eam India Captaincy Race : వన్డే వరల్డ్ కప్, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ గెలవాలనే ఆలోచన నేపథ్యంలో టీమిండియా కు వన్డే, టెస్ట్ ఫార్మాట్లలో రోహిత్ నాయకత్వం వహిస్తున్నాడు. వచ్చే ఏడాది వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ జరగనుంది. ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ లో టీమిండియా అగ్రస్థానంలో కొనసాగుతోంది. న్యూజిలాండ్, ఆస్ట్రేలియా చేతిలో వరుసగా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్స్ లో భారత్ ఓడిపోయిన నేపథ్యంలో.. ఈసారి ఎలాగైనా ట్రోఫీ దక్కించుకోవాలని భావిస్తోంది. ఇందులో భాగంగానే సెప్టెంబర్ 19 నుంచి స్వదేశం వేదికగా బంగ్లాదేశ్ జట్టుతో రెండు టెస్టుల సిరీస్ ఆడనుంది.. అయితే త్వరలో రోహిత్ శర్మ తన కెరియర్ కు ముగింపు పలుకుతాడని వార్తలు వినిపిస్తున్నాయి. 37 సంవత్సరాల రోహిత్ శర్మ 2027 వన్డే ప్రపంచ కప్ ఆడడం కష్టమనే చర్చలు సాగుతున్నాయి.. ఐసీసీ నిర్వహించే ఛాంపియన్ ట్రోఫీ పాకిస్తాన్ గడ్డపై వచ్చేయడాది జరగనుంది. యాభై ఓవర్ల వన్డే వరల్డ్ కప్ తర్వాత, ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీకే ఆ విలువ ఉంది. దీనిని మినీ వరల్డ్ కప్ అని కూడా పిలుస్తారు. ఒకవేళ ఛాంపియన్స్ ట్రోఫీ భారత్ గెలిస్తే రోహిత్ వన్డే క్రికెట్ కు వీడ్కోలు పలికే అవకాశం కనిపిస్తోంది. రోహిత్ నిష్క్రమిస్తే టీమిండియాలో కొత్త శాఖ మొదలవుతుంది. అయితే రోహిత్ తర్వాత జట్టును ఆ స్థాయిలో నడిపించే సత్తా ముగ్గురు ఆటగాళ్లకు ఉంది.
శ్రేయస్ అయ్యర్
బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ దక్కించుకోలేకపోయినప్పటికీ.. అయ్యర్ అద్భుతమైన ఆటగాడు..దులీప్ ట్రోఫీలో విఫలమవుతున్నప్పటికీ అతడు ఐపిఎల్ లో కోల్ కతా జట్టును విజేతగా నిలిపాడు. అయ్యర్ భయం లేకుండా బ్యాటింగ్ చేస్తాడు. తెలివిగా ఆలోచిస్తాడు. పైగా గౌతమ్ గంభీర్ తో పని చేసిన అనుభవం అయ్యర్ సొంతం.
హార్దిక్ పాండ్యా
హార్దిక్ పాండ్యా టీమ్ ఇండియాలో ఆల్ రౌండర్ గా కొనసాగుతున్నాడు. బౌలింగ్, బ్యాటింగ్ లో ఒకప్పటి కపిల్ దేవ్ ను లపిస్తున్నాడు.. 2022 ఐపీఎల్ సీజన్లో గుజరాత్ జట్టును అతడు విజేతగా నిలిపాడు. గంటకు 140 కిలోమీటర్ల వేగంతో బంతులు వేయగల సత్తా హార్దిక్ సొంతం. పైగా టి20 ఫార్మాట్ కు హార్దిక్ పాండ్యా వైస్ కెప్టెన్ గా వ్యవహరించాడు. కొన్ని సందర్భాల్లో నాయకత్వం కూడా వహించాడు.
రిషబ్ పంత్
ఐపీఎల్లో ఢిల్లీ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. పంత్ లో ఒక స్పార్క్ కనిపిస్తోంది. పైగా ధోని లాగా రిషబ్ పంత్ ఆలోచిస్తాడు. వికెట్ కీపర్ గా ఏ ఆటగాడినైనా సులభంగా అర్థం చేసుకుంటాడు. ఐపీఎల్ లో ఢిల్లీ జట్టును అతడు సమర్ధవంతంగా నడిపించాడు.