WC 2019 Final: 2019లో వన్డే వరల్డ్ కప్ టోర్నీ జరిగింది. ఫైనల్ మ్యాచ్లో న్యూజిలాండ్, ఇంగ్లాండ్ తలపడ్డాయి. అయితే అనూహ్యంగా మలుపులు తిరిగిన ఫైనల్ మ్యాచ్ లో ఇంగ్లాండ్ గెలిచింది. తొలిసారిగా క్రికెట్ పుట్టిన దేశం వరల్డ్ కప్ సగర్వంగా తీసుకెళ్లింది.. దీనిపై అప్పట్లో విమర్శలు వ్యక్తమయ్యాయి. న్యూజిలాండ్ దేశానికి సంఘీభావంగా సోషల్ మీడియాలో పోస్టులు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో అప్పట్లో ఐసీసీ ఎటువంటి వివరణ ఇవ్వలేదు. పైగా ఫైనల్ మ్యాచ్ నిబంధనలకు అనుగుణంగానే జరిగిందని ప్రకటించింది. సరిగ్గా ఐదు సంవత్సరాలకు 2019 వన్డే వరల్డ్ కప్ గురించి చర్చ మొదలైంది. అందరూ అనుమానిస్తున్నట్టుగానే ఫైనల్ మ్యాచ్లో ఏదో జరిగిందని సంకేతాలు వ్యక్తం కావడం అభిమానులను ముఖ్యంగా న్యూజిలాండ్ క్రికెట్ ప్రేక్షకులను ఆవేదనకు గురి చేస్తున్నది.
2019 వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ఇంగ్లాండ్ లోని లార్డ్స్ మైదానంలో ఇంగ్లాండ్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగింది. ఈ మ్యాచ్ ఆద్యంతం ఉత్కంఠ గా సాగింది. న్యూజిలాండ్ ముందుగా బ్యాటింగ్ చేసి 242 పరుగులు చేసింది. ఆ తర్వాత ఇంగ్లాండ్ జట్టు చివరి వరకు పోరాడింది.. తొలిసారి టైటిల్ అందుకోవాలని ఇరు జట్లు లార్జెర్ దెన్ లైఫ్ అన్నట్టుగా పోటీపడ్డాయి. క్రమంలో చివరి ఓవర్ న్యూజిలాండ్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ వేశాడు. అతని బౌలింగ్లో నాలుగో బంతిని బెన్ స్టోక్స్ షాట్ ఆడాడు. మరో ఎండ్ లో అబ్దుల్ రషీద్ ఉన్నాడు. అతడు పరుగుకు వచ్చాడు..స్టోక్స్, రషీద్ ఒక పరుగు తీశారు. అప్పటికే ఆ బంతిని న్యూజిలాండ్ ఫీల్డ్ మార్టిన్ గుప్తిల్ అందుకున్నాడు. దానిని స్ట్రైకర్ ఎండ్ కు విసిరాడు. అయితే అది స్టోక్స్ బ్యాట్ కు తగిలి.. నేరుగా బౌండరీ వైపు వెళ్ళింది. దీంతో ఇంగ్లాండ్ జట్టుకు ఆరు పరుగులు (2+4) వచ్చినట్టు ఎంపైర్లు ప్రకటించారు. వాస్తవానికి పరుగు పూర్తి చేసే క్రమంలో స్టోక్స్ పూర్తిగా క్రీజ్ లోకి రాకముందే బంతి ఓవర్ త్రో కావడం విశేషం. ఈ నేపథ్యంలో ఐసీసీ నిబంధనల ప్రకారం 1+4 ఐదు పరుగులు మాత్రమే ఇవ్వాలి. ఈ విషయాన్ని గమనించలేని ఫీల్డ్ ఎంపైర్లు ఆరు పరుగులు ఇవ్వడం విశేషం. అనంతరం ఇంగ్లాండ్ మరో రెండు పరుగులు సాధించడంతో మ్యాచ్ టై (241) గా మారింది..
మ్యాచ్ టై అవడంతో ఫలితాన్ని సూపర్ ఓవర్ ద్వారా తేల్చాల్సి వచ్చింది. సూపర్ ఓవర్ లో ఇంగ్లాండ్ జట్టు గెలవడంతో తొలిసారిగా దక్కించుకుంది. నాటి ఫైనల్ మ్యాచ్లో ఫీల్డ్ ఎంపైర్ గా మా రైస్ ఎరాస్మాస్ వ్యవహరించాడు. ఈ సందర్భంగా నాటి ఫైనల్ మ్యాచ్ గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు. ” ఆరోజు ఫైనల్ మ్యాచ్. ఇంగ్లాండ్ జట్టుకు ఆరు పరుగులకు బదులుగా ఐదు పరుగులు ఇచ్చి ఉండాల్సిందని” అభిప్రాయపడ్డాడు..” నా సహచర ఎంపైర్ కుమార ధర్మసేన చెప్పేవరకు మా తప్పిదాన్నే మేము గుర్తించలేకపోయామని” ఎరాస్మస్ పేర్కొన్నాడు.. “మ్యాచ్ పూర్తయిన మరుసటి రోజు నేను బసచేసిన హోటల్ గది తలుపు తెరిచి బ్రేక్ ఫాస్ట్ కు వెళ్తున్న. అంతలోనే కుమార ధర్మసేన తన గది నుంచి బయటికి వచ్చాడు. మనం పెద్ద పొరపాటు చేశాం.. నువ్వు గమనించావా? అని ప్రశ్నించాడు. అప్పటికి గాని మా నిర్ణయం వల్ల ఏం జరిగిందో నాకు అర్థం కాలేదు. ఆ మ్యాచ్ సందర్భంగా ఆ న్యూజిలాండ్ ఫీల్డర్ విసిరిన బంతి బౌండరీ లైన్ తగలడంతో ఇద్దరం సిక్స్.. సిక్స్.. సిక్స్ అనే అనుకున్నాం. కానీ అసలు విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించలేకపోయామని” ఎరాస్మస్ అన్నాడు. సాంకేతికత ఇప్పటిలాగా అప్పుడు అభివృద్ధి చెందితే బాగుండేదని.. ఆనాటి నిర్ణయం వల్ల మాకు పెద్దగా బాధ కలిగించిన సందర్భంగాలేదని ఎరాస్మస్ అన్నాడు.