Players Urgent Washroom: క్రికెట్, వాలీబాల్ వంటి ఆటల్లో వాష్ రూమ్ అర్జెంట్ అయితే ప్లేయర్స్ బయటకు వెళ్ళవచ్చా?

క్రికెట్, వాలీబాల్, కబడ్డీ లేదా ఇతర ఏదైనా క్రీడల్లో అయినా సరే రూల్స్ చాలా స్ట్రిక్ట్ గా ఉంటాయి. ఒకసారి ఆట కోసం మైదానంలోకి అడుగు పెడితే ఆడుతూ ఉండాల్సిందే. వాళ్లు అవుట్ అయితే, లేదా మధ్యలో దెబ్బతగలడం లాంటివి సంభవిస్తేనే మైదానం విడిచి వెళ్ళాలి.

Written By: Neelambaram, Updated On : June 13, 2024 11:14 am

Players Urgent Washroom

Follow us on

Players Urgent Washroom: ప్రతి రోజు కాలకృత్యాలు తీసుకోకుండా రోజు ప్రారంభం అవదు. అదే విధంగా పనిలో ఉన్నప్పుడు ఎక్కడికి అయినా వెళ్లినా సరే ఎన్ని ఫెసిలిటీస్ ఉన్నా వాష్ రూమ్ ఫెసిలిటీ మాత్రం ఉండాలి అనుకుంటారు ప్రజలు. అందుకే బస్ స్టాండ్, రైల్వే స్టేషన్ అంటూ మరుగుదొడ్లను నిర్మించింది ప్రభుత్వం. పని చేస్తున్న శరీరం తన పని తాను చేస్తుంటుంది కాబట్టి బాత్రూమ్ వస్తే వెళ్లాల్సిందే. మరి క్రికెట్ లాంటి ఆటలు ఆడుతున్నప్పుడు కూడా ఇలాంటి పరిస్థితులు వస్తే ఏం చేస్తారు అనే అనుమానం ఎప్పుడైనా వచ్చిందా?

క్రికెట్, వాలీబాల్, కబడ్డీ లేదా ఇతర ఏదైనా క్రీడల్లో అయినా సరే రూల్స్ చాలా స్ట్రిక్ట్ గా ఉంటాయి. ఒకసారి ఆట కోసం మైదానంలోకి అడుగు పెడితే ఆడుతూ ఉండాల్సిందే. వాళ్లు అవుట్ అయితే, లేదా మధ్యలో దెబ్బతగలడం లాంటివి సంభవిస్తేనే మైదానం విడిచి వెళ్ళాలి. లేదంటే వీలు ఉండదు. అయితే ఎంత ఆట ఉన్నా సరే వాష్ రూమ్ ఎమర్జెన్సీకి మాత్రం ఈ రూల్ మినహాయింపు విధిస్తారట. కానీ ఆట సందర్బంలో ఇలాంటి పరిస్థితులు ఎదురవడం తక్కువనట.

సాధారణంగా ఆటలు ఆడుతున్నప్పుడు శరీరంలో ఉన్న నీరు అంతా చెమట రూపంలో బయటకు వెళ్ళిపోతుంది. మధ్య మధ్యలో డ్రింక్స్ బ్రేక్ లాంటివి ఉంటాయి కాబట్టి ప్లేయర్ కి వాష్ రూమ్ కి వెళ్లే అనుమతిస్తారు. అలాగే ఒక ప్లేయర్ తన ఇన్నింగ్స్ మొదలయ్యే ముందు కూడా వాష్ రూమ్ కి వెళ్లి వస్తాడు. లేదంటే ఆట మధ్యలో వాష్ రూమ్ కి వెళ్లాల్సిన పరిస్థితి వస్తే ఆ ప్లేయర్ వెళ్ళి వచ్చే పరిస్థిని కల్పిస్తారట.

గతంలో ఒకసారి ఇండియా, బంగ్లాదేశ్‌ మ్యాచ్ జరుగుతున్నప్పుడు మహేంద్ర సింగ్ ధోని వాష్ రూమ్ కి వెళ్ళారు. ఈ సందర్భంలో ధోని స్థానంలో కోహ్లీ బాధ్యతలు తీసుకున్నారు. బంగ్లాదేశ్ ఇన్నింగ్స్‌ లో 44 వ ఓవ‌ర్‌ లో ధోనీ వాష్ రూమ్ కి వెళ్లి 45 ఓవ‌ర్ ముగియ‌గానే వచ్చారట. ఇదే విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో ప్రస్తావించారు. అయితే ధోనీ మ్యాచ్ మధ్యలో బయటికి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? అని టీమిండియా మేనేజ‌ర్ బిశ్వ‌రూప్ దేయ్ ని అడిగారు. దానికి ఆయన ధోనీ వాష్ రూమ్ కి వెళ్లాల్సి వచ్చిందిని సమాధానం ఇచ్చారు. అలా ఆటల్లో కూడా వాష్ రూమ్ ఎమర్జెన్సీ ఉంటే రూల్స్ సడలింపు ఉంటుందంటున్నారు అధికారులు.