Virat Kohli Instagram income : విరాట్ కోహ్లీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇటీవల అతడు సుదీర్ఘ ఫార్మాట్ నుంచి శాశ్వతంగా తప్పుకున్నాడు. అంతకుముందు పొట్టి ఫార్మాట్ నుంచి శాశ్వతంగా వీడ్కోలు తీసుకున్నాడు. ఇప్పుడు అతడు కేవలం 50 ఓవర్ల ఫార్మాట్ లోనే కొనసాగుతున్నాడు.. ఇక ఇటీవల ఐపీఎల్లో విరాట్ కోహ్లీ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కన్నడ జట్టు విజేతగా నిలవడంలో తన వంతు పాత్ర పోషించాడు.
విరాట్ కోహ్లీ మైదానంలో అత్యంత దూకుడుగా ఉంటాడు. బీభత్సంగా పరుగులు చేస్తుంటాడు. ప్రత్యర్థి బౌలర్లపై అనుక్షణం తన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తుంటాడు. అందువల్లే విరాట్ కోహ్లీ అంటే ప్రపంచ స్థాయి బౌలర్లు కూడా సింహ స్వప్నం లాగా భావిస్తుంటారు. అతడికి బౌలింగ్ వేయాలంటే ఇబ్బందిగా ఉంటుందని చెబుతుంటారు. విరాట్ కోహ్లీ వయసు ఇప్పుడు 36 సంవత్సరాలు. అయినప్పటికీ అతడు తన దూకుడు తనాన్ని ఏమాత్రం తగ్గించడం లేదు. తగ్గించే అవకాశం కూడా కనిపించడం లేదు. అవకాశం దొరికితే చాలు ఆకాశమే హద్దుగా సాగిపోతున్నాడు. ఫార్మాట్ తో పరుగులు చేస్తున్నాడు.
ఒక్క పోస్టుకు ఎంత తీసుకుంటున్నాడు అంటే..
విరాట్ కోహ్లీకి సామాజిక మాధ్యమాలలో విపరీతమైన ఫాలోయింగ్ ఉంటుంది. ప్రస్తుతం అతడిని ఇన్ స్టా గ్రామ్ లో ఏకంగా 274 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు. ఒక రకంగా ఆసియాలోనే అత్యధికంగా ఫాలోయింగ్ ఉన్న ఆటగాళ్లలో విరాట్ కోహ్లీ ఒకడు.. అయితే అతడు ఒక్క పోస్ట్ కు ఎంత తీసుకుంటాడనే విషయాన్ని influencer marketing hub అనే సంస్థ వెల్లడించింది.. విరాట్ కోహ్లీ ఇన్ స్టా గ్రామ్ లో పెట్టే ఒక పోస్ట్ కు దాదాపు 12 కోట్ల వరకు తీసుకుంటాడని వెల్లడించింది. ఈ జాబితాలో ఫుట్ బాల్ దిగ్గజ ఆటగాడు రోనాల్డో మొదటి స్థానంలో ఉన్నాడు. అతడు ఒక్క పోస్టుకు 27 కోట్ల వరకు వసూలు చేస్తాడని తెలుస్తోంది.
సామాజిక మాధ్యమాలలో చురుకుగా..
విరాట్ కోహ్లీ సామాజిక మాధ్యమాలలో అత్యంత చురుకుగా ఉంటాడు. తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని అభిమానులతో పంచుకుంటాడు. ఇక విరాట్ కోహ్లీ ఇటీవల ఒక నటి సోషల్ మీడియాలో పెట్టిన ఫోటోకు తన ఆసక్తిని వ్యక్తం చేశాడు. అది కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇంకేముంది ఆ నటి కాస్త ఒక్కసారిగా ఫేమస్ అయింది. దీని పై దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది.. ఆ తర్వాత ఈ వ్యవహారంపై విరాట్ కోహ్లీ స్పందించక తప్పలేదు. ఇన్ స్టా గ్రామ్ లో ఆల్గారిథం లో మార్పులు చోటు చేసుకోవడం వల్ల ఇది జరిగిందని.. దీనిని వేరే విధంగా అర్థం చేసుకోవద్దని అభిమానులకు అతడు ఒక ప్రకటనలో తెలిపాడు..ఈ ఒక్క సంఘటన చాలు విరాట్ కోహ్లీకి ఉన్న స్టామినా చెప్పడానికి. ఇక విరాట్ కోహ్లీ ప్రస్తుతం తన కుటుంబంతో లండన్ లో ఉన్నట్టు తెలుస్తోంది.. అక్కడే స్థిరపడాలనే ఆలోచనతో ఉన్నట్టు సమాచారం.