World Test Championship : WTC గద సాధనే లక్ష్యం అయినప్పుడు.. విరాట్, రోహిత్, బుమ్రాకు ఎందుకు విశ్రాంతి ఇస్తున్నారు?

టీమిండియా రెండుసార్లు వన్డే వరల్డ్ కప్ గెలిచింది. రెండుసార్లు t20 వరల్డ్ కప్ దక్కించుకుంది. ఛాంపియన్స్ ట్రోఫీ ని కూడా సాధించింది. కానీ ఇంతవరకు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ మాత్రం గెలవలేకపోయింది.

Written By: Anabothula Bhaskar, Updated On : August 29, 2024 10:23 am

Duleep Trophy

Follow us on

World Test Championship : వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ ఎలాగైనా గెలవాలని టీమిండియా ఈసారి బలంగా నిర్ణయించుకుంది. ఇటీవల జరిగిన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ లో ఆస్ట్రేలియా చేతిలో టీమిండియా ఓడిపోయింది. అంతకుముందు వన్డే వరల్డ్ కప్ ఫైనల్ లోనూ టీమిండియా పరాజయం పాలైంది. దీంతో ఈసారి ఎలాగైనా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ గెలవాలని భావిస్తోంది. ఇందులో భాగంగానే రకరకాల ప్రణాళికలు అమలు చేయడం మొదలుపెట్టింది.. ఆ ప్రణాళికలను దులీప్ ట్రోఫీ తోనే ప్రారంభించనుంది.. అందరూ ఆటగాళ్లు కచ్చితంగా దులీప్ ట్రోఫీలో ఆడాలని షరతు విధించింది. ఆ తర్వాత ఈ జాబితాలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, బుమ్రా కు మినహాయింపు ఇచ్చింది. అయితే అదే విషయాన్ని సీనియర్ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ తప్పు పడుతున్నాడు. “వారికి కావాల్సినంత రెస్ట్ ఇప్పటికే దొరికింది. అయినప్పటికీ వారిని దేశవాళి క్రికెట్ టోర్నీకి ఎందుకు దూరంగా ఉంచుతున్నారు. రోహిత్, విరాట్, బుమ్రా, రవిచంద్రన్ అశ్విన్ వంటి వారు కచ్చితంగా దేశవాళీ క్రికెట్ ఆడాలి. వారు ఆడితేనే బాగుంటుంది. ఇతర యువ ఆటగాళ్లు కూడా వారి ఆట తీరు ద్వారా స్ఫూర్తి పొందుతారు. చక్కటి పోటీ వాతావరణాన్ని ఆస్వాదిస్తారు. ఇది టీమిండియాను మరింత బలోపేతం చేస్తుంది. బీసీసీఐ పెద్దలు ఈ దిశగా ఆలోచనలు చేస్తే ఉపయోగం ఉంటుంది. ఎందుకంటే జట్టు బలంగా ఉన్నప్పుడే విజయాలు వస్తాయి. విజయాలు వచ్చినప్పుడే జట్టు స్థానం మరింత సుస్థిరం అవుతుంది. ఈ విషయం బీసీసీఐ పెద్దలు పరిశీలించి, దానిని అమల్లో పెడితే బాగుంటుందని” సంజయ్ పేర్కొన్నాడు.

వచ్చే నెలలో భారత్ బంగ్లాదేశ్ తో టెస్టు సిరీస్ ఆడుతుంది. దానికంటే ముందు దులీప్ ట్రోఫీలో భారత ఆటగాళ్లు ఆడతారు. ఈ టోర్నీ ద్వారా ఆటగాళ్లకు కావాల్సినంత ప్రాక్టీస్ లభిస్తుంది. వచ్చే ఏడాది జరిగే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ లో విజయం సాధించాలని భారత్ భావిస్తున్న నేపథ్యంలో..దులీప్ ట్రోఫీ లో ఆడటం ఆటగాళ్లకు కీలకం కానుంది. మరోవైపు భారత వరుసగా పది టెస్ట్ మ్యాచ్ లు ఆడాల్సి ఉంది. ఇందులో సాధించిన విజయాల ఆధారంగానే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ లో భారత్ ఆడేందుకు అవకాశం లభిస్తుంది. కాగా, దులీప్ ట్రోఫీ రెడ్ బాల్ తో ప్రారంభం కానుంది. విరాట్, రోహిత్, బుమ్రా, రవిచంద్రన్ అశ్విన్.. మినహా మిగతా వారంతా రెడ్ బాల్ టోర్నీ ద్వారా మైదానంలోకి దిగనున్నారు. ఐతే విరాట్, రోహిత్, బుమ్రా, రవిచంద్రన్ అశ్విన్ కూడా దులీప్ ట్రోఫీలో ఆడితే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. మరోవైపు భారత్ పది టెస్ట్ మ్యాచ్ లు ఆడాల్సి ఉన్న నేపథ్యంలో.. విరాట్, రోహిత్, బుమ్రా, రవిచంద్రన్ అశ్విన్ గాయపడితే ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడుతుందనే వాదన కూడా ఉంది.. టెస్ట్ క్రికెట్లో విరాట్, రోహిత్, బుమ్రా, రవిచంద్రన్ అశ్విన్ కొత్తగా నిరూపించుకోవడానికి ఏమీ లేదు కాబట్టి.. వారికి విశ్రాంతి ఇవ్వడమే సరైన నిర్ణయమని సీనియర్ క్రికెటర్లు చెబుతున్నారు.