Homeఎంటర్టైన్మెంట్Tollywood Star Hero: 6 సంవత్సరాల నుంచి హిట్ కొట్టలేకపోతున్న స్టార్ హీరో...

Tollywood Star Hero: 6 సంవత్సరాల నుంచి హిట్ కొట్టలేకపోతున్న స్టార్ హీరో…

Tollywood Star Hero: సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ ఉన్నవాళ్ళకు మాత్రమే చాలా గొప్ప గుర్తింపైతే ఉంటుంది. ప్లాపు ల్లో ఉన్న వారిని ఎవరు పట్టించుకోరు. కొంతమంది హీరోలు ఇండస్ట్రీకి వచ్చి 10, 20 సంవత్సరాలు అయిన కూడా స్టార్ హీరోలుగా మారడం లో మాత్రం వెనకబడిపోతుంటారు. ముఖ్యంగా నితిన్ లాంటి నటుడు ఈ మధ్యకాలంలో చేస్తున్న సినిమాల విషయంలో చాలా నిర్లక్యం చేశాడు అందుకే తన సినిమాలన్నీ ప్లాప్ అవుతున్నాయి. ఆయన సక్సెస్ ని సాధించి 6 సంవత్సరాలు అవుతుండడంతో ఇప్పుడు ఆయన నుంచి రాబోయే సినిమాల విషయంలో చాలా కేర్ ఫుల్ గా వ్యవహరించాల్సిన అవసరం అయితే ఉందని పలువురు సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు…

2020 వ సంవత్సరంలో వెంకీ కుడుముల దర్శకత్వంలో వచ్చిన ‘భీష్మ’ సినిమాతో సక్సెస్ ను సాధించిన ఆయన ఆ తర్వాత చేసిన సినిమాలతో డిజాస్టర్లను మూట గట్టుకున్నాడు. ఇక ఏది ఏమైనా కూడా ప్రేక్షకులందరిని తనవైపు తిప్పుకోవడంలో ఆయన చాలావరకు వెనుకబడిపోయాడు. 2002 వ సంవత్సరంలో ‘జయం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన ఇప్పటివరకు భారీ విజయాన్ని అందుకోలేకపోయాడు.

అలాగే స్టార్ హీరోగా మారలేకపోయాడు. తను ఇండస్ట్రీకి వచ్చి 20 సంవత్సరాలు దాటినా కూడా ఇప్పటివరకు ఇంకా తను ఇబ్బందుల్లోనే ఉన్నాడు. భారీ సక్సెస్ లను సాధించి మాస్ హీరోగా మారకపోవడం వల్లే ఆయనకు అంత క్రేజ్ రాలేదు. తనతో పాటు ఇండస్ట్రీకి వచ్చిన జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ లాంటి నటులు టాప్ హీరోలుగా ఎదిగారు…

ఇప్పటికైనా ఆయన వరుసగా సక్సెస్ లను సాధిస్తేనే ఇండస్ట్రీలో తన మనుగడ కొనసాగుతుంది. లేకపోతే మాత్రం ఆయన ఇండస్ట్రీ నుంచి ఫేడ్ ఔట్ అయిపోయే ప్రమాదమైతే ఉంది. గతంలోనే 13 సినిమాలతో డిజాస్టర్ లను మూటగట్టుకున్న ఆయన ఇప్పుడు చేయబోయే సినిమాలతో భారీ సక్సెస్ సాధించి మరోసారి భారీ కంబ్యాక్ ఇవ్వాల్సిన అవసరమైతే ఉంది…లేకపోతే మాత్రం ఆయన సినీ కెరియర్ ను కోల్పోయే ప్రమాదం ఉంది…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version