https://oktelugu.com/

2021 Highest collections First Day Movie: 2021లో తొలిరోజు అత్యధిక కలెక్షన్లు రాబట్టిన చిత్రాలివే..!

2021 Highest collections First Day Movie: 2021 సంవత్సరం సినిమా పరిశ్రమకు మిక్స్ డ్ రిజల్ట్ ను మిగిల్చింది. 2020లో కరోనాతో ఇండస్ట్రీ కుదేలవగా 2021 నాటికి కొంత పరిస్థితులు చక్కబడ్డాయి. ఈ ఏడాదిలో కరోనా ఆంక్షల మధ్యే షూటింగులు కొనసాగాయి. చిన్న సినిమాలన్నీ ఓటీటీ బాటపట్టగా పెద్ద సినిమాలను మాత్రం థియేటర్లనే నమ్ముకున్నాయి. దీంతో ఈ ఏడాది పలు పెద్ద, చిన్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు రాబట్టి టాలీవుడ్ సత్తా ఏంటో […]

Written By: , Updated On : December 18, 2021 / 02:57 PM IST
Follow us on

2021 Highest collections First Day Movie: 2021 సంవత్సరం సినిమా పరిశ్రమకు మిక్స్ డ్ రిజల్ట్ ను మిగిల్చింది. 2020లో కరోనాతో ఇండస్ట్రీ కుదేలవగా 2021 నాటికి కొంత పరిస్థితులు చక్కబడ్డాయి. ఈ ఏడాదిలో కరోనా ఆంక్షల మధ్యే షూటింగులు కొనసాగాయి. చిన్న సినిమాలన్నీ ఓటీటీ బాటపట్టగా పెద్ద సినిమాలను మాత్రం థియేటర్లనే నమ్ముకున్నాయి. దీంతో ఈ ఏడాది పలు పెద్ద, చిన్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు రాబట్టి టాలీవుడ్ సత్తా ఏంటో మరోసారి ప్రేక్షకులకు చూపించింది.

2021 Highest collections First Day Movie

Allu Arjun Pushpa

కరోనా ఎంట్రీకి ముందు బాలీవుడ్ సినిమాలతో సమానంగా టాలీవుడ్ సినిమాలు కలెక్షన్లు రాబట్టాయి. తొలిరోజే 40కోట్ల మేర షేర్ సాధించిన సినిమాలు టాలీవుడ్లో ఉన్నాయి. అయితే కరోనా ఎంట్రీతో పరిస్థితులన్నీ మారిపోయింది. ఒకప్పుడు వంద కోట్ల వసూలు చేసిన హీరోల సినిమాలు సైతం కరోనా సమయంలో 30కోట్ల వసూళ్లకే పరిమితమయ్యాయి.

ఈక్రమంలోనే కరోనా సెకండ్ వేవ్ తర్వాత పలు పెద్ద సినిమాలు హిట్ టాక్ దక్కించుకున్నాయి. ‘ఉప్పెన’ లాంటి సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్టందుకోగా పవన్ కల్యాణ్ నటించిన రీ ఎంట్రీ మూవీ ‘వకీల్ సాబ్’ భారీ వసూళ్లను రాబట్టి బాక్సాఫీస్ వద్ద పవర్ స్టామీనాను మరోసారి నిరూపించింది.

రీసెంట్ గా ‘అఖండ’తో మొదలైన ప్రభంజనాన్ని ఆ తర్వాత వచ్చిన ‘పుష్ప’ కంటిన్యూ చేస్తున్నాడు. దీంతో 2021 ఏడాదిలో తొలిరోజు అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాలెంటో తెలుసుకునేందుకు అభిమానులు ఆసక్తిని కనబరిస్తున్నారు. ఈ సంవత్సరం ముగింపుకు చేరుకోవడంతో ఆ చిత్రాలంటో మనం కూడా ఓసారి లుక్కేద్దాం పదండి..

2021లో తొలిరోజు బాక్సాఫీస్ కింగ్ రికార్డు ఇప్పటికీ కూడా ‘వకీల్ సాబ్’ పేరు మీదే ఉంది. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో వచ్చిన ‘వకీల్ సాబ్’ తొలిరోజు నుంచే మంచి వసూళ్లను రాబట్టింది. పవన్ కెరీర్లోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా ‘వకీల్ సాబ్’ నిలిచింది. తొలిరోజే ఏకంగా 32.24కోట్ల షేర్ ను తెలుగు రాష్ట్రాల్లో వకీల్ సాబ్ రాబట్టాడు.

Also Read: అక్కడ సరైన ప్రమోషన్స్​ లేకున్నా.. పుష్పరాజ్ అస్సలు​ తగ్గలేదుగా?

ఆ తర్వాత ప్లేసులో అల్లు అర్జున్ ‘పుష్ప’ నిలిచింది. ఏపీ, తెలంగాణలో ఈ మూవీకి 24.90కోట్ల షేర్ వచ్చిందని తెలుస్తోంది. బాలయ్య నటించిన ‘అఖండ’ మూవీ ఆ తర్వాతి స్థానంలో నిలిచింది. ఏపీ, తెలంగాణలో 15.39కోట్ల షేర్ ను ‘అఖండ’ తొలి రోజే రాబట్టింది. పంజా వైష్ణవ్ తేజ్ నటించిన ‘ఉప్పెన’ తొలి రోజు 9.35కోట్ల షేర్ వచ్చింది.

అదేవిధంగా నాగచైతన్య ‘లవ్ స్టోరీ’ 6.94కోట్లు, రవితేజ ‘క్రాక్’ 6.25కోట్లు, తమిళ విజయ్ నటించిన ‘మాస్టర్’ 5.76కోట్లు, రామ్ పోతినేని ‘రెడ్’ 5.47కోట్లు, అఖిల్ నటించిన ‘మోస్ట్ ఎలిబిబుల్ బ్యాచిలర్’ మూవీ 5.45కోట్ల షేర్ ను తెలుగు రాష్ట్రాల్లో రాబట్టాయి. మొత్తంగా 2021లో తొలి రోజు హైయ్యస్ట్ షేర్స్ సాధించిన చిత్రంగా మాత్రం ‘వకీల్ సాబ్’ రికార్డు సృష్టించింది. దీంతో పవన్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.

Also Read: పుష్ప ఓటీటీ స్ట్రీమింగ్​కు​ డేట్​ ఫిక్స్​.. ఎప్పుడో తెలుసా?