Bazball: బజ్ బాల్ అంటే ఫాస్ట్ గా స్కోర్ చేయడం కాదు..దాని అర్థం ఏంటంటే..?

కొందరు మాత్రం ఇంగ్లాండ్ ఆట తీరు చూసి బజ్ బాల్ గేమ్ అంటే ఫాస్ట్ గా టి 20 లాగా ఎక్కువ రన్స్ కొట్టడం అని అనుకుంటున్నారు. కానీ బజ్ బాల్ అంటే అది కాదు.

Written By: Gopi, Updated On : February 28, 2024 10:49 am
Follow us on

Bazball: ప్రస్తుతం ఇండియా ఇంగ్లాండ్ టీమ్ ల మధ్య జరుగుతున్న 5 టెస్ట్ సీరీస్ ల్లో భాగంగా ఇప్పటికే ఆడిన నాలుగు మ్యాచ్ ల్లో 3-1 తేడాతో ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే ఇండియా సిరీస్ ను సొంత చేసుకుంది. ఇక ఇది ఇలా ఉంటే ఇంగ్లాండ్ టీం కి టెస్టుల్లో బ్రెండన్ మెక్ కలమ్ హెడ్ కోచ్ గా వచ్చినప్పటి నుంచి ఇంగ్లాండ్ బజ్ బాల్ గేమ్ ఆడుతూ భారీ విజయాలను అందుకుంటుంది. అసలు ఈ బజ్ బాల్ గేమ్ అంటే ఏంటి అనే డౌట్ ఇప్పటికే అందరికీ వచ్చే ఉంటుంది. అయితే కొందరు మాత్రం ఇంగ్లాండ్ ఆట తీరు చూసి బజ్ బాల్ గేమ్ అంటే ఫాస్ట్ గా టి 20 లాగా ఎక్కువ రన్స్ కొట్టడం అని అనుకుంటున్నారు. కానీ బజ్ బాల్ అంటే అది కాదు. ఒకవేళ ఫాస్ట్ గా పరుగులు చేస్తే బజ్ బ్యాట్ అనేవారు కానీ దాన్ని బజ్ బాల్ అని ఎందుకు అనేవారు…

మరి బజ్ బాల్ అంటే ఏంటంటే.. కెప్టెన్ అనే వాడు టీమ్ లో ఉన్న ప్లేయర్లందరిని సపోర్ట్ చేసుకుంటూ గ్రౌండ్ లో ఎవర్ని ఎవరు నిందించుకోకుండా అందరూ కలిసి మ్యాచ్ ని గెలిపించడం కోసం తీవ్రంగా కష్టపడి గెలవడం. అలాగే ఒక బౌలర్ కనక భారీ పరుగులు ఇచ్చినట్టైతే అతన్ని తిట్టకుండా నెక్స్ట్ ఓవర్లకు కూడా అతన్నే కంటిన్యూ చేస్తూ అతనిలో మోరల్ స్పిరిట్ నింపి అతని చేత వికెట్లు తీయించడమే బజ్ బాల్ గేమ్ యొక్క ముఖ్య ఉద్ధేశ్యం.. ఇక దీనికి ఉదాహరణగా టామ్ హార్ట్ లీ ని తీసుకుంటే… ఇండియా ఇంగ్లాండ్ టీమ్ ల మధ్య జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్ లో టామ్ హర్ట్ లీ ఇంగ్లాండ్ టీం తరఫున డెబ్యూ మ్యాచ్ ను ఆడాడు…

ఆ మ్యాచ్ లో ఆయన వేసిన మొదటి ఓవర్లోనే యశస్వి జైశ్వాల్ రెండు సిక్స్ లను కొట్టాడు. ఇక ఆ తర్వాత కూడా తను బౌలింగ్ చేస్తూ భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. అయిన ఇంగ్లాండ్ టీమ్ కెప్టెన్ అయిన బెన్ స్టోక్స్ తనని కంటిన్యూ చేస్తూనే వచ్చాడు. అక్కడ స్టోక్స్ కాకుండా వేరే కెప్టెన్ ఉంటే అతన్ని మార్చి వేరే వాళ్లతో బౌలింగ్ చేయించేవాడు. కానీ స్టోక్స్ మాత్రం మార్చకుండా హార్ట్ లీ తోనే 9 ఓవర్ల వరకు కంటిన్యూ చేసుకుంటూ తీసుకొచ్చాడు. బజ్ బాల్ అంటే ప్లేయర్లు ఫెయిల్ అయిన కూడా వారిని దగ్గరుండి మరి సపోర్ట్ చేస్తే వాళ్ళు బాగా పర్ఫార్మ్ చేయడానికి అవకాశం ఉంటుంది. దానివల్ల టీం కి మంచి జరుగుతుంది అనే ఒక ఉద్దేశ్యం తోనే ఇలాంటి టెక్నిక్ ని వాడుతుంటారు.

ఇక అందులో భాగంగా హార్ట్ లీ ఫస్ట్ ఇన్నింగ్స్ లో పెద్దగా ప్రభావం చూపించనప్పటికీ సెకండ్ ఇన్నింగ్స్ లో మాత్రం 7 వికెట్లు తీసి ఇంగ్లాండ్ టీం గెలుపులో కీలకపాత్ర వహించాడనే చెప్పాలి… అందుకే బజ్ బాల్ అంటే ఓన్లీ బ్యాటింగ్ కి సంబంధించింది మాత్రమే కాదు. ప్లేయర్లందరిని సపోర్ట్ చేసుకుంటూ ఎలాంటి మిస్టేక్స్ చేయకుండా మ్యాచ్ ను గెలిపించడమే బజ్ బాల్ గేమ్…