https://oktelugu.com/

Virat Kohli: 30 బంతుల్లో 31.. కోహ్లీపై పై నెట్టింట విమర్శలు!

Virat Kohli విరాట్ కోహ్లీ (Virat Kohli) ఈ పేరు చెప్తే రన్ మిషన్ గుర్తుకు వస్తుంది. పరుగుల యంత్రం కళ్ళ ముందు కనిపిస్తుంది. ఎలాంటి పిచ్ ఐనా విరాట్ ఆడతాడు. పరుగుల వరద పారిస్తాడు.

Written By: , Updated On : March 28, 2025 / 10:03 PM IST
Virat Kohli (11)

Virat Kohli (11)

Follow us on

Virat Kohli: ఐపీఎల్ లో విరాట్ కోహ్లీ గురించి చెప్పాలంటే పెద్ద పుస్తకం రాయాల్సి ఉంటుంది. ప్రారంభం నుంచి ఇప్పటివరకు అతడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ఆడుతున్నాడు. కొన్నిసార్లు కీలక ఆటగాడిగా.. మరి కొన్నిసార్లు కెప్టెన్ గా అతడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టులో కీలకపాత్ర పోషిస్తున్నాడు. ఇక ఆరెంజ్ క్యాప్ లు ఇప్పటివరకు విరాట్ కోహ్లీ ఎన్నో సాధించాడు. గత సీజన్లోనూ అతడు ఆరెంజ్ క్యాప్ దక్కించుకున్నాడు.. ఇప్పటివరకు విరాట్ కోహ్లీ ఐపీఎల్లో 8000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. అతడికి సమీపంలో మరే ఆటగాడు కూడా లేడు. ఐపీఎల్ లో దూకుడు గా ఆడే ఆటగాళ్లు సైతం విరాట్ కోహ్లీ తర్వాతే ఉన్నారు. విరాట్ కోహ్లీ కంటే ఎక్కువ పరుగులు చేసినప్పటికీ.. సుదీర్ఘకాలం అదే ఫామ్ కొనసాగించడంలో విఫలమయ్యారు. ఏబి డివిలియర్స్, గేల్, డేవిడ్ వార్నర్ ఇలాంటి గొప్ప గొప్ప ఆటగాళ్లు సైతం విరాట్ కోహ్లీ లాగా ఆడ లేక పోయారు. విరాట్ కోహ్లీ తనకు మాత్రమే సాధ్యమైన ఆట తీరుతో ఆకట్టుకున్నాడు. వైవిధ్యభరితమైన పిచ్ లపై పరుగుల వరద పారించాడు . ఎలాంటి బౌలర్ అయినా సరే తన మార్క్ ఇన్నింగ్స్ తో ఆకట్టుకున్నాడు. అయితే అలాంటి విరాట్ కోహ్లీ ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో విమర్శలు ఎదుర్కొంటున్నాడు.

30 బంతుల్లో 31 పరుగులు..

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు తరఫున ఓపెనర్ గా విరాట్ కోహ్లీ బరిలోకి దిగుతుంటాడు. తనకు మాత్రమే సాధ్యమైన ఆట తీరుతో ఆకట్టుకుంటాడు. అయితే అటువంటి విరాట్ కోహ్లీ శుక్రవారం చెన్నై వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ (Chennai super kings) జట్టుతో జరిగిన మ్యాచ్లో పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. టి20లలో టెస్ట్ ఇన్నింగ్స్ ఆడాడనే విమర్శలు మూట కట్టుకున్నాడు. చెన్నైతో జరిగిన మ్యాచ్లో విరాట్ కోహ్లీ 30 బంతుల్లో 31 రన్స్ చేసి అవుట్ అయ్యాడు.. ముఖ్యంగా విరాట్ కోహ్లీ షాట్లు ఏమాత్రం కనెక్ట్ కాలేదు. దీంతో అతడు చాలాసార్లు ఇబ్బంది పడ్డాడు. ప్రత్యర్థి జట్టు బౌలర్లు విరాట్ కోహ్లీని టార్గెట్ చేస్తూ బంతులు వేసినప్పటికీ.. అతడు ఏమాత్రం ఆడలేకపోయాడు..పిచ్ కఠినంగా ఉండడం.. పరుగులు చేయలేకపోవడంతో విరాట్ టెస్ట్ తరహా ఇన్నింగ్స్ ఆడాల్సి వచ్చిందని అతని అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు..” చెన్నై మైదానం స్పిన్ బౌలింగ్ కు అనుకూలిస్తుంది. బంతులు కూడా అదే విధంగా మెలి తిరుగుతూ ఉంటాయి. అలాంటప్పుడు బ్యాటింగ్ చేయడం ఆశించినంత సులువు కాదు. పరుగులు చేయడం చాలా కష్టంతో కూడుకున్న పని. అలాంటప్పుడు విరాట్ కోహ్లీ మాత్రం ఏం చేస్తాడు.. విరాట్ కోహ్లీ ఎలా ఆడతాడో అందరికీ తెలుసు.. విరాట్ కోహ్లీ బ్యాటింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అతడు ఎన్ని ఆరెంజ్ క్యాప్ లు దక్కించుకున్నాడో.. బెంగళూరు జట్టు కోసం ఎలాంటి ఇన్నింగ్స్ లు ఆడాడో గత రికార్డులు చెబుతాయి. సింహం ఒక అడుగు వెనక వేసినంతమాత్రాన పిరికిది కాదు. టైం చూసి కొడితే సింహం బలం ఏమిటో తెలుస్తుందని” విరాట్ కోహ్లీ అభిమానులు సోషల్ మీడియా వేదికగా వ్యాఖ్యానిస్తున్నారు.