Virat Kohli : సెప్టెంబర్ 19 నుంచి టీమిండియా బంగ్లాదేశ్ జట్టుతో టెస్ట్ సిరీస్ ఆడనుంది. ఇప్పటికే టెస్ట్ ర్యాంకింగ్స్ లో భారత్ నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతోంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ సొంతం చేసుకోవాలని భావిస్తోంది. దానికి అనుగుణంగా జట్టును మేనేజ్మెంట్ రూపకల్పన చేస్తోంది. అయితే ఈ జట్టులో టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ స్థానాన్ని సంపాదించుకున్నాడు. వ్యక్తిగత కారణాలవల్ల విరాట్ కోహ్లీ ఇంగ్లాండ్ సిరీస్ లో ఆడలేదు. టి20 వరల్డ్ కప్ లో ఫైనల్ మ్యాచ్లో సత్తా చాటాడు. తనదైన స్థాయిలో ఇన్నింగ్స్ ఆడి ఇండియా జట్టు బ్యాటింగ్ కు వెన్నెముకలాగా నిలిచాడు. టీమిండియా ట్రోఫీ దక్కించుకోవడంలో తన వంతు పాత్ర పోషించాడు. టీమిండియా టి20 వరల్డ్ కప్ సాధించిన తర్వాత పొట్టి ఫార్మాట్ కు గుడ్ బై చెప్పాడు. సమకాలీన క్రికెట్లో పరుగుల వరద పారిస్తున్న ఈ ఆటగాడు.. అద్భుతమైన ఘనతకు 58 పరుగుల దూరంలో ఉన్నాడు..
అన్ని ఫార్మాట్లలో 80 సెంచరీలు..
సమకాలీన క్రికెట్ లో విరాట్ కోహ్లీ అన్ని ఫార్మాట్లు కలిపి 80 అంతర్జాతీయ సెంచరీలు చేశాడు. సెంచరీల పరంగా సచిన్ టెండుల్కర్ (100) తర్వాతి స్థానంలో కొనసాగుతున్నాడు. ఆ ఘనతను అందుకునేందుకు విరాట్ కోహ్లీకి కొంతకాలం పట్టవచ్చు. అంతర్జాతీయ క్రికెట్లో 27 వేల పరుగులు పూర్తి చేయడానికి విరాట్ కోహ్లీకి 58 పరుగులు అవసరం. ఇక అంతర్జాతీయ క్రికెట్లో 27 వేల పరుగులు పూర్తి చేసిన ఆటగాళ్ల జాబితాలో సచిన్ టెండూల్కర్ తొలి స్థానంలో ఉన్నాడు. 623 ఇన్నింగ్స్ లలో (226 టెస్ట్ ఇన్నింగ్స్ , 396 వన్డే ఇన్నింగ్స్, 1 టి20 ఇన్నింగ్స్) కలిపి సచిన్ టెండూల్కర్ 34, 357 పరుగులు చేశాడు. ఇక విరాట్ కోహ్లీ ఇప్పటివరకు టెస్టులలో 8,848 పరుగులు చేశాడు. వన్డేలలో 13,906 రన్స్ సాధించాడు. టి20లలో 4,188 పరుగులు చేశాడు. మొత్తంగా 26,942 పరుగులను తన ఖాతాలో వేసుకున్నాడు.
సచిన్ ఖాతాలో..
సచిన్ ఖాతాలో 34,357 పరుగులు ఉన్నాయి. అయితే ఇందులో 27 వేల పరుగులు పూర్తి చేయడానికి సచిన్ 623 ఇన్నింగ్స్ ఆడాడు. 226 టెస్ట్, 396 వన్డే, ఒక టి20 ఇన్నింగ్స్ లలో సచిన్ ఈ ఘనతను సొంతం చేసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్ లో అత్యంత వేగంగా ఈ రికార్డును సొంతం చేసుకున్న ఆటగాడిగా సచిన్ నిలిచాడు. ఇక విరాట్ కోహ్లీ ఇప్పటికే 591 ఇన్నింగ్స్ లలోనే 26, 942 పరుగులు పూర్తి చేశాడు. బంగ్లాదేశ్ జట్టు తో సెప్టెంబర్ 19న మొదలయ్య తొలి టెస్టుల్లో ఇంకో 58 పరుగులు చేస్తే అత్యంత తక్కువ ఇన్నింగ్స్ లలో అంతర్జాతీయ క్రికెట్లో 27 వేల పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా విరాట్ కోహ్లీ సచిన్ టెండూల్కర్ ను బీట్ చేశాడు. అంతే కాదు 592 ఇన్నింగ్స్ లోనే సొంతం చేసుకుని.. 147 సంవత్సరాల క్రికెట్ చరిత్రలో ఈ రికార్డు సాధించిన తొలి ఆటగాడిగా విరాట్ కోహ్లీ చరిత్ర పుటల్లో నిలుస్తాడు.