Temple Bells: గుడిలో గంట కొడుతున్నారా? అయితే ఓ సారి తెలుసుకోవాల్సిందే

గుడిలోకి వెళ్లేటప్పుడు గంట కొడితే ఆ శబ్దంతో మన శరీరంలోని అన్ని రకాల ప్రతికూల శక్తులు తొలగిపోతాయి అంటున్నారు జ్యోతిష్యులు. శరీరం నుంచి అన్ని రకాల ప్రతికూల శక్తులు తొలగితే మనసు ప్రశాంతంగా ఉంటుంది.

Written By: Suresh, Updated On : June 13, 2024 11:02 am

Temple Bells

Follow us on

Temple Bells: భారతదేశం ఎన్నో దేవాలయాలకు ప్రసిద్ధి చెందింది. ప్రపంచ వ్యాప్తంగానే మన దేశంలో ఎక్కువ ఆలయాలు ఉన్నాయట. లెక్కలేనన్ని చిన్న, పెద్ద దేవాలయాలు ఉండి..మన సంస్కృతి, విశ్వాసాలకు ప్రసిద్ధి చెందింది. అయితే దేవాలయాల్లో సంప్రదాయాలు, నమ్మకాలను ప్రజలు నేటికీ పాటిస్తుంటారు. హిందూ ధర్మంలో దేవాలయానికి సంబంధించి ఎన్నో అద్భుతమైన విషయాలు మిలితమై ఉన్నాయి. వీటిలో ఒకటి గుడిలో గంట కొట్టడం. కొబ్బరి కాయ కొట్టడం. ఏ దేవుడి గుడైనా సరే కచ్చితంగా గంట అయితే ఉండాల్సిందే. గంట లేని గుడి ఉండదు. వెళ్లిన ప్రతి ఒక్కరు కూడా గంటను మోగిస్తారు. గంట కొట్టి దేవుడికి దండం పెడతారు. ఇలా ఎందుకు చేస్తారో మీకు తెలుసా?

గుడిలోకి వెళ్లేటప్పుడు గంట కొడితే ఆ శబ్దంతో మన శరీరంలోని అన్ని రకాల ప్రతికూల శక్తులు తొలగిపోతాయి అంటున్నారు జ్యోతిష్యులు. శరీరం నుంచి అన్ని రకాల ప్రతికూల శక్తులు తొలగితే మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఏకాగ్రతతో దేవుడిని పూజిస్తారు. అంతేకాదు గంట శబ్దం దేవుడికి ఎంతో ప్రీతికరమైందనే విశ్వాసం కూడా ఉంది. మరో విశ్వాసం ప్రకారం.. గంట కొట్టడం వల్ల భక్తులు గుడిలోకి వెళ్లడానికి దేవుడి అనుమతి కోరినట్టటా. గంట శబ్దం వల్ల శరీరంలో లేదా చుట్టుపక్కల వాతావరణంలోకి సానుకూల శక్తి ప్రవహించడానికి కూడా సహాయపడుతుందట.

మనసు ప్రశాంతంగా లేకపోయిన నెగిటివ్ ఆలోచనలు వస్తున్నా గంట కొట్టిన వెంటనే బాడీ యాక్టివ్ మోడ్ లోకి వస్తుంది. శంఖం, గంటల దివ్య శబ్దం శరీరంలోని ప్రతికూల శక్తిని, ఆలోచనను తొలగిస్తుందనే నమ్మకం కలదు. ఆలయంలో ఉన్న దేవతను చూడగానే మనసులో పాజిటివ్ ఎనర్జీ, ఆలోచనలు ప్రారంభం అవుతాయి. ఆ తర్వాత ప్రేమతో, భక్తితో తిరిగి వెళ్లేటప్పుడు మళ్లీ గంట మోగిస్తే ఆ పాజిటివ్ ఎనర్జీ గంట శబ్దంతో అయోమయానికి గురై మీలో నుంచి పోతుందంటారు పండితులు. అందుకే గుడి నుంచి తిరిగి వెళ్లేటప్పుడు గంట కొట్టకూడదట.

సృష్టి ప్రారంభమైనప్పుడు ప్రతిధ్వనించిన శబ్దం గంట శబ్దం అనే నమ్మకం కలదు. ఓంకారం మాటలతో ఈ స్వరం కూడా మేల్కొంటుంది. అంతేకాకుండా గంట మోగించడం వల్ల ఓంకారం మంత్రాన్ని పఠించే పుణ్యం లభిస్తుందట. మత విశ్వాసాల ప్రకారం మరో నమ్మకం కూడా ఉంది. గంట మోగించడం విగ్రహాలలో చైతన్యాన్ని మేల్కొల్పుతుంది అంటారు.