https://oktelugu.com/

Shruti Haasan: బాలయ్య కోసం లుక్ మార్చబోతున్న శ్రుతి హాసన్ !

Shruti Haasan: ‘అఖండ’తో బాక్సాఫీస్ దగ్గర ‘నటసింహం బాలయ్య’ చెలరేగిపోయాడు. మొత్తానికి కలెక్షన్ల సునామీ చూపిస్తున్నాడు. అఖండ ఇచ్చిన అఖండమైన విజయంతో మిగిలిన సినిమాల విషయంలో కూడా వేగం పెంచాడు. ప్రస్తుతం షార్ప్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రాబోతున్న ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ కోసం డేట్లు కూడా కేటాయించాడు. ఇక తన లుక్ ను మార్చడానికి బాలయ్య డైట్ ను మార్చబోతున్నాడు. అన్నట్టు బాలయ్యతో పాటు శ్రుతి హాసన్ కూడా ఈ సినిమా కోసం తనదైన […]

Written By:
  • Shiva
  • , Updated On : December 18, 2021 / 02:18 PM IST
    Follow us on

    Shruti Haasan: ‘అఖండ’తో బాక్సాఫీస్ దగ్గర ‘నటసింహం బాలయ్య’ చెలరేగిపోయాడు. మొత్తానికి కలెక్షన్ల సునామీ చూపిస్తున్నాడు. అఖండ ఇచ్చిన అఖండమైన విజయంతో మిగిలిన సినిమాల విషయంలో కూడా వేగం పెంచాడు. ప్రస్తుతం షార్ప్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రాబోతున్న ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ కోసం డేట్లు కూడా కేటాయించాడు. ఇక తన లుక్ ను మార్చడానికి బాలయ్య డైట్ ను మార్చబోతున్నాడు. అన్నట్టు బాలయ్యతో పాటు శ్రుతి హాసన్ కూడా ఈ సినిమా కోసం తనదైన శైలిలో కసరత్తులు మొదలు పెట్టింది.

    Shruti Haasan


    అయితే, హీరోయిన్ శృతి హాసన్ ఈ సినిమా కోసం ప్రస్తుతం లావు పెరగడానికి తన డైట్ ను మార్చుకుంది. నిజానికి శృతి హాసన్ కి జీరో సైజ్ అంటే ఎక్కువ మక్కువ. అందుకే, 30 ప్లస్ లో కూడా నాజూకు తనాన్ని బాగా మెయింటైన్ చేస్తోంది. ఆ మెయింటెనెన్స్ కోసం జిమ్ లోనే ఎక్కువ కాలం గడిపే శృతి హాసన్.. మొత్తానికి జిమ్ కూడా మానేసింది. అసలు శృతి హాసన్ మొదటి నుంచి సన్నగానే ఉంటుంది

    అయితే, ఈ ముదురు భామ ఇప్పుడు ఉన్నట్టు ఉండి బాలయ్య సినిమా కోసం ఇలా పూర్తిగా వర్కౌట్స్ మానడం ఆశ్చర్యకరమే. బాలయ్య సినిమాలో శృతి హాసన్ సరికొత్త లుక్ లో కనిపించబోతుంది. గోపీచంద్ మలినేని బాలయ్య సరసన హీరోయిన్ గా శృతి హాసన్ ఫైనల్ చేసినప్పటి నుంచే.. శృతి హాసన్ తన పాత్ర కోసం తన డైట్ ను పూర్తిగా మార్చుకుందట.

    ఇంతకీ శృతి హాసన్ పాత్ర ఏమిటంటే.. ఈ సినిమాలో ఆమెది ఒక సాధారణ హౌస్ వైఫ్ పాత్ర. ఆ పాత్రలో బాలయ్య భార్యగా శృతి హాసన్ నటించబోతుంది. మరి భార్య పాత్ర కాబట్టి.. కాస్త ఒళ్ళు ఉంటే బాగుంటుందని దర్శకుడు మలినేని గోపీచంద్ శృతి హాసన్ ను కోరాడు. మలినేనికి శృతి హాసన్ కి మంచి అనుబంధం ఉంది. ఆమెకు రెండు హిట్లు ఇచ్చాడు.

    Also Read: Pushpa: అక్కడ సరైన ప్రమోషన్స్​ లేకున్నా.. పుష్పరాజ్ అస్సలు​ తగ్గలేదుగా?

    అందుకే, గోపీచంద్ మలినేని కోరడంతో శృతి హాసన్ ప్రస్తుతం బాగా తిని ఒళ్ళు పెంచే పనిలో నిమగ్నం అయింది. గత కొన్ని రోజులుగా ఫుడ్ విషయంలో ప్రయోగాలు చేస్తోంది. లావు పెరగడానికి శృతి హాసన్ ఎక్కువగా జంక్ ఫుడ్ తింటుందట. షూటింగ్ కి మరో నెల మాత్రమే గడువు ఉంది కాబట్టి.. బరువు పెరగడానికి ఫుడ్ విషయంలో ఎలాంటి కండిషన్స్ పెట్టుకోలేదట. మరి శృతి హాసన్ చివరకు ఎలా కనిపిస్తోందో చూడాలి.

    Also Read: Alia Bhatt: సెట్స్​లో నాగ్​ ఎప్పుడెప్పుడొస్తాడా అని ఎదురుచూసేవాళ్లం- అలియా

    Tags