Gautam Gambhir : రోహిత్, బుమ్రా అంటే గౌతమ్ గంభీర్ కు ఎందుకంత కోపం.. స్టార్ క్రికెటర్లకు ఇంత అవమానమా?

ఇటీవల టీమిండియా మాజీ ఆటగాడు దినేష్ కార్తీక్ తన ఆల్ టైం భారత క్రికెట్ జట్టును ప్రకటించాడు. అందులో మహేంద్రసింగ్ ధోనీకి స్థానం కల్పించలేదు. దీంతో సోషల్ మీడియాలో అతడి పై విమర్శలు తారస్థాయికి చేరుకున్నాయి. దీంతో అతడు క్షమాపణ చెప్పక తప్పలేదు. అంతేకాదు ధోని అనితర సాధ్యమైన ఆటగాడని పేర్కొన్నాడు. కాకపోతే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.

Written By: Anabothula Bhaskar, Updated On : September 2, 2024 6:33 pm

Gautam Gambhir

Follow us on

Gautam Gambhir : ప్రస్తుతం గౌతమ్ గంభీర్ టీమిండియా హెడ్ కోచ్ గా ఇటీవలే తన ప్రయాణాన్ని ప్రారంభించాడు. తొలి ప్రయాణంలో కొంత తీపి, మరికొంత చేదు ఫలితాన్ని సొంతం చేసుకున్నాడు. త్వరలో టీమిండియా బంగ్లాదేశ్ జట్టుతో టెస్ట్ సిరీస్ ఆడనుంది. ఆ తర్వాత ఆస్ట్రేలియాతో బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీ ఆడనుంది. ఈ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియా తో టీమ్ ఇండియా ఐదు టెస్టులలో తలపడనుంది. ఇక టీమిండియాతో తన ప్రయాణాన్ని ప్రారంభించిన గౌతమ్ గంభీర్.. తన తదుపరి పరీక్షకు సిద్ధమవుతున్నాడు. ఈనెల 18 నుంచి భారత జట్టు స్వదేశంలో బంగ్లాదేశ్ తో రెండు టెస్టుల సిరీస్ ఆడనుంది. ఆ తర్వాత ఆస్ట్రేలియా, అనంతరం న్యూజిలాండ్ జట్లతో భారత్ తలపడుతుంది.. లంక జట్టుతో వన్డే సిరీస్ ఓడిపోయిన తర్వాత భారత జట్టుకు దాదాపు నెలపాటు విశ్రాంతి లభించింది. ఈ నేపథ్యంలో గౌతమ్ గంభీర్ వరుసగా మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. ఇందులో భాగంగా ఇటీవల స్పోర్ట్స్ కీడాకు ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ సందర్భంగా తన ఆల్ టైం ఇండియన్ ప్లేయింగ్ ఎలెవన్ జట్టును ప్రకటించాడు.

కెప్టెన్ గా ధోని

గౌతమ్ గంభీర్ ప్రకటించిన ఆల్ టైం ఎలెవెన్ జట్టుకు ధోనిని కెప్టెన్ గా నియమించాడు. ఓపెనర్లు గా తనతోపాటు వీరేంద్ర సెహ్వాగ్ ను ఎంపిక చేసుకున్నాడు. ఫస్ట్ డౌన్ లో మిస్టర్ డిపెండబుల్ రాహుల్ ద్రావిడ్, సెకండ్ డౌన్లో సచిన్ టెండూల్కర్ కు స్థానం కల్పించాడు గౌతమ్ గంభీర్. నాలుగైదు స్థానాలలో విరాట్ కోహ్లీ, యువరాజ్ సింగ్ కు అవకాశం కల్పించాడు. వికెట్ కీపర్ జాబితాలోనూ ధోనికి చోటు దక్కింది..ఫాస్ట్ బౌలర్లుగా ఇర్ఫాన్ పఠాన్, జహీర్ ఖాన్ కు స్థానం కల్పించాడు. స్పిన్ కోటాలో అనిల్ కుంబ్లే, రవిచంద్రన్ అశ్విన్ కు అవకాశం ఇచ్చాడు.. ఈ జాబితాలో టీమిండియా కు ఇటీవల టి20 వరల్డ్ కప్ అందించిన రోహిత్ శర్మకు, బుమ్రా కు గౌతమ్ గంభీర్ అవకాశం కల్పించకపోవడం విశేషం.. దీనిపై బుమ్రా, రోహిత్ శర్మ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దిగ్గజ ఆటగాళ్లకు చోటు కల్పించకపోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు..మరీ ఇంత అవమానం ఏంటని మండిపడుతున్నారు.

గౌతమ్ గంభీర్ ఆల్ టైం ప్లేయింగ్ ఎలెవన్ జట్టు ఇదే

మహేంద్ర సింగ్ ధోని (కెప్టెన్/ వికెట్ కీపర్), సచిన్ టెండూల్కర్, గౌతమ్ గంభీర్, అనిల్ కుంబ్లే, రవిచంద్రన్ అశ్విన్, జహీర్ ఖాన్, ఇర్ఫాన్ పఠాన్, విరాట్ కోహ్లీ, యువరాజ్ సింగ్, రాహుల్ ద్రావిడ్, వీరేంద్ర సెహ్వాగ్.