Rohit Sharma : టీమిండియా ఫైనల్ లో ఈ విజయం సాధించడం వెనక విరాట్ కోహ్లీ. ముఖ్యపాత్ర పోషించాడు. ఇక ఓవరాల్ గా జట్టుకు రోహిత్ శర్మ వెన్నెముకలాగా నిలిచాడు. రోహిత్ శర్మ కెప్టెన్ గా జట్టును ముందుండి నడిపించాడు. కీలకమైన మ్యాచ్ లలో అద్భుతమైన ఎన్నిసార్లు. ఇక విరాట్ టోర్నీ మొత్తం విఫలమైనప్పటికీ.. ఫైనల్ మ్యాచ్లో మాత్రం తన విశ్వరూపం చూపించాడు. వాస్తవానికి టోర్నీ మొత్తంలో విరాట్ సరిగా ఆడక పోవడంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఫైనల్ మ్యాచ్ లో సత్తా చూపించడంతో జేజేలు పలికారు. వాస్తవానికి విరాట్ వరుసగా విఫలమైనప్పుడు రోహిత్ ఎలా స్పందించాడు అనే విషయం చాలామందికి తెలియదు. అయితే దీనిపై టీమిండియా ఫీల్డింగ్ కోచ్ దిలీప్ అసలు విషయాన్ని వెల్లడించాడు.
విరాట్ పై నమ్మకం ఉంచాడు
“టి20 వరల్డ్ కప్ లో అన్ని మ్యాచ్ లలో విరాట్ ఆశించినంత స్థాయిలో గొప్ప ఇన్నింగ్స్ ఆగలేకపోయాడు. కానీ రోహిత్ అతనిపై నమ్మకం ఉంచాడు.. జట్టులో ఉండే వాతావరణం వేరు.. విరాట్ పై రోహిత్ పూర్తి భరోసాతో ఉన్నాడు. ఎందుకంటే కోహ్లీ లాంటి విలువైన ఆటగాడు మళ్లీ దొరకడని విషయం రోహిత్ కు తెలుసు. పైగా అతని అనుభవం డబ్బులు ఇస్తే దొరికేది కాదు. మెల్ బోర్న్ లో పాకిస్తాన్ జట్టుపై విరాట్ ఆడిన ఇన్నింగ్స్ రోహిత్ కు ఎప్పటికీ గుర్తే ఉంటుంది. అలాంటివాడు జట్టులో ఉంటే వచ్చే ఆశావాహ దృక్పథం వేరని రోహిత్ మాతో తరచూ చెప్పేవాడని” దిలీప్ వ్యాఖ్యానించాడు.
చివరి బంతికి అవుట్ అయ్యాడు..
“టి20 వరల్డ్ కప్ లో ఫైనల్ మ్యాచ్ దక్షిణాఫ్రికా తో భారత ఆడింది. ఆ మ్యాచ్లో కోహ్లీ ఆడిన ఇన్నింగ్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఓపెనర్ గా వచ్చిన అతడు 19 ఓవర్ చివరి బంతి వరకు ఆడాడు. ఆ చివరి బంతికి అతడు అవుట్ అయ్యాడు. ఈలోపు చేయాల్సిన విధ్వంసాన్ని చేసేసి వెళ్లిపోయాడు. 59 బంతులను ఎదుర్కొన్న అతడు ఆరు బౌండరీలు, రెండు సిక్సర్లతో 76 పరుగులు చేశాడు. రోహిత్ 9, రిషబ్ పంత్ 0, సూర్య కుమార్ యాదవ్ 3, వంటి ఆటగాళ్లు విఫలమైనప్పటికీ అక్షర్ పటేల్ 47, శివం దుబే 27 తో జట్టును పటిష్టమైన స్థితికి చేర్చాడు. ఏకంగా 176 పరుగుల భారీష్ కోర్ అందించాడు.. టోర్నీ మొత్తం విఫలమైనప్పటికీ విరాట్ ఫైనల్ మ్యాచ్లో సత్తా చాటాడు.. రోహిత్ నమ్మకం ఉంచడం వల్లే విరాట్ అలా ప్రతిభ చూపాడని” దిలీప్ వ్యాఖ్యానించాడు.
అప్పుడు రోహిత్ అలా వ్యాఖ్యానించాడు
ఇంగ్లాండ్ జట్టు పై మ్యాచ్ గెలిచిన తర్వాత విరాట్ వరుసగా విఫలమవుతున్నాడు కదా.. అతడికి ఎందుకు అవకాశాలు ఇస్తున్నారని.. మీడియా ప్రశ్నించగా.. రోహిత్ తనదైన శైలిలో సమాధానం చెప్పాడు. విరాట్ ఆట తీరు గురించి ప్రత్యేకంగా నేను చెప్పాల్సిన అవసరం లేదని.. అతడు ఎప్పుడైనా విజృంభిస్తాడని పేర్కొన్నాడు. అతడు చెప్పినట్టుగానే విరాట్ ఫైనల్ మ్యాచ్లో వీర విహారం చేశాడు. భారత జట్టును గెలిపించడంలో ముఖ్య భూమిక పోషించాడు. ఆ తర్వాత నెట్టింట రోహిత్ పై ప్రశంసల జల్లు కురిసింది.