Mana Shankara Vara Prasad Garu Success: ఒక సినిమా సక్సెస్ వెనుక 24 క్రాఫ్ట్స్ పడిన కష్టమైతే కనిపిస్తుంది. ముఖ్యంగా దర్శకుడు ఒక కథను నమ్మి దానిని సెట్స్ మీదకు తీసుకెళ్తాడు. కాబట్టి అతనికి ఆ సినిమా పట్ల ఎక్కువ బాధ్యత అయితే ఉంటుంది. అలాగే ఆ సినిమాలో నటించిన హీరో సైతం స్క్రీన్ మీద తనను తాను ప్రూవ్ చేసుకోవాలనే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అందువల్ల తను కూడా ఆ సినిమాలో ఇన్వాల్వ్ అయి సినిమా ఎలా వస్తుంది అనే విషయంలో చాలా కేర్ఫుల్ గా వ్యవహరిస్తూ ఉంటాడు. ఇక ఇలాంటి క్రమంలోనే యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్న నటులు చాలా మంది ఉన్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే ముందుకు దూసుకెళ్తుండడం విశేషం…
70 సంవత్సరాల పైబడిన వయసులో కూడా ఆయన సినిమా కోసం కష్టపడుతున్నాడు అంటే మామూలు విషయం కాదు. మన శంకర్ వరప్రసాద్ సినిమాతో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే ఈ సినిమా సక్సెస్ కి కారణం ఎవరు? మెగాస్టార్ చిరంజీవి సినిమాలో నటించడం వల్ల ఈ సినిమా సూపర్ సక్సెస్ అయిందా?లేదంటే అనిల్ రావిపూడి డైరెక్షన్ చేయడం వల్ల ఈ సినిమా సక్సెస్ ఫుల్ గా నిలిచిందా? అనేది ప్రతి ఒక్కరు మైండ్లో మెదులుతుంది.
నిజానికి మెగాస్టార్ చిరంజీవి నటించడం కంటే కూడా అనిల్ రావిపూడి ఈ సినిమాకి సరైన కథని ఎంచుకొని ప్రేక్షకులకు తగ్గట్టుగా ఈ సినిమాని స్క్రీన్ మీద ప్రజెంట్ చేశాడు. దానివల్ల సినిమా సూపర్ సక్సెస్ అయిందని భావించే వారు సైతం చాలా మంది ఉన్నారు…ఇక ఇప్పటివరకు అపజయం ఎరుగని దర్శకుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్న అనిల్ రావిపూడి డైరెక్షన్ చేయడం, అలాగే ఆయన క్రేజ్ ఈ సినిమాకి చాలా వరకు ప్లస్ అయిందని చాలా మంది భావిస్తున్నారు…
ఈ సినిమా చిరంజీవి కెరియర్ లోనే ది బెస్ట్ సినిమాగా నిలిచింది. అనిల్ రావిపూడి లాంటి దర్శకుడు సైతం ఈ సినిమాతో టాప్ లెవెల్లో ముందుకు దూసుకెళ్లాడనే చెప్పాలి…ఈ సినిమా సక్సెస్ కి చిరంజీవి అనిల్ ఇద్దరు చాలా వరకు హెల్ప్ అయ్యారు…ఇది ఏ ఒక్కరి విజయమో కాదు టీమ్ అందరిది అంటూ అనిల్ సైతం సక్సెస్ ఈవెంట్ లో మాట్లాడారు…
