Kohli vs Ganguly: వన్డే జట్టు కెప్టెన్ గా విరాట్ కోహ్లిని తొలగించడంతో బీసీసీఐ అప్రదిష్ట మూటగట్టుకుంది. దీంతో బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీపై విమర్శల వెల్లువ కొనసాగుతోంది. అభిమానులు గంగూలీని టార్గెట్ చేస్తూ విరాట్ కు మద్దతుగా పోస్టులు పెడుతున్నారు. దీంతో దీనిపై గంగూలీ వివరణ ఇచ్చినా అభిమానుల్లో ఆందోళనలు తగ్గడం లేదు. సామాజిక మాధ్యమాల్లో అభిమానుల ఆగ్రహం పెరుగుతూనే ఉంది. దీంతో కోహ్లి అభిమానులు నెట్టింట్లో పోస్టుల పరంపర కొనసాగిస్తున్నారు.
దక్షిణాఫ్రికా పర్యటనకు ముందే కోహ్లిని వన్డే జట్టు కెప్టెన్సీ నుంచి తప్పించారు. ఇదంతా బీసీసీఐ చూసుకుంటుంది తనకు ఏమి సంబంధం లేదని గంగూలీ చెబుతున్నా ఇందులో ఆయన ప్రమేయమే ఎక్కువగా ఉందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీంతోనే గంగూలీపై విమర్శల పరంపర అధికమవుతోంది.
అయితే కోహ్లిని తొలగించడంతో అభిమానుల్లో వ్యతిరేకత వచ్చింది. బీసీసీఐ నిర్వాకంతో అందరిలో ఆశ్చర్యం కలుగుతోంది. విరాట్ ప్రతిభ గల కెప్టెన్ అయినా అతడిని తప్పించడానికే ప్రాధాన్యం ఇవ్వడం పట్ల రాజకీయాలు చోటుచేసుకున్నాయని తెలుస్తోంది. దీంతో విరాట్ అభిమానులు తీవ్రంగా స్పందిస్తున్నారు.
Also Read: Sachin Tendulkar: టీమిండియాలోకి సచిన్ పునరాగమనం చేసేనా?
ఈ నేపథ్యంలో బీసీసీఐకి వ్యతిరేకంగా అభిమానులు పలు వ్యాఖ్యలు చేస్తున్నారు. గంగూలీ పాత్రపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. విరాట్ కోహ్లిని బలిపశువును చేశారని ఆరోపనణలు చేస్తున్నారు. దీనికి గంగూలీ మద్దతుదారులు కూడా స్పందిస్తున్నారు. దీంతో కోహ్లి వర్సెస్ గంగూలీగా పోస్టులు పెరిగిపోతున్నాయి.
Also Read:Team India: టీమిండియాలో ఆధిపత్యపోరుకు ముగింపు పలికేదెవరు?