Rohit Sharma : రోహిత్ శర్మ నిర్ణయంతో రితిక భావోద్వేగం.. సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్..

Rohit Sharma : తన భర్త రోహిత్ శర్మ టి20 వరల్డ్ కప్ ను అత్యంత ప్రేమగా చూసుకుంటున్న చిత్రాన్ని రితిక సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.." రో.. ఈ గెలుపు నీకు చాలా స్పెషల్. నువ్వు చాలా పెద్ద కల కన్నావ్. ఈ ఫార్మాట్, ఈ ట్రోఫీ, ఈ స్క్వాడ్.. కొద్ది నెలలుగా నువ్వు అత్యంత బాధాకరమైన కాలాన్ని ఎదుర్కొన్నావు.

Written By: NARESH, Updated On : July 1, 2024 2:16 pm

rohit-sharma--ritika-sajdeh-0150

Follow us on

Rohit Sharma : 17 ఏళ్ల పాటు కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తే.. టీం ఇండియా టి20 వరల్డ్ కప్ దక్కించుకుంది. 2014లో ఫైనల్ వెళ్లినప్పటికీ.. శ్రీలంక చేతిలో ఓడిపోయింది. మళ్లీ దశాబ్దం తర్వాత టీమిండియా టి20 వరల్డ్ కప్ ఫైనల్లోకి ప్రవేశించింది. అయితే ఈసారి దక్షిణాఫ్రికా తో టీమిండియా తలపడాల్సి వచ్చింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమిండియా 176 రన్స్ చేసింది. స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ చాలా రోజుల తర్వాత తన పూర్వపు లయను అందుకున్నాడు. మిగతా ఆటగాళ్లు విఫలమైనప్పటికీ 76 పరుగులు చేశాడు. ఓపెనర్ గా వచ్చి.. అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఆ తర్వాత భారత్ విధించిన లక్ష్యాన్ని చేదించే క్రమంలో దక్షిణాఫ్రికా 169 పరుగులు మాత్రమే చేసింది. మొత్తంగా ఏడు పరుగుల తేడాతో రోహిత్ సేన విజయం సాధించింది..

ఈ విజయం నేపథ్యంలో టీమిండియా పై ప్రశంసల జల్లు కురుస్తూనే ఉంది. దిగ్గజ ఆటగాళ్ల నుంచి సామాన్యుల వరకు టీమిండియా ఆటగాళ్లకు జేజేలు పలుకుతూనే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టి20 ఫార్మాట్ నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటించాడు. కొత్త తరం ఆటగాళ్లకు అవకాశం ఇచ్చేందుకు తాను ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించాడు. రోహిత్ నిర్ణయంతో అభిమానులు షాక్ కు గురయ్యారు. ముఖ్యంగా అతడి సతీమణి రితిక ఇప్పటికీ కోలుకోలేకపోతోంది. తన భర్త తీసుకున్న నిర్ణయం పట్ల ఆమె భావోద్వేగానికి గురైంది. సోషల్ మీడియాలో ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టింది.

తన భర్త రోహిత్ శర్మ టి20 వరల్డ్ కప్ ను అత్యంత ప్రేమగా చూసుకుంటున్న చిత్రాన్ని రితిక సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది..” రో.. ఈ గెలుపు నీకు చాలా స్పెషల్. నువ్వు చాలా పెద్ద కల కన్నావ్. ఈ ఫార్మాట్, ఈ ట్రోఫీ, ఈ స్క్వాడ్.. కొద్ది నెలలుగా నువ్వు అత్యంత బాధాకరమైన కాలాన్ని ఎదుర్కొన్నావు. నేను అన్ని గమనిస్తూనే ఉన్నా. వాటన్నింటినీ నువ్వు అధిగమించావు. నువ్వు నీ చిరకాల కలను నెరవేర్చుకున్నావ్. ఇది నాకు గర్వంగా అనిపిస్తోంది. నీ భార్యగా ఈ సన్నివేశాన్ని చూసి నేను ఎంతగానో ఆనందపడుతున్నాను. ఆటను విపరీతంగా ప్రేమించే నువ్వు టీ20 ఫార్మాట్ కు వీడ్కోలు పలకడం నాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఒకరకంగా తీవ్ర బాధను కలిగిస్తోంది. నీకు కూడా అలానే ఉంటుందనుకుంటున్నా. నువ్వు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా అది గొప్పగానే ఉంటుంది. కాకపోతే నాకే సులువుగా జీర్ణం కావడం లేదు. ఇంతటి గొప్ప గుణాలు ఉన్న వ్యక్తి భార్య కావడం నేను అదృష్టంగా భావిస్తున్నాను. ఐ లవ్ యు సో మచ్” అని రితిక తన ఇన్ స్టా గ్రామ్ లో రాస్కొచ్చారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో తెగ సర్కులేట్ అవుతోంది