Virat Kohli Fitness: కొన్ని చెప్పుకోవాలి. కొందరి గురించి కచ్చితంగా చెప్పుకోవాలి. అలాంటి వారిని స్ఫూర్తిగా తీసుకొని మరి కొంతమంది వస్తారు. యావత్ క్రికెట్ రంగాన్ని సమూలంగా మార్చేస్తారు. ఆధునిక క్రికెట్ లో శరీర సామర్థ్యాన్ని సక్రమంగా నిర్వహించే ప్లేయర్లు కొంతమంది మాత్రమే. అందులో కచ్చితంగా విరాట్ కోహ్లీకి ఫస్ట్ ప్లేస్ ఉంటుంది. ఇందులో అనుమానమే లేదు. అతిశయోక్తి అంతకన్నా లేదు.
న్యూజిలాండ్ జట్టుతో జరిగిన వన్డే సిరీస్ ను గమనిస్తే.. విరాట్ కోహ్లీ ఒక సెంచరీ, ఒక హాఫ్ సెంచరీ చేశాడు. ఇండియా తరఫున హైయెస్ట్ రన్స్ కొట్టిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. వాస్తవానికి విరాట్ కోహ్లీ 2008 నుంచి క్రికెట్ ఆడుతూనే ఉన్నాడు. ఇన్ని సంవత్సరాల నుంచి క్రికెట్ ఆడుతున్నప్పటికీ.. అతడికి అలుపు అనేది లేదు. పైగా బెబ్బులి మాదిరిగా ప్రత్యర్థి బౌలర్ల మీద విరుచుకుపడుతుంటాడు. ఏమాత్రం భయం అనేది లేకుండా బ్యాటింగ్ చేస్తుంటాడు. ఫీల్డింగ్ విషయంలో అతడికి అతడే సాటి. ముందుగా బ్యాటింగ్ చేయడాని కంటే.. చేజింగ్ లోనే అతడు ఎక్కువ సత్తాను చూపిస్తాడు.
టెస్ట్, టీ 20 ల నుంచి తప్పకుండా తర్వాత విరాట్ కోహ్లీ పరిమితం ఓవర్ల క్రికెట్ మాత్రమే ఆడుతున్నాడు. వాస్తవానికి కెరియర్ చివరి దశలో ఉన్న విరాట్ కోహ్లీ.. తన పూర్వపు ఫామ్ కొనసాగిస్తున్నాడు. వేదికతో సంబంధం లేకుండా.. ప్రత్యర్థి జట్టుతో సంబంధం లేకుండా పరుగులు తీస్తున్నాడు. ఇండోర్ వేదికగా జరిగిన మూడో వన్డేలో విరాట్ కోహ్లీ న్యూజిలాండ్ ఇన్నింగ్స్ లో 50 ఓవర్ల పాటు ఫీల్డింగ్ చేశాడు. పైగా అత్యంత కీలకమైన స్థానాలలో అతడు బంతిని నిలుపుదల చేశాడు. నాలుగో ఓవర్లో బ్యాటింగ్ కు వచ్చాడు. 46 ఓవర్ వరకు బ్యాటింగ్ చేశాడు. 108 బంతుల్లో 124 పరుగులు చేశాడు. దీనినిబట్టి విరాట్ కోహ్లీ సామర్థ్యం ఏమిటో అర్థం చేసుకోవచ్చు.
క్రికెటర్లు చాలామంది తమ సామర్థ్యాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నాలు చేస్తుంటారు. కొందరు విజయవంతం అయితే.. మరికొందరు విఫలమవుతుంటారు. దీర్ఘ కాలం మాత్రం తమ శరీర సామర్థ్యాన్ని కొనసాగించలేరు. కానీ ఈ విషయంలో విరాట్ కోహ్లీ అందరికంటే పూర్తి డిఫరెంట్. అతడు తినే తిండి, తాగే నీరు.. ప్రతిదీ ప్రత్యేకమే. అందువల్లే అతడిని ఫిట్నెస్ ప్రీక్ అని పిలుస్తుంటారు.
