవజీవాలు అందిస్తోంది యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం. తాజాగా లక్నో – కాన్పూర్ ఎక్స్‌ప్రెస్‌వే ప్రారంభోత్సవంతో యూపీ రవాణా రంగంలో ఒక సరికొత్త చరిత్ర లిఖించబడింది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, నితిన్ గడ్కరీల చేతుల మీదుగా ప్రారంభమైన ఈ రహదారి, కేవలం రెండు నగరాలను కలపడమే కాకుండా.. రాష్ట్ర ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చేసే శక్తిమంతమైన కారిడార్‌గా అవతరించింది.

అమెరికాను తలదన్నేలా… దేశంలోనే సరికొత్త రికార్డు!

ఈ ఎక్స్‌ప్రెస్‌వే ప్రారంభంతో ఉత్తరప్రదేశ్ ఒక అరుదైన, చారిత్రాత్మక మైలురాయిని అందుకుంది. ఇది యూపీలో 10వ ఎక్స్‌ప్రెస్‌వే కావడం విశేషం. భారతదేశంలోనే కాకుండా, ప్రపంచంలోనే అత్యంత అభివృద్ధి చెందిన అమెరికా వంటి దేశాల్లో సైతం ఒకే రాష్ట్రంలో ఇన్ని ఎక్స్‌ప్రెస్‌వేలు ఎక్కడా లేవు. దేశంలోనే మరే రాష్ట్రానికి సాధ్యం కాని రీతిలో రికార్డు స్థాయిలో హైవేల నెట్‌వర్క్‌ను నిర్మించడం ద్వారా “ఎక్స్‌ప్రెస్‌వేల రాష్ట్రం”గా యూపీ అవతరించింది. ఇది యోగి ప్రభుత్వ దూరదృష్టికి, మౌలిక వసతుల కల్పనలో వారికున్న పట్టుదలకు నిదర్శనం.

రూ. 4,200 కోట్ల ఆధునిక అద్భుతం

దాదాపు 4,200 కోట్ల రూపాయల భారీ వ్యయంతో, అంతర్జాతీయ ప్రమాణాలతో 6 లేన్ల రహదారిగా దీనిని నిర్మించారు. గతంలో లక్నో నుండి కాన్పూర్ చేరుకోవడానికి 2 నుండి 3 గంటల సుదీర్ఘ సమయం పట్టేది. ట్రాఫిక్ పద్మవ్యూహాన్ని దాటుకుని వెళ్లడం ప్రయాణీకులకు నరకంగా ఉండేది. కానీ ఇప్పుడు ఈ అధునాతన ఎక్స్‌ప్రెస్‌వే ద్వారా కేవలం 45 నుండి 50 నిమిషాల్లోనే గమ్యస్థానానికి చేరుకోవచ్చు. సమయం తగ్గడంతో పాటు రవాణా వ్యయం తగ్గి, వాణిజ్య రంగానికి భారీ ఊరట లభిస్తుంది.

ఒక్కటి కానున్న జంట నగరాలు: లక్నో – కాన్పూర్ మెగా అర్బన్ హబ్

ఈ ఎక్స్‌ప్రెస్‌వే కేవలం ప్రయాణ దూరాన్ని మాత్రమే తగ్గించలేదు, రెండు ప్రధాన నగరాల మధ్య ఉన్న భౌగోళిక దూరాన్ని తుడిచేసింది. లక్నో, కాన్పూర్ నగరాలు వేగంగా విస్తరిస్తూ, రాబోయే రోజుల్లో ఒకే పెద్ద మెగా అర్బన్ నగరంగా (Twin Cities) రూపాంతరం చెందే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఢిల్లీ చుట్టుపక్కల ప్రాంతాలను NCR (National Capital Region) తరహాలో అభివృద్ధి చేసినట్లే, లక్నో చుట్టుపక్కల జిల్లాలను కలిపి ఒక భారీ స్టేట్ క్యాపిటల్ రీజియన్‌గా ప్లాన్ చేయడం ద్వారా ఇక్కడి పారిశ్రామిక రంగానికి రెక్కలు రానున్నాయి. “రహదారులే ప్రగతికి బాటలు. లక్నో – కాన్పూర్ ఎక్స్‌ప్రెస్‌వే కేవలం రోడ్డు కాదు.. ఉత్తరప్రదేశ్ ఆర్థిక ఇంజిన్‌ను పరుగులు తీగించే హైవే.”

డబుల్ ఇంజిన్ సర్కార్ మార్క్ పాలన

ఒకప్పుడు శాంతిభద్రతల సమస్యలతో, వెనుకబాటుతనంతో కొట్టుమిట్టాడిన ఉత్తరప్రదేశ్.. నేడు యోగి ఆదిత్యనాథ్ పాలనలో పెట్టుబడులకు స్వర్గధామంగా మారుతోంది. శాంతిభద్రతలను అదుపులోకి తీసుకురావడంతో పాటు, పారిశ్రామిక వృద్ధికి అవసరమైన అంతర్జాతీయ స్థాయి మౌలిక వసతులను కల్పించడంలో యోగి ప్రభుత్వం వందకు వంద మార్కులు సాధించింది. అమెరికాను తలదన్నేలా 10 ఎక్స్‌ప్రెస్‌వేలతో దూసుకుపోతున్న యూపీ.. రాబోయే రోజుల్లో దేశ ఆర్థిక వ్యవస్థకు ప్రధాన చోదక శక్తిగా మారనుందనడంలో ఎలాంటి సందేహం లేదు. యోగి పాలనలో యూపీ ప్రగతి ప్రయాణం ఇప్పుడు ‘ఎక్స్‌ప్రెస్’ వేగంతో దూసుకుపోతోంది!

యోగి పాలనలో రోడ్డు రవాణాకు మహర్దశ.. దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడండి..

యోగి పాలనలో రోడ్డు రవాణాకు మహర్దశ || Road transport booms under Yogi's rule || Ram Talk

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version