https://oktelugu.com/

Patas Movie: ‘పటాస్’ సినిమాల్లో కనిపించిన ఈ అమ్మాయి ఇప్పుడు ఎలా ఉందో తెలుసా?

సినిమాల్లో ఒక్క ఛాన్స్ వస్తే చాలు.. తమ జీవితం మారిపోతుందని కొందరు అనుకుంటారు. కానీ చాలా మంది సినిమాల్లో ఇలా కనిపించి.. ఆలా మాయమై పోయిన వారు చాలా మంది ఉన్నారు. అయితే వీరు చేసింది చిన్న పాత్రలే అయినా ఎప్పటికీ గుర్తుండిపోయాయి.

Written By:
  • Srinivas
  • , Updated On : October 25, 2024 / 05:08 PM IST

    patas actress

    Follow us on

    Patas Movie: సినిమాల్లో ఒక్క ఛాన్స్ వస్తే చాలు.. తమ జీవితం మారిపోతుందని కొందరు అనుకుంటారు. కానీ చాలా మంది సినిమాల్లో ఇలా కనిపించి.. ఆలా మాయమై పోయిన వారు చాలా మంది ఉన్నారు. అయితే వీరు చేసింది చిన్న పాత్రలే అయినా ఎప్పటికీ గుర్తుండిపోయాయి. ముఖ్యంగా సైడ్ క్యారెక్టర్ చేసిన కొంతమంది అమ్మాయిలు తమ పాత్రలకు గుర్తింపు వస్తుంది. కానీ ఆ తరువాత మరో సినిమాలో కనిపించడం లేదు. కానీ సోషల్ మీడియా పుణ్యామాని అప్పుడప్పుడు తమ లేటేస్ట్ ఫోటోలు షేర్ చేసి అలరిస్తూ ఉంటున్నారు. తాజాగా ‘పటాస్’ సినిమాలో నటించిన ఈ అమ్మాయి గురించి అందిరికీ తెలిసే ఉంటుంది. హీరోయిన్ తో సమానంగా గుర్తుండిపోయే కీలక పాత్రలో నటించింది. అయితే ఆ తరువాత కొన్ని సినిమాల్లో మాత్రమే కనిపించిన ఆమె ప్రస్తుతం ఏం చేస్తుందంటే?

    కళ్యాణ్ రామ్ కెరీర్ లో ది బెస్ట్ మూవీ ఏదంటే ‘పటాస్’ అని చెప్పొచ్చు. కామెడీతో పాటు సెంటిమెంట్, యాక్షన్ ప్రధానంగా వచ్చిన ఈ మూవీ అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించింది. డైరెక్టర్ అనిల్ రావిపూడి కెరీర్ కూడా ఈ సినిమాతోనే టర్న్ అయిందని చెప్పొచ్చు. ఇందులో కళ్యాణ్ రామ్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించి అలరించారు.అలాగే ఇందులో సాయికుమార్ కూడా ప్రధాన పాత్రలో నటించారు. అయితే ఇందులో మూగ, చెవిటి అమ్మాయి పాత్రలో నటించిన అమ్మాయి అందరికీ గుర్తుండే ఉంటుంది. ఈమె పేరు ప్రాచి థాకేర్.

    ‘పటాస్’ సినిమా తరువాత ప్రాచి థాకేర్ తెలుగుతో పాటు గుజరాతీ సినిమాల్లో నటించింది. తెలుగులో పటాస్ తరువాత ‘లవ్ యూ టూ’, రాడో, అజయ్ గాడి కోడి పులావ్ వంటి చిత్రాల్లో నటించిందింది. అయితే సినిమాల్లో పెద్దగా అవకాశాలు రాకపోవడంతో వెబ్ సిరీసుల్లో అవకాశాలు తెచ్చుకుంది. ఈ క్రమంలో కెప్టెన్ బహదూర్ వంటి వెబ్ సిరీసుల్లో నటించింది. అయితే సినిమాల్లో నటిస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉంటోంది. తాజాగా ఈమెకు సంబంధించిన లేటేస్ట్ ఫోటోలను షేర్ చేసింది.

    అయితే తాజాగా షేర్ చేసిన ఈ బ్యూటీ ఫోటోలు కుర్రకారును ఆకట్టుకుంటోంది. ఇందులో హాట్ హాట్ గా కనిపిస్తున్న ఈ బ్యూటీ తన అంద చందాలతో ఆకట్టుకుంటోంది. అయితే లేటేస్టుగా సినిమాల్లో నటిస్తున్నారా? అని కొందరు కామెంట్ చేస్తున్నారు. కానీ ఈ అమ్మడు మాత్రం ఎటువంటి సమాధానం లేవడం లేదు. కానీ కచ్చితంగా సినిమాల్లో నటించే అవకాశం వస్తే మాత్రం నటించడానికి రెడీగా ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా హీరోయిన్ గా అవకాశం వస్తే రెడీ అనడానికి సిద్ధంగా ఉంది.

    ఇప్పటి వరకు సినిమాల్లో కనిపించి ఆ తరువాత కనుమరుగై రీ ఎంట్రీ ఇచ్చిన వాళ్లు ఎంతో మంది ఉన్నారు. వాళ్లలాగే ప్రాచి థాకేర్ రీ ఎంట్రీ ఇస్తుందని అంటున్నారు. వైట్ ప్రాక్ వేసుకొని అందాలు ఆరబోస్తన్న ఈ భామ కుర్రకారుకు పిచ్చెక్కి్స్తోంది. అయితే ముందు ముందు ప్రాచి థాకేర్ ఏ సినిమాల్లో కనిపిస్తుందో చూడాలి అని అందరూ కామెంట్ చేస్తున్నారు.