https://oktelugu.com/

Surya Kangua movie : సూర్య కంగువా ముందు ఉన్న పెద్ద సవాల్ ఇదేనా..? ఈ సినిమా వచ్చేది ఎప్పుడంటే..?

 ఒక సినిమా చెయ్యాలంటే అది చాలా కష్టం తో కూడుకున్న పని... దర్శకుడు ఆ సినిమాలో ఇన్వాల్వ్ అయిన అందరిని మేనేజ్ చేస్తూ సినిమాని సక్సెస్ ఫుల్ గా తీర్చిదిద్దాల్సిన అవసరం అయితే ఉంది. ఇక హీరోలు మాత్రం తమ క్యారెక్టర్ లో లీనమై నటించి వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకోవాలని మాత్రమే చూస్తూ ఉంటారు...

Written By:
  • Gopi
  • , Updated On : September 2, 2024 / 06:43 PM IST

    Surya Kangua movie

    Follow us on

    Surya Kangua movie : తమిళ్ సినిమాఇండ స్ట్రీలో రజనీకాంత్ కమలహాసన్ ల తర్వాత అంతటి క్రేజ్ ను సంపాదించుకున్న హీరోల్లో సూర్య ఒకరు. ఈయన సినిమా సినిమాకి వైవిధ్యాన్ని ప్రదర్శించడమే కాకుండా ప్రతి సినిమాలో ఆయన క్యారెక్టరైజేశన్ కూడా ఒక డిఫరెంట్ తరహాలో ఉంటుంది. అందువల్లే ఆయనని ఎక్కువ మంది జనాలు ఇష్టపడుతూ ఉంటారు. ఆయన చేసిన సినిమాలన్నింటిలో ఆయన నటన చాలా ప్రత్యేకంగా నిలుస్తుంది. ఇక ఆయన ఎంటైర్ కెరియర్ లో గజిని, సెవెంత్ సెన్స్ లాంటి సినిమాలకు చాలా ప్రాధాన్యత ఉంది. అలాగే ఇప్పుడు డైరెక్టర్ శివ తో కలిసి ‘కంగువా ‘ అనే సినిమా చేశాడు. ఈ సినిమా మొదట దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు వస్తుందని మేకర్స్ అనౌన్స్ చేసినప్పటికీ, ఆరోజు రజనీకాంత్ ‘వెట్టాయన్ ‘ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపథ్యంలో ఈ సినిమాని దీపావళి కానుకగా అక్టోబర్ చివరి వారం లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం కంగువా ముందు ఒక చాలెంజ్ అయితే ఉంది.

    అది ఏంటి అంటే సూర్యతో సమకాలీన హీరో అయిన విక్రమ్ ‘తంగలాన్’ సినిమాతో ఒక డిఫరెంట్ అటెంప్ట్ చేసి భారీ సక్సెస్ ని అందుకున్నాడు. ఈ సినిమా పాన్ ఇండియాలో మంచి పేరు సంపాదించుకోవడమే కాకుండా భారీ కలెక్షన్లను కూడా కొల్లగొట్టింది. ఇక ఈ నేపథ్యంలో సూర్య లాంటి హీరో విక్రమ్ తో పోటీపడి నిలబడాలి అంటే ‘కంగువా ‘ సినిమా భారీ సక్సెస్ ని అందుకోవాలి. ఎందుకంటే ఇద్దరు హీరోలు ప్రస్తుతం ప్లాపుల్లోనే ఉన్నారు.

    అయినప్పటికీ విక్రమ్ మాత్రం సక్సెస్ ని కొట్టి తన స్టామినా ఏంటో ప్రూవ్ చేసుకున్నాడు. ఇక పీరియాడికల్ డ్రామాగా తెరకెక్కుతున్న కంగువా సినిమా కూడా భారీ సక్సెస్ ని అందుకుంటేనే సూర్య మరోసారి తన మార్కెట్ ని కూడా భారీగా విస్తరించుకున్న వాడు అవుతాడు. లేకపోతే మాత్రం ఇప్పుడున్న హీరోల్లో తను వెనుకబడిపోతాడని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు… ఇక ఇప్పటికే కంగువా సినిమా మీద ప్రేక్షకుల్లో మంచి అంచనాలైతే ఉన్నాయి.

    ఇక ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ట్రైలర్లు ప్రేక్షకులకు అమితంగా నచ్చడమే కాకుండా సూర్య మరొక డిఫరెంట్ అటెంప్ట్ ని ఇవ్వబోతున్నాడు అనేది కూడా చాలా క్లియర్ కట్ గా తెలుస్తుంది…చూడాలి మరి ఈ సినిమాలతో సూర్య ఎలాంటి సక్సెస్ ని సాధిస్తాడు వీటివల్ల ఆయన కెరియర్ అనేది ఎలా ముందుకు సాగుతుంది అనేది తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…