Shekar Chandra : ప్రముఖ సంగీత దర్శకులు శేఖర్ చంద్ర కిడ్నాప్ కి గురయ్యారు అంటూ సోషల్ మీడియా లో నేటి ఉదయం ఏ రేంజ్ లో ప్రచారం జరుగుతుందో మన కళ్లారా చూస్తూనే ఉన్నాం. ఇది నిజంగా జరిగిందేమో అని సోషల్ మీడియా లో నెటిజెన్స్ షాక్ కి గురై అతని గురించి గూగుల్ లో వెతకడం మొదలు పెట్టారు. ఇంత సాఫ్ట్ మనస్తత్వం ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ ని కిడ్నాప్ చెయ్యాలని ఎవరికి ఉంటుంది?, పాపం అతను ఏమి తప్పు చేశారు? అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ ఆవేదన వ్యక్తం చేశారు. అయితే కాసేపటి తర్వాత తెలిసిన నిజం ఏమిటంటే ఇది నిజమైన కిడ్నాప్ కాదు. ‘సహా – ది లైఫ్ ఆఫ్ సంజు’ అనే కొత్త సినిమాకు సంబంధించిన ప్రొమోషన్స్ లో భాగంగా ఈ పని చేశారు. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది.
ఈ వీడియోలో శేఖర్ చంద్ర ఒక ట్యూన్ ని కంపోజ్ చేస్తుంటారు. అప్పుడే కొంతమంది కిడ్నాపర్లు ఆయన రికార్డింగ్ రూమ్ లోకి చొరబడి కిడ్నాప్ చేస్తారు. ఆ తర్వాత కాసేపటికి తనని కిడ్నాప్ చేసిన వారిని చూసి షాక్ కి గురవుతారు శేఖర్ చంద్ర. ఎందుకంటే కిడ్నాప్ చేసింది మరెవరో కాదు, మూవీ టీం కి సంబంధించిన వాళ్ళే. ఎందుకంటే ఇస్తానన్న ట్యూన్ తొందరగా ఇవ్వలేదని. అలా నాటకీయ కోణం లో సాగిన ఈ వీడియో చివర్లో , మొదటి పాటని ఈ నెల 16 న , ప్రసాద్ ల్యాబ్స్ లో ఉదయం 10 గంటలకు విడుదల చేయబోతున్నట్టు చెప్పుకొచ్చారు. ఈ పాటకు అనురాగ్ కులకర్ణి గాత్రం అందించబోతుండగా , పూర్ణ చంద్ర లిరిక్స్ ని అందిస్తున్నారు. చాలా డిఫరెంట్ గా ప్లాన్ చేసిన ఈ ప్రమోషనల్ వీడియో ని మీరు కూడా చూసేయండి.
ఈ వీడియో ని ఎదో డిఫరెంట్ గా ప్రయత్నం చేశారు కానీ , రీసెంట్ గానే అనిల్ రావిపూడి తన కొత్త సినిమాకు చేసిన ప్రమోషన్ ని కాపీ కొట్టినట్టుగా అనిపించింది. త్వరలో అణిరావిపూడి వెంకటేష్ , కళ్యాణ్ రామ్ లతో చేయబోయే మల్టీ స్టార్రర్ సినిమాకు సంబంధించిన ప్రొమోషన్స్ ని చాలా డిఫరెంట్ స్టైల్ లో ప్లాన్ చేశారు. వైజాగ్ బీచ్ లో మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ కుమార్ ని , లిరిక్ రైటర్ అనంత్ శ్రీరామ్ లో ఇసుక కప్పెట్టేసి , వాళ్ళ చేత మ్యూజిక్ సిట్టింగ్స్ చేయించారు. సరిగ్గా అదే ఫార్ములా ని ఈ సినిమా మేకర్స్ ఉపయోగించారు కానీ , పెద్దగా ఆకట్టుకోలేదు అనే చెప్పాలి. మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ లో తెలియజేయండి.
ఇంత టాలెంట్ ఉండడం కూడా నేరమా..?#Sahaa కోసం #SekharChandra ను t
ఎత్తేశారు… https://t.co/GU7cSJXc7Y pic.twitter.com/JTwHfY7UHF— Taraq(Tarak Ram) (@tarakviews) July 14, 2026
