https://oktelugu.com/

Unstoppable 4 with NBK  : అన్ స్టాపబుల్ 4′ కి రామ్ చరణ్..ఈ ఎపిసోడ్ లో ఫ్యాన్స్ కి ఊహించని వార్త చెప్పనున్న రామ్ చరణ్!

త్వరలోనే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కూడా ఈ టాక్ షో కి రాబోతున్నడాట. 'గేమ్ చేంజర్' మూవీ ప్రొమోషన్స్ లో భాగంగా ఆయన ఈ షోలో పాల్గొనబోతున్నట్టు తెలుస్తుంది. ఆయనతో పాటుగా డైరెక్టర్ శంకర్, మ్యూజిక్ డైరెక్టర్ థమన్, హీరోయిన్ కైరా అద్వానీ కూడా ఈ ఎపిసోడ్ లో ఉంటారట.

Written By:
  • Vicky
  • , Updated On : October 25, 2024 / 05:02 PM IST

    Unstoppable 4 with NBK 

    Follow us on

    NBK with Unstoppable 4 : యూత్ ఆడియన్స్ ని విశేషంగా ఆకట్టుకున్న ‘అన్ స్టాపబుల్ విత్ న్బక్’ సరికొత్త సీజన్ ఈరోజు రాత్రి నుండి మొదలు కానుంది. నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఈ బిగ్గెస్ట్ టాక్ షో ఇప్పటి వరకు మూడు సీజన్స్ ని పూర్తి చేసుకుంది. ఇప్పుడు నాల్గవ సీజన్ ని చంద్రబాబు నాయుడు ఎపిసోడ్ తో ప్రారంభించుకోనుంది. ఈ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో ని కూడా విడుదల చేసారు. గడిచిన 5 ఏళ్లలో చంద్రబాబు నాయుడు ఎదురుకున్న కష్టాలు, వంద రోజుల పరిపాలన, ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో తనకి ఉన్నటువంటి సాన్నిహిత్యం, ఇలా వీటి అన్నిటి గురించి మాట్లాడాడు. ఈ ఎపిసోడ్ నేడు రాత్రి నుండి ఆహా యాప్ లో స్ట్రీమింగ్ కానుంది.

    ఇది ఇలా ఉండగా త్వరలోనే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కూడా ఈ టాక్ షో కి రాబోతున్నడాట. ‘గేమ్ చేంజర్’ మూవీ ప్రొమోషన్స్ లో భాగంగా ఆయన ఈ షోలో పాల్గొనబోతున్నట్టు తెలుస్తుంది. ఆయనతో పాటుగా డైరెక్టర్ శంకర్, మ్యూజిక్ డైరెక్టర్ థమన్, హీరోయిన్ కైరా అద్వానీ కూడా ఈ ఎపిసోడ్ లో ఉంటారట. చిరంజీవి తో బాలయ్య బాబు కి ఎంత సాన్నిహిత్యం ఉందో తెలియదు కానీ, రామ్ చరణ్ తో మాత్రం ఎంతో మంచి సాన్నిహిత్యం ఉంది. ఒక స్నేహితుడి లాగా బాలయ్య రామ్ చరణ్ తో మాట్లాడుతాడు. ఎన్నో సందర్భాలలో వీళ్లిద్దరు కలిశారు కూడా. అలాగే ప్రభాస్ వచ్చిన ఎపిసోడ్ లో రామ్ చరణ్ తో జరిపిన ఫోన్ కాల్ సంభాషణ చూస్తే బాలయ్య కి రామ్ చరణ్ తో ఎంత చనువు ఉందో అర్థం అవుతుంది. అలా మొదటి నుండి మంచి ఆప్యాయతతో మెలిగే వీళ్లిద్దరు కలిసి ఒకే షోలో కనిపిస్తూ, సరదాగా ఒక గంటసేపు మాట్లాడుకుంటే అభిమానులకు చూసేందుకు కనుల పండుగే కదూ..వచ్చే వారం ఈ ఎపిసోడ్ కి సంబంధించిన షూటింగ్ జరుగుతుందట.

    ప్రతీ ఎపిసోడ్ లో లాగానే, ఈ ఎపిసోడ్ లో కూడా రామ్ చరణ్ కి బాగా అత్యంత సన్నిహితమైన వాళ్ళతో ఫోన్ కాల్ సంభాషణ జరుపుతారట. ఆ లిస్ట్ లో పవన్ కళ్యాణ్, ప్రభాస్, అల్లు అర్జున్ జూనియర్ ఎన్టీఆర్ వంటి వాళ్ళు ఉంటారట. వీరిలో రామ్ చరణ్ ఎవరికి ఫోన్ చేస్తాడో ప్రస్తుతానికి సర్ప్రైజ్ ఉంచారు. చూసేందుకు కనుల పండుగ లాగా ఉండబోయే ఈ ఎపిసోడ్, నవంబర్ నెలాఖరున కానీ, డిసెంబర్ మొదటి వారంలో కానీ, ఆహా యాప్ లో స్ట్రీమింగ్ చేయబోతున్నారట. ఇకపోతే రామ్ చరణ్ నటించిన ‘గేమ్ చేంజర్’ చిత్రం, అలాగే బాలయ్య బాబు- బాబీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం, ఈ రెండు కూడా సంక్రాంతి బరిలో ఉన్నాయి. గేమ్ చేంజర్ జనవరి 10వ తారీఖున విడుదల అవ్వబోతుండగా, బాలయ్య చిత్రం జనవరి 12 వ తేదీన విడుదల కాబోతుంది.