Balakrishna: బాలయ్య కి ఇష్టమైన దర్శకుడు ఎవరో తెలుసా..?

బాలయ్య చేసిన సినిమాలు ఎన్నో సూపర్ డూపర్ సక్సెస్ లను సాధించడమే కాకుండా ఇండస్ట్రీ హిట్లు గా కూడా నిలిచాయి. ఇక ఇలాంటి క్రమంలో ఈయన చాలామంది దర్శకులతో కలిసి పని చేశాడు. అయితే అప్పటికి, ఇప్పటికీ, ఎప్పటికైన కూడా బాలయ్య కు నచ్చిన దర్శకుడు ఎవరు అంటే...

Written By: Gopi, Updated On : February 7, 2024 2:29 pm
Follow us on

Balakrishna: నందమూరి నటసింహంగా పేరు పొందిన బాలయ్య ప్రస్తుతం వరుస సినిమాలు చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇక రౌద్ర రసాన్ని పండించడం లో బాలయ్య బాబును మించిన నటుడు మరొకరు లేరు అని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. డైలాగ్ డెలివరీలో కూడా బాలయ్య అసాధారణమైన టాలెంట్ ను చూపిస్తూ వస్తున్నాడనే చెప్పాలి. ఇక ఇలాంటి క్రమం లో బాలయ్య చేసిన సినిమాలు ఎన్నో సూపర్ డూపర్ సక్సెస్ లను సాధించడమే కాకుండా ఇండస్ట్రీ హిట్లు గా కూడా నిలిచాయి.

ఇక ఇలాంటి క్రమంలో ఈయన చాలామంది దర్శకులతో కలిసి పని చేశాడు. అయితే అప్పటికి, ఇప్పటికీ, ఎప్పటికైన కూడా బాలయ్య కు నచ్చిన దర్శకుడు ఎవరు అంటే ఆయనతో ఆదిత్య 369, భైరవద్వీపం లాంటి ఎక్స్పరిమెంటల్ సినిమాలు చేసి సక్సెస్ లు అందించిన ‘సింగీత శ్రీనివాసరావు’ అంటే బాలయ్య బాబుకి అమితమైన ఇష్టం అంట…ఒక మూస దోరణి లో వెళ్తున్న బాలయ్యతో సైన్స్ ఫిక్షన్ కి సంబంధించిన ‘ఆదిత్య 369’ గాని, జానపద సినిమా అయిన ‘ భైరవ ద్వీపం ‘ లాంటి సినిమాలను చేసి రెండు అదిరిపోయే హిట్లు ఇచ్చాడు.

ఇక ఇప్పటికి కూడా బాలయ్య బాబు టాప్ టెన్ సినిమాల లిస్టు తీస్తే అందులో ఈ రెండు సినిమాలు చోటు దక్కించుకుంటాయి. అందుకే బాలయ్యకి ఆయనంటే అమితమైన ఇష్టం ఉందట, అలాగే వీళ్ళ కాంబినేషన్ లో ‘ఆదిత్య 999’ సినిమాని కూడా తెరకెక్కించాలని చూశారు. కానీ సింగీతం శ్రీనివాసరావు ఏజ్ బాగా పెరిగిపోవడంతో ఆయన ఇప్పుడు డైరెక్షన్ చేసే పరిస్థితులో లేరు. అందువల్లే ఆ సినిమాని పక్కన పెట్టినట్టుగా తెలుస్తుంది… ఇక ప్రస్తుతం బాలయ్య బాబి డైరెక్షన్ లో ఒక మాస్ సినిమా చేస్తున్నాడు.

దాంతో పాటుగా బోయపాటితో సినిమా చేయడానికి కూడా రెడీ అవుతున్నాడు. ఇక ఇప్పటికే వరుసగా మూడు సక్సెస్ లను సాధించి హ్యాట్రిక్ విజయాలను అందుకున్న ఏకైక సీనియర్ హీరోగా బాలయ్య ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక మీదట వచ్చే సినిమాలతో కూడా మంచి సక్సెస్ లను అందుకోవాలని చూస్తున్నాడు.