Y Chromosomes: మగ జాతి పుట్టుకకు ముప్పు.. మాయమవుతున్న ‘వై’ క్రోమోజోమ్‌.. ప్రపంచం ఏం కానుంది?

మనుషుల్లో లింగ భేదాన్ని నిర్ధారించేవి ఎక్, వై క్రోమోజోములు. ఎక్స్‌ క్రోమో జోములు స్త్రీ, వై క్రోమోజోములు పురుష జననానికి కారణమవుతాయి. మహిళల్లో ఎక్స్‌ క్రోమోజోములు ఉంటాయి. పురుషుల్లో ఎక్స్, వై క్రోమోజుములు ఉంటాయి.

Written By: Raj Shekar, Updated On : August 29, 2024 10:20 am

Y Chromosomes

Follow us on

Y Chromosomes: కొన్నేళ్ల క్రితం ఆడపిల్లల జననాన్ని చాలా మంది వ్యతిరేకించారు. పురుషుల్లోని ఎక్స్, స్త్రీలలోని ఎక్స్‌ క్రోమోజోములు కలయికతో ఆడపిల్లలు జన్మిస్తారు. పురుçషుల్లోని వై, స్త్రీలలోని ఎక్స్‌ క్రోమోజోముల కలయిక కారణంగా పురుషులు జన్మిస్తారు. అందుకే వై క్రోమో జోమ్‌ను మేల్‌ క్రోమోజోమ్‌ అంటారు. లింగనిర్ధారణ పరీక్షల ద్వారా చాలా మంది ఆడపిల్లలను గర్భస్థ దశలోనే చంపేశారు. నేటికీ కొన్ని ప్రాంతాల్లో లింగ వివక్ష కొనసాగుతోంది. అయితే.. ఇన్నాళ్లూ ఆడపిల్లలపై చూపిన వివక్ష కారణమో.. శాపమో ఏమో గానీ, ఇప్పుడు మగ జాతి పుట్టుకే ప్రశ్నార్థకం అవుతోంది. వై క్రోమోజోముకు సంబంధించి ఒక షాకింగ్‌ ఆధ్యయనం వెలుగులోకి వచ్చింది. ప్రపంచం అభివృద్ధి చెందుతున్న కొద్దీ మానవులలోని వై క్రోమోజోములు క్రమంగా నశిస్తున్నట్లు శాస్త్రవేతలు గుర్తించారు. నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ సైన్స్‌ ప్రొసీడింగ్స్‌లో అధ్యయన పత్రాన్ని ప్రచురించారు. ప్రముఖ జెజిటిక్స్‌ ప్రొఫెసర్‌ శాస్త్రవేత్త జెన్నిఫర్‌ ఎ. మార్షల్‌ గ్రీవ్స్‌ ప్రకారం క్రోమోజోమ్‌ సమయం గతించిపోతోంది. ఈ ధోరణి కొనసాగితే వై క్రోమోజోమ్‌ 11 మిలియన్‌ సంవత్సరాలలో పూర్తిగా అంతరించిపోతాయి. దీంతో మగ సంతానం ఉండదు.

ఆందోళన అవసరం లేదు..
జపాన్‌కు చెందిన ఎలుకల జాతి అంతర్ధానమైన తర్వాత మరో కొత్త జన్యువును అభివృద్ధి చేసుకుంది. వై క్రోమోజోమ్‌ కనుమరుగైనా, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అవే లక్షణాలతో మరో మేల్‌ క్రోమోజోమ్‌ రూపొందే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. మార్షల్‌ గ్రేవ్స్‌ వెల్లడించిన అంశాల ప్రకారం గత కొన్ని లక్షల సంవత్సరాలలో ’వై’ క్రోమోజోములోని జన్యువులు క్రమంగా క్షీణిస్తూ వస్తున్నాయి. వాస్తవానికి వై క్రోమోజోములో 1438 జన్యువులుంటాయి. కానీ, గత 300 మిలియన్‌ సంవత్సరాలలో ’వై’ క్రోమోజోములోని జన్యువుల సంఖ్య భారీగా పడిపోయింది. 1393 జీన్స్‌ మటుమాయమై, ప్రస్తుతం 45 జన్యువులు మాత్రమే ఉన్నాయి. అంటే మరో 11 మిలియన్ల సంవత్సరాల్లో ఆ మిగిలిన 45 జన్యువులు కూడా అంతర్ధానమయ్యే అవకాశం ఉంది.

జపాన్‌ శాస్త్రవేత్తల పరివోధన..
జపాన్‌లోని హక్కైడో విశ్వవిద్యాలయంలో అసటో కురోయివా నేతృత్వంలోని పరిశోధకులు స్పైనీ ఎలుకలలోని చాలా ్గ క్రోమోజోమ్‌ జన్యువులు ఇతర క్రోమోజోమ్లకు మారినట్లు కనుగొన్నారు. వారు క్రోమోజోమ్‌ ఎస్‌వోఎక్స్‌9 జన్యువు దగ్గర చిన్న డీఎన్‌ఏను గుర్తించారు. ఇది మగవారిలో ఉంటుంది కానీ ఆడవారిలో ఉండదు. ఈ డూప్లికేషన్‌ ఎస్‌వోఎక్స్‌9ను యాక్టివేట్‌ చేస్తుంది. ఇది పురుష అభివృద్ధిలో తప్పిపోయిన ఎస్‌ఆర్‌వై జన్యువు పాత్రను తీసుకుంటుంది. వై క్రోమోజోమ్‌ కోల్పోయినప్పుడు క్షీరదాలు ప్రత్యామ్నాయ లింగాన్ని నిర్ణయించే విధానాలను అభివృద్ధి చేయగలవని ఈ అధ్యయనం చెబుతోంది. మరొక చిట్టెలుక జాతి, మోల్‌ వోల్‌ కూడా దాని వై క్రోమోజోమ్ను కోల్పోయిన తరువాత కూడా మనుగడలో ఉంది.