https://oktelugu.com/

RR Vs RCB 2024: వరుస విజయాల బెంగళూరు.. రాజస్థాన్ పై సాగించేనా జోరు..

వరుసగా ఆరు మ్యాచ్ లలో గెలిచినప్పటికీ రాజస్థాన్ జట్టును ఓడించడం బెంగళూరుకు అంత సులభం కాదు. అలాగని అసాధ్యం కూడా కాదు.. విరాట్ కోహ్లీ, డూ ప్లెసిస్, రజత్ పాటిదార్, దినేష్ కార్తీక్.. వంటి వారితో బెంగళూరు బ్యాటింగ్ బలంగా కనిపిస్తోంది.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : May 22, 2024 / 02:45 PM IST

    RR Vs RCB 2024

    Follow us on

    RR Vs RCB 2024: ఐపీఎల్ 17వ సీజన్లో భాగంగా బుధవారం అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా మరో ప్లే ఆఫ్ మ్యాచ్ జరగనుంది. సాయంత్రం ఏడు గంటల 30 నిమిషాలకు బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్, రాజస్థాన్ రాయల్స్ పోటీ పడనున్నాయి. లీగ్ దశలో మొదటి స్పెల్ లో ఒకే ఒక్క విజయం సాధించిన బెంగళూరు.. ఆ తర్వాతి స్పెల్ లో అద్భుతమైన విజయాలతో పుంజుకుంది. ఐపీఎల్ చరిత్రలో బెంగళూరు చేసిన పోరాటం ఓ అద్భుతం. ఎటువంటి ఆశలు లేని స్థాయి నుంచి ఛాంపియన్ గా నిలిచే వరకు బెంగళూరు చేరుకుంది. వరుసగా ఆరు మ్యాచ్ లు గెలిచి ప్లే ఆఫ్ కు వచ్చిన బెంగళూరు.. రాజస్థాన్ జట్టుపై ఎలా ఆడుతుందనేదే ఆసక్తికరంగా మారింది.

    వరుసగా ఆరు మ్యాచ్ లలో గెలిచినప్పటికీ రాజస్థాన్ జట్టును ఓడించడం బెంగళూరుకు అంత సులభం కాదు. అలాగని అసాధ్యం కూడా కాదు.. విరాట్ కోహ్లీ, డూ ప్లెసిస్, రజత్ పాటిదార్, దినేష్ కార్తీక్.. వంటి వారితో బెంగళూరు బ్యాటింగ్ బలంగా కనిపిస్తోంది. మాక్స్ వెల్ కూడా తన బ్యాట్ కు పని చెప్తే బెంగళూరుకు తిరుగుండదు. ఆల్ రౌండర్ రూపంలో గ్రీన్ ఎలాగూ ఉండనే ఉన్నాడు. బెంగళూరు వరుసగా చివరి ఆరు మ్యాచులు గెలిచేందుకు పై ఆటగాళ్లే కారణమయ్యారు. తొలి స్పెల్ లో వరుసగా ఓటములు ఎదుర్కొన్నప్పటికీ.. చివరి స్పెల్ లో ఆర్ మ్యాచులు గెలవడం బెంగళూరు పోరాట పటిమకు నిదర్శనం. ఇక మహమ్మద్ సిరాజ్ పేస్ బౌలింగ్ దళానికి నాయకత్వం వహిస్తున్నాడు. యష్ దయాల్ కూడా అద్భుతంగా రాణిస్తున్నాడు. కర్ణ శర్మ మధ్య ఓవర్లలో కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తున్నాడు. మాక్స్ వెల్ కూడా బంతితో అద్భుతాలు చేయగలడు. వీరంతా సమష్టిగా ఆడితే… బెంగళూరు ప్లే ఆఫ్ లో రాజస్థాన్ జట్టును ఓడించడం పెద్ద కష్టం కాదు.

    ఇక రాజస్థాన్ జట్టు చివరి ఐదు మ్యాచ్లను ఓడిపోయింది. లీగ్ దశలో బెంగళూరును రాజస్థాన్ ఓడించింది. కీలకమైన ప్లే ఆఫ్ మ్యాచ్ లో బట్లర్ వంటి ప్రమాదకరమైన ఆటగాడు లేకపోవడం రాజస్థాన్ జట్టుకు తీరని లోటు. అయితే బ్యాటింగ్ విభాగంలో సంజు సాంసన్, రియాన్ పరాగ్, యశస్వి జైస్వాల్, హిట్మేయర్, వంటి వారితో బలంగా కనిపిస్తోంది. రవిచంద్రన్ అశ్విన్, యజువేంద్ర చాహల్, బౌల్ట్ వంటి వారితో బౌలింగ్ కూడా పటిష్టంగా ఉంది. బ్యాటింగ్ విభాగంలో బెంగళూరు జట్టుతో సరి సమానంగా ఉన్న రాజస్థాన్.. బౌలింగ్ విభాగంలోనూ అదే విధంగా ఉంది. ఈ నేపథ్యంలో రాజస్థాన్ ఆటగాళ్లు అంచనాలకు మించి రాణిస్తే బెంగళూరు పై విజయం సాధించడం పెద్ద కష్టం కాదు.

    ఇక మంగళవారం అహ్మదాబాద్ వేదికగా జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ పై కోల్ కతా ఏకపక్ష విజయాన్ని సాధించింది. రెండు జట్లు హోరాహోరీగా పోరాడతాయనుకుంటే… హైదరాబాద్ కోల్ కతా బౌలర్ల ఎదుట చేతులెత్తేసింది. అయితే రాజస్థాన్, బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ రసవత్తరంగా సాగుతుందని క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు. ప్లే ఆఫ్ లో గెలిచిన ఏ జట్టైనా.. ఫైనల్ వెళ్లాలంటే కచ్చితంగా హైదరాబాద్ జట్టును ఓడించాలి. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్ పరంగా సమానంగా ఉన్న బెంగళూరు, రాజస్థాన్ జట్లలో.. ఎవరు గెలుస్తారో మరి కొద్ది గంటల్లో తేలనుంది.