ముంబై ఇండియన్స్ ఎందుకు ఓడిపోతోంది?

  ఐపీఎల్ ప్రారంభానికి ముందు అన్నింట్లోకి ఫేవరెట్ జట్టు ఏది అని ప్రశ్నిస్తే అందరూ ‘ముంబై ఇండియన్స్’ పేరే చెప్పేవారు. ఎందుకంటే ఇప్పటికే ఐదుసార్లు ఐపీఎల్ ను గెలిచిన ఆ జట్టు గత ఏడాది కూడా విజేతగా నిలిచింది. దీంతో ముంబై ఫేవరేట్ అన్నారు. కానీ వరుసగా ముంబై ఈ ఐపీఎల్ లో ఓడిపోతోంది. టీమిండియాకు ఆడే సగం మంది ముంబై ఇండియన్స్ లో ఉన్నా కూడా ఆ జట్టు రాణించలేకపోతోంది. నిన్న పంజాబ్ చేతిలోనూ దారుణంగా […]

Written By: NARESH, Updated On : April 24, 2021 12:35 pm
Follow us on

Mumbai : Mumbai Indians 

 

ఐపీఎల్ ప్రారంభానికి ముందు అన్నింట్లోకి ఫేవరెట్ జట్టు ఏది అని ప్రశ్నిస్తే అందరూ ‘ముంబై ఇండియన్స్’ పేరే చెప్పేవారు. ఎందుకంటే ఇప్పటికే ఐదుసార్లు ఐపీఎల్ ను గెలిచిన ఆ జట్టు గత ఏడాది కూడా విజేతగా నిలిచింది. దీంతో ముంబై ఫేవరేట్ అన్నారు.

కానీ వరుసగా ముంబై ఈ ఐపీఎల్ లో ఓడిపోతోంది. టీమిండియాకు ఆడే సగం మంది ముంబై ఇండియన్స్ లో ఉన్నా కూడా ఆ జట్టు రాణించలేకపోతోంది. నిన్న పంజాబ్ చేతిలోనూ దారుణంగా ఓడింది. అంత బలమైన టీం ఎందుకు ఓడిపోతోందన్నది ఇప్పుడు అందరి మెదళ్లలో మెదులుతున్న ప్రశ్న. దీనికి ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ సమాధానమిచ్చారు.

ముంబై బ్యాటింగ్ లైనప్ లో ఏదో మిస్ అయ్యిందని.. మే 20 ఓవర్లు బ్యాటింగ్ చేయలేకపోతున్నామని ముంబైకెప్టెన్ రోహిత్ శర్మ అభిప్రాయపడ్డారు. ఆ లోపాన్ని సరిదిద్దుకొని ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని రోహిత్ తెలిపాడు.

ఇక ముంబై నిన్న పంజాబ్ తో మ్యాచ్ లో 9 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడింది. ముంబై ఎక్కువ పరుగులు చేయలేకపోవడమే కారణం. 20 ఓవర్లలో 131 పరుగులు మాత్రమే చేసింది. బ్యాట్స్ మెన్ విఫలమయ్యారు. పిచ్ పై పరుగులు ఎలా చేయాలో పంజాబ్ బ్యాట్స్ మెన్ చూపించారు. మేం అది చేయలేకపోయాం. సూర్యకుమార్ ను వెనక్కి పంపింది అతడు స్పిన్ బాగా ఆడగలడని.. అందుకే ఇషాన్ కిషన్ ను ముందుకు పంపామని తెలిపారు.

దీన్ని బట్టి అరవీరభయంకరులైన ముంబై బ్యాట్స్ మెన్ సైతం ఐపీఎల్ లో అల్లాడుతున్నారు. పరుగులు చేయలేకపోతున్నారు. ముఖ్యంగా చెన్నై స్పిన్ పిచ్ పై పరుగులు చేయడానికి అందరూ తండ్లాడుతున్న పరిస్థితి నెలకొంది.