Esha Deol: ఈ మధ్య విడాకుల వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. సమంత నాగచైతన్య విడిపోయిన దగ్గర నుంచి సెలబ్రెటీల విడాకుల వార్తలు మరింత ఎక్కువ అయ్యాయి. తాజాగా మరో హీరోయిన్ ఆమె భర్తతో విడిపోయింది. ఇంతకీ ఎవరు అనుకుంటున్నారా? అయితే ప్రముఖ హీరోయిన్ ఈషా డియోల్, ఆమె భర్త భరత్ తక్తానీతో విడిపోయింది. దాదాపు 12 సంవత్సరాల వివాహ బంధానికి వీరిద్దరు స్వస్తి పలికారు. అయితే చాలా కాలంగా వీరి విడాకుల వార్తలు సోషల్ మీడియాలో కోడై కూసాయి. కానీ ఆ వార్తలు ఇప్పుడు నిజమని తెలుస్తున్నాయి.
మేము స్నేహపూర్వకంగా విడిపోవాలని నిర్ణయించుకున్నాము. మా జీవితాలలో మార్పులు.. మా ఇద్దరి పిల్లలను సంరక్షణ.. శ్రేయస్సు మాకు చాలా ముఖ్యం. మా వ్యక్తిగత విషయాలను గోప్యంగా ఉండాలని.. మా నిర్ణయాన్ని మీరంతా గౌరవిస్తారని భావిస్తున్నాము అంటూ ప్రకటించారు. అయితే వ్యక్తిగత కారణాలు ఈగోల వల్ల ఈ ఇద్దరు విడిపోయినట్టు తెలుస్తోంది. మొత్తం మీద వీరిద్దరి విడాకుల వార్తలు మాత్రం నిజమే అని తెలిసింది. గత కొన్నాళ్లుగా ఈషా డియోల్, భరత్ విడిపోతారనే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.
పలు ఈవెంట్స్, కార్యక్రమాల్లో తన భర్త లేకుండానే ఈషా ఒంటరిగా కనిపించడంతో విడాకుల వార్తలు తెరపైకి వచ్చాయి. అంతేకాదు తన సోషల్ మీడియా ఖాతాలో కేవలం ఈషా.. ఒంటరిగా ఉన్న ఫోటోలను మాత్రమే షేర్ చేయడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. కానీ ఈ ప్రకటనతో ఈ అనుమానాలకు చెక్ పడినట్టు అయింది. ఇషా, భరత్ 2012 లో పెళ్లి చేసుకున్నారు. వీరికి 2017 కూతురు రాధ, 2019లో పాప మీరయా జన్మించారు.
బాలీవుడ్ స్టార్ ధర్మేంద్ర, హేమమాలిని కూతురు ఈషా డియోల్. 21 ఏళ్ల వయసులోనే కథానాయికగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది ఈ అమ్మడు. ఇక 2002లో కోయి మేరే దిల్ సే పూచే సినిమాతో నటిగా ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ ను అందుకుంది. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ తనకంటూ ఓ గుర్తింపును సంపాదించుకుంది. 2008 వరకు దాదాపు ఆరేళ్లలో 30 కి పైగా సినిమాల్లో నటించింది ఈషా. ఆ తర్వాత భరత్ తక్తానీని పెళ్లి చేసుకొని సినిమాలకు దూరంగా ఉండిపోయింది.