Western Australia Vs Tasmania: రెండు పరుగుల వ్యవధిలో 8 వికెట్లు.. క్రికెట్ లో ఇంతకంటే చెత్త రికార్డు మరొకటి ఉండదనుకుంటా?!

సాధారణంగా వన్డే క్రికెట్ అంటే బ్యాటర్ల ఆధిపత్యం కొనసాగుతూ ఉంటుంది. అరుదైన సందర్భాల్లో మాత్రమే బౌలర్ల హవా నడుస్తుంది. ఇప్పుడు మీరు చదవబోయే కథనంలో బౌలర్ల ప్రతాపం సరి కొత్తగా కనిపిస్తుంది.. ఇంతకీ ఏం జరిగిందంటే..

Written By: Anabothula Bhaskar, Updated On : October 25, 2024 5:03 pm

Western Australia Vs Tasmania

Follow us on

Western Australia Vs Tasmania: క్రికెట్ పుట్టింది ఇంగ్లాండ్ లో అయినప్పటికీ.. అది మరింతగా అభివృద్ధి చెందింది మాత్రం ఆస్ట్రేలియాలోనే.. అందుకే ఆస్ట్రేలియా క్రికెట్ మేనేజ్మెంట్ సరికొత్త ప్రయోగాలు చేస్తూ ఉంటుంది. అంతర్జాతీయ స్థాయి మ్యాచ్ లతో పాటు దేశవాళి క్రికెట్ లోనూ విభిన్న విధానాలను అమలు చేస్తూ ఉంటుంది. అందులో దేశవాళి క్రికెట్ లో వన్డే కప్ నిర్వహిస్తూ ఉంటుంది. అయితే ఈసారి జరుగుతున్న వన్డే కప్ లో వెస్ట్రన్ ఆస్ట్రేలియా డిపెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగింది. అయితే ఆ జట్టును టాస్మానియా జట్టు తీవ్రంగా ఇబ్బంది పెట్టింది. ఈ రెండు జట్లు తలపడిన మ్యాచ్లో ముందుగా వెస్ట్రన్ ఆస్ట్రేలియా బ్యాటింగ్ చేసింది. 53 పరుగులకు కుప్ప కూలింది. టాస్మానియా బౌలర్లు మెరుపు వేగంతో బౌలింగ్ చేయడంతో వెస్ట్రన్ ఆస్ట్రేలియా బ్యాటర్లు ఏ దశలోనూ కుదురుకోలేకపోయారు. నిలబడలేకపోయారు. వెస్ట్రన్ ఆస్ట్రేలియా ఓపెనర్ ఆర్ కి షార్ట్ చేసిన 22 పరుగులే టాప్ స్కోర్ కావడం విశేషం.. అతని తర్వాత బాన్ క్రాఫ్ట్ 14 పరుగులు చేసి సెకండ్ టాప్ స్కోరర్ గా నిలిచాడు. వాస్తవానికి వెస్ట్రన్ ఆస్ట్రేలియా ఒకానొక దశలో 51/2 తో పటిష్ట స్థితిలోనే ఉంది. అయితే టాస్మానియా బౌలర్లు ఒక్కసారిగా రెచ్చిపోయారు. కేవలం రెండు పరుగుల వ్యవధిలోనే మిగతా 8 వికెట్లను పడగొట్టారు. వెస్ట్రన్ ఆస్ట్రేలియా జట్టులోని ఆరుగురు ఆటగాళ్లు సున్నా పరుగులకు వెను తిరగడం విశేషం.. టాస్మానియా బౌలర్ వెబ్ స్టర్ కేవలం 17 పరుగులకే ఆరు వికెట్లను పడగొట్టాడు.. స్టాన్ లేక్ 3/12, టామ్ రోజర్స్ 1/12 సత్తా చాటారు.

8.3 ఓవర్లలో

అనంతరం 54 రన్స్ టార్గెట్ తో చేజింగ్ ప్రారంభించిన టస్మానియా 8.3 ఓవర్లలో కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని చేదించింది.. మిచెల్ ఓవెన్ 29, మాథ్యూ వేడ్ 21* పరుగులతో సత్తా చాటారు. దీంతో దేశవాళీ వన్డే కప్ లో వెస్ట్రన్ ఆస్ట్రేలియా దారుణమైన ఓటమిని మూటగట్టుకుంది. డిపెండింగ్ ఛాంపియన్ హోదాలో వెస్ట్రన్ ఆస్ట్రేలియా ఇలా ఆడడాన్ని ఆ జట్టు అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు..”ప్రారంభం అద్భుతంగా ఉంది. కానీ చూస్తుండగానే జట్టు కుప్పకూలిపోయింది. రెండు పరుగుల వ్యవధిలో ఇన్ని వికెట్లు కోల్పోవడం బాధగా ఉంది. బహుశా ఆటగాళ్లు పర ధ్యానంలో ఉన్నారనుకుంటా.. అందువల్లే ఇలా వచ్చి అలా వెళ్ళిపోయారు. మరో మ్యాచ్ ఆడేందుకు ముందు వారు ట్రైనింగ్ తీసుకోవాలి.. లేకపోతే మరింత దారుణమైన ఆట తీరును ప్రదర్శించే అవకాశం ఉందని” వెస్ట్రన్ ఆస్ట్రేలియా జట్టు అభిమానులు సోషల్ మీడియాలో వ్యాఖ్యానిస్తున్నారు.

రెండు పరుగుల వ్యవధిలోనే ..

వెస్ట్రన్ ఆస్ట్రేలియా స్కోర్ 15.4 ఓవర్లలో 52-3 వద్ద ఉన్నప్పుడు బాన్ క్రాఫ్ట్ అవుట్ అయ్యాడు..15.6 ఓవర్ వద్ద టర్నర్ అవుట్ అయ్యాడు. అప్పుడు జట్టు స్కోరు 52 పరుగులే.. అదే స్కోర్ వద్ద ఇంగ్లీస్ అవుట్ అయ్యాడు.. ఇక ఇదే స్కోర్ వద్ద కార్ట్ రైట్, కానోలి కూడా పెవిలియన్ చేరుకున్నారు. ఆ తర్వాత జట్టు స్కోర్ 53 పరుగుల వద్దకు చేరుకున్నప్పుడు రిచర్డ్ సన్, పారిస్ వరుస బంతుల్లో ఔట్ అయ్యారు.