Phone Tapping Case: కేసీఆర్, కేటీఆర్ సేఫ్.. అధికారులే ‘బలిపశువులు’

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో నిందితులైన భుజంగరావు, తిరుపతన్నలు మరోమారు బెయిల్‌ కోసం నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. చార్జిషీట్‌ దాఖలు చేసినందున సహజంగానే వీరికి బెయిల్‌ రావాలి.

Written By: Raj Shekar, Updated On : June 13, 2024 11:18 am

Phone Tapping Case

Follow us on

Phone Tapping Case: తెలంగాణలో సంచలనం రేసిన ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో అధికారుల చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత బయటపడిన ఈ కేసులో ఇప్పటికే పలువురు అదికారులు అరెస్ట్‌ అయి జైల్లో ఉన్నారు. ఎస్‌ఐబీ చీఫ్‌గా ఉన్న ప్రభాకర్‌రావు మాత్రం విదేశాల్లో ఉంటున్నారు. మరోవైపు ఈ కేసుపై పోలీసులు ఇటీవలే చార్జిషీట్‌ కూడా దాఖలు చేశారు. అయినా.. నిందితులుగా జైల్లో ఉన్న అధికారులకు బెయిల్‌ కూడా రావడం లేదు.

నేతల జోలికి వెళ్లని అధికారుల..
ఇదిలా ఉంటే.. ఈ ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహరం అంతా గత పాలకుల కనసన్నల్లోనే జరిగింది అన్నది వాస్తవం. విచారణలో రాధాకిషన్‌రావు, తిరుపతన్న, భుజంగరావు విచారణలో ఇదే విషయం తెలిపారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌ ఆదేశాల మేరకే తాము ఫోన్‌ ట్యాపింగ్‌ చేశామని చెప్పారు. ఎవరెవరి ఫోన్లు ట్యాప్‌ చేశామన్న వివరాలను కూడా వెల్లడించారు. అయినా పోలీసులు అధికారులకు బెయిల్‌ రాకుండా చేస్తున్నారు తప్ప మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్‌ను టచ్‌ కూడా చేయడం లేదు.

మరోమారు బెయిల్‌ తిరస్కరణ..
ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో నిందితులైన భుజంగరావు, తిరుపతన్నలు మరోమారు బెయిల్‌ కోసం నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. చార్జిషీట్‌ దాఖలు చేసినందున సహజంగానే వీరికి బెయిల్‌ రావాలి. కానీ పోలీసులు మాత్రం వీరికి బెయిల్‌ ఇవ్వొద్దని కోర్టును కోరారు. బయటకు వస్తే సాక్షులను ప్రభావితం చేస్తారని, విచారణ ఇంకా కొనసాగుతుందని తెలిపారు. మరోవైపు భుజంగరావు, తిరుపతన్న తరఫున న్యాయవాదులు వాదనలు వినిపించారు. రాజకీయ దురుద్దేశంతోనే వీరిని అరెస్ట్‌ చేశారని తెలిపారు. వీరిపై ఎలాంటి ఆధారాలు లేవని వెల్లడించారు. చార్జిషీట్‌ దాఖలు చేసినా.. విచారణ కొనసాగుతోందని పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ కోర్టుకు తెలిపారు. దీంతో బెయిల్‌ పిటిషన్‌ను కోర్టు కొట్టేసింది.

సింపతీ వస్తుందనే..
ఇక రేవంత్‌ సర్కార్‌ ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో కేసీఆర్, కేటీఆర్‌ జోకిలి పోకపోవడానికి మరో కారణం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. వారిని అరెస్టు చేస్తే.. కక్షసాదింపు చేశారని గులాబీ నేతలు సిపతీ కోసం ప్రచారం చేసుకుంటారని కాంగ్రెస్‌ ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కారణంగానే ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంలో నేతల జోలికి వెళ్లడం లేదని అంటున్నారు.