Virat Kohli Instagram Like Controversy: మనదేశంలో సోషల్ మీడియాలో అత్యధిక ఫాలోవర్స్ కలిగి ఉన్న క్రీడాకారుల్లో విరాట్ కోహ్లీ నెంబర్ వన్ స్థానంలో ఉంటాడు. అతడు ఒక చిన్న పోస్ట్ పెడితే చాలు సోషల్ మీడియా మొత్తం షేక్ అయిపోతుంది. అతడు ఒక మామూలు మాట మాట్లాడితే చాలు సోషల్ మీడియా మొత్తం మెంటల్ ఎక్కిపోతుంది. సాధారణంగా సోషల్ మీడియాలో తనకు సంబంధించిన విషయాలను మాత్రమే విరాట్ కోహ్లీ పంచుకుంటాడు. తాను బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించే కంపెనీల ఉత్పత్తులకు సంబంధించి మాత్రమే వీడియోలు షేర్ చేస్తాడు.
విరాట్ కోహ్లీ సోషల్ మీడియాలో ఎవరి పోస్టులకు లైక్ కొట్టడు. కనీసం తన స్పందన కూడా వ్యక్తం చేయడు. చివరికి అనుష్క విషయంలో కూడా విరాట్ కోహ్లీ ఇదే ధోరణి కొనసాగిస్తాడు. కానీ గత ఏడాది ఇదే సమయానికి బాలీవుడ్ నటి అవ్ నీత్ కౌర్ పోస్టు కు లైక్ కొట్టాడు. బాలీవుడ్ లో అంతంత మాత్రమే అవకాశాలున్న ఆమె.. ఒక్కసారిగా తన స్టైల్ మార్చేసుకుంది. అంతేకాదు బాలీవుడ్లో ఆమెకు అవకాశాలు రావడం మొదలైంది. సోషల్ మీడియాలో ఆమె ఫాలోవర్స్ ఆమాంతం పెరిగి పోయారు. దీంతో విరాట్ కోహ్లీకి, ఆమెకు మధ్య ఉన్న బంధం గురించి చర్చ మొదలైంది. అయితే ఆల్గారిథం వల్ల అలా జరిగి ఉంటుందని విరాట్ కోహ్లీ టీం బయటపెట్టింది. దీంతో విరాట్ కోహ్లీ నుంచి వ్యక్తమైన లైక్ వెనక్కి వెళ్ళిపోయింది. అయితే అప్పటికే ఆమెకు రావాల్సిన పేరు వచ్చేసింది.
ఇప్పుడు మళ్ళీ విరాట్ కోహ్లీ తన ఇంస్టాగ్రామ్ నుంచి ఓ మహిళ పోస్టుకు తన సంసిద్ధతను వ్యక్తం చేశాడు. దీంతో ఈ విషయం సంచలనంగా మారింది. గత ఏడాది జరిగిన విషయాన్ని మర్చిపోకముందే.. మళ్ళీ ఇప్పుడు విరాట్ కోహ్లీ ఇంస్టాగ్రామ్ నుంచి ఓ మహిళ పోస్టుకు లైక్ వ్యక్తం కావడం అతని అభిమానులను ఆశ్చర్యంలో మంచిది. ఇంస్టాగ్రామ్ లో జర్మనీ ఇన్ ఫ్లూయెన్సర్ లిజ్ లాజ్ ఫోటోకు విరాట్ లైక్ కొట్టాడు. వాస్తవానికి విరాట్ కోహ్లీ ఇలా కావాలని చేశాడా? ఏదో తప్పుడు ఆల్గారిథం వల్ల జరిగిపోయిందా? ఈ ప్రశ్నలు అతని అభిమానుల్లో వ్యక్తమవుతున్నాయి. లిజ్ లాజ్ ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన ఫోటో బోల్ట్ గా ఉంది. అటువంటి ఫోటోకు విరాట్ లైక్ చేయడం నిజంగా ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.
విరాట్ కోహ్లీ ఇంస్టాగ్రామ్ అకౌంట్ నుంచి ఇటువంటి లైక్ వ్యక్తం కావడం అతని అభిమానులలో రకరకాల సందేహాలకు కారణమవుతోంది. అనుష్క శర్మ ఉండగా.. ఈ పని ఏంటి భయ్యా.. అసలు నువ్వు ఆమె ఫోటోకు లైక్ చేయడం ఏంటి.. అంటూ విరాట్ అభిమానులు సోషల్ మీడియాలో వ్యంగ్యంగా వ్యాఖ్యానిస్తున్నారు.