Largest Landowner : మనదేశంలో ఆగర్బ శ్రీమంతులుగా చాలామంది ఉన్నారు. వీరి వద్ద లక్షల ఎకరాలలో భూములు ఉన్నాయి. అధికారికంగా ఉన్న భూముల కంటే అనధికారికంగా ఉన్న భూముల విస్తీర్ణం అధికమని గతంలో పనామా లీక్స్ లో వెలుగులోకి వచ్చింది. ఆయనప్పటికీ ప్రభుత్వాలు వారిపై చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యాయి. అధికారంలోకి ఏ పార్టీ వచ్చినా వారిపై చర్యలు తీసుకునే సాహసం చేయలేవు కాబట్టి.. వారు అలాగే భూములను కూడబెట్టుకుంటూనే ఉంటారు. అయితే మన దేశంలో ఎక్కువ భూములు ఉన్నది అదానీ, అంబానీ వద్ద కాదు. భారత ప్రభుత్వం తర్వాత దేశంలో రెండవ అతిపెద్ద భూ యజమానిగా కాథలిక్ చర్చ్ ఆఫ్ ఇండియా నిలిచింది. 2021 ఫిబ్రవరి నాటికి ఈ సంస్థకు అన్ని రాష్ట్రాలలో కలిపి 17.29 కోట్ల ఎకరాల భూమి ఉంది. వీటిలో 2012 నాటికే 2,457 హాస్పిటల్స్ ఉన్నాయి. 240 మెడికల్, 240 నర్సింగ్ కాలేజీలు ఉన్నాయి. 14 వేలకు పైగా స్కూళ్లు ఉన్నాయి. చర్చిలు కూడా 14 వేలు ఉన్నాయి. ఇక మిగతా విస్తీర్ణంలో అనేక సంస్థలు ఉన్నాయి. బ్రిటిష్ పరిపాలకులు భారతదేశాన్ని పాలిస్తున్నప్పుడు ఇండియన్ చర్చి యాక్ట్ తీసుకొచ్చారు. అందువల్ల ఈ సంస్థకు భారీగా భూములు వచ్చాయి.. అయితే అప్పట్లో ఈ భూములను స్వాధీనం చేసుకోవడానికి ప్రభుత్వాలు ప్రయత్నించినప్పటికీ అది సాధ్యం కాలేదు. ఓటు బ్యాంకు రాజకీయాలు, తెర వెనుక వ్యవహారాల వల్ల భూముల స్వాధీనం సాధ్యం కాలేదు..
అనేక ఆరోపణలు
కాథలిక్ చర్చ్ ఆఫ్ ఇండియా వద్ద కోట్లకొద్ది ఎకరాల భూమి ఉన్న నేపథ్యంలో అనేక ఆరోపణలు వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా కేరళ, మిజోరామ్, మణిపూర్ ప్రాంతంలో విస్తారంగా భూములు ఉన్నాయి. 1/70 యాక్ట్ అమల్లో ఉన్న ప్రాంతంలోనూ ఈ సంస్థకు భారీగా భూములు ఉన్నాయి. పైగా క్రైస్తవ మతాన్ని విస్తరించే క్రమంలో ఈ సంస్థ పలు ప్రాంతాలలో అడ్డగోలుగా భూములను ఆక్రమించిందనే ఆరోపణలు ఉన్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఓ పత్రిక కాథలిక్ చర్చ్ ఆఫ్ ఇండియా ఆధీనంలో ఉన్న భూములపై ఓ విశ్లేషణాత్మక కథనాన్ని ప్రచురించింది. అది అప్పట్లో పెను సంచలనానికి దారితీసింది. పైగా అగస్టా ఆ వెస్ట్ ల్యాండ్ స్కాం కు, కాథలిక్ చర్చ్ ఆఫ్ ఇండియా బాధ్యులకు సంబంధం ఉందని ఆ పత్రిక తన కథనంలో పేర్కొంది. దీంతో అప్పటి రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించింది. అప్పట్లో కాథలిక్ చర్చ్ ఆఫ్ ఇండియా విశ్వాసులు ఆ పత్రిక కార్యాలయం పై దాడి చేసేందుకు ప్రయత్నించారు. ఆ తర్వాత ఏ మీడియా సంస్థ కూడా కాథలిక్ చర్చ్ ఆఫ్ ఇండియా వద్ద ఉన్న భూముల గురించి ఎటువంటి కథనాలను ప్రచురించలేదు. ప్రసారం చేయలేదు. అయితే కాథలిక్ చర్చ్ ఆఫ్ ఇండియా ఆధీనంలో ఉన్న భూములలో ఒక ఎకరం కూడా ఆక్రమణకు గురికాకపోవడం విశేషం..