Pic Of The Day: పిక్ ఆఫ్ ది డే : గుడిసెలో టీ తాగిన చంద్రబాబు

Pic Of The Day: అమరావతి ప్రాంతంలోని పెనుమాకలో పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు సీఎం చంద్రబాబు. మంగళగిరి నియోజకవర్గ పరిధిలో ఉండడంతో చంద్రబాబుతో పాటు లోకేష్ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Written By: Dharma, Updated On : July 1, 2024 2:14 pm

CM Chandarbabu Drinking Tea In Poor People House

Follow us on

Pic Of The Day: చంద్రబాబుది విప్లవాత్మక పాలన. 1995లో తొలిసారిగా సీఎం అయిన ఆయన ఇటువంటి పాలనకే తెర తీశారు. జన్మభూమి, ప్రజల వద్దకు పాలన అంటూ పరుగులు తీశారు. అధికారులను సైతం పరుగులు పెట్టారు. అయితే ఈరోజు అటువంటిదే ఆవిష్కృతం అయ్యింది. ఇటీవల ఏపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. తాను అధికారంలోకి వస్తే నాలుగువేల రూపాయలకు పింఛన్ మొత్తం పెంచుతానని చంద్రబాబు హామీ ఇచ్చారు. అందుకు తగ్గట్టుగానే ఆ హామీని అమలు చేశారు. ఏప్రిల్ నుంచి పింఛన్ మొత్తం పెంపును వర్తింప చేస్తూ ఈరోజు 7వేల రూపాయలను లబ్ధిదారులకు అందజేశారు. రాష్ట్రవ్యాప్తంగా వేడుకగా ఈ కార్యక్రమం కొనసాగింది. ప్రభుత్వం చేపట్టాక తొలి అధికారిక కార్యక్రమం కావడంతో పండుగను తలపించింది.

అమరావతి ప్రాంతంలోని పెనుమాకలో పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు సీఎం చంద్రబాబు. మంగళగిరి నియోజకవర్గ పరిధిలో ఉండడంతో చంద్రబాబుతో పాటు లోకేష్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉదయం 6:30 గంటలకు ఓ పూరి గుడిసెలో ప్రవేశించారు చంద్రబాబు. ఆ ఇంట్లో సామాజిక పింఛన్ లబ్ధిదారులకు పింఛన్ మొత్తాన్ని అందించారు. కుటుంబ సభ్యుల స్థితిగతులను గమనించి.. వారి విన్నపం మేరకు ఇల్లు కూడా మంజూరు చేశారు. దీంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. చంద్రబాబు అంతటితో ఆగలేదు. వారు అందించిన టీ తాగి.. వారిని మరింత ఆనందింపజేశారు.

పెనుమాకలో బాణావత్ పాములు నాయక్ కుటుంబంతో కలిసి నివాసముంటున్నారు. ఆయన కుమార్తె శివకుమారి వితంతువు. భర్త మరణంతో తండ్రి వద్దే తలదాచుకుంటుంది. చూస్తే చిన్న గుడిసె. అనూహ్యంగా పింఛన్ల పంపిణీకి ఆ గుడిసెలోకి వెళ్లారు చంద్రబాబు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి తమ ఇంటికి రావడంతో వారు ఆనందంలో మునిగిపోయారు. తొలుత పాములు నాయక్ కు పింఛన్ మొత్తాన్ని అందించారు చంద్రబాబు. అనంతరం కుమార్తె శివకుమారికి వితంతు పింఛన్ అందజేశారు. ఆ పేద కుటుంబం అభ్యర్థన మేరకు వెంటనే ఇల్లు కూడా మంజూరు చేశారు. ఈ సందర్భంగా నాయక్ కుటుంబ సభ్యుల విన్నపం మేరకు కొద్దిసేపు ఇంట్లో కూర్చున్న చంద్రబాబు.. వారిచ్చిన టీ తాగారు. వారిని ఎంతగానో సంతృప్తిపరిచారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పిక్ ఆఫ్ ది డేగా నిలుస్తోంది.