Virat Kohli : బంగ్లాదేశ్ జట్టుతో జరిగిన రెండు టెస్టుల సిరీస్లో విరాట్ తన స్థాయికి తగ్గట్టుగా ప్రదర్శన చేయకపోయినప్పటికీ.. రెండవ టెస్ట్ రెండవ ఇన్నింగ్స్ లో 25* పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. విన్నింగ్ షాట్ కొట్టి.. టీమిండియా కు విజయాన్ని అందించాడు. అయితే విరాట్ కోహ్లీ మైదానం లోపల ఆవేశాన్ని ప్రదర్శిస్తాడు. బ్యాటింగ్ చేస్తున్నప్పుడు కసి కొద్దీ ఆడతాడు. ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు ఆవేశాన్ని కలిగి ఉంటాడు. అయితే మైదానం బయటికి వచ్చిన తర్వాత అతడిలో మరో కోహ్లీ కనిపిస్తాడు. తోటి ఆటగాళ్లతోనే కాకుండా.. ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లతోనూ సరదాగా ఉంటాడు. జోకులు వేస్తూ నవ్విస్తుంటాడు. మైదానంలో తన అనుభవాలను పంచుకుంటాడు. ఇలా ఉంటాడు కాబట్టే విరాట్ కోహ్లీకి ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. ఇక విరాట్ కోహ్లీ బంగ్లాదేశ్ ఆల్ రౌండర్ షకీబ్ అల్ హసన్ కు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చాడు. ఎందుకంటే షకీబ్ తన చివరి టెస్ట్ మ్యాచ్ ఆడాడు. జాతీయ మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం కాన్పూర్ వేదికగా జరిగిన టెస్ట్ అతడికి చివరి విదేశీ సిరీస్ అని తెలుస్తోంది. ఇప్పటికే t20, టెస్ట్ క్రికెట్ కు షకీబ్ గుడ్ బై చెప్పేశాడు. దీంతో అతనికి టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ తన ఆటోగ్రాఫ్ చేసిన బ్యాట్ లలో ఒకదానిని అతడికి గిఫ్ట్ గా ఇచ్చాడు. రెండవ టెస్టులో టీమిండియా విజయం సాధించిన అనంతరం బంగ్లాదేశ్ జట్టు వైపు విరాట్ నడిచాడు. షకీబ్ ను కలిశాడు. అతని భుజంపై కుడి చేయిని వేసి సరదాగా మాట్లాడాడు. ఆ తర్వాత ఆ బ్యాట్ అతడికి అందించాడు.
కింగ్ అని ఊరికే అనరు..
షకీబ్ సొంత ప్రాంతం బంగ్లాదేశ్ లోని మీర్పూర్.. బంగ్లాదేశ్ జట్టు తరఫున అతడు 129 t20 లు ఆడాడు. 23.19 సరాసరిగా 2,551 పరుగులు చేశాడు.. ఇందులో 13 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. వన్డేలలో 149 వికెట్లు పడగొట్టాడు. 70 టెస్టులలో ప్రాతినిధ్యం వహించి 4,609 రన్స్ చేశాడు. 246 వికెట్లు పడగొట్టాడు.. బంగ్లాదేశ్ ప్రధానమంత్రిగా షేక్ హసీనా ఉన్నప్పుడు.. షకీబ్ పార్లమెంట్ సభ్యుడిగా గెలిచాడు. ఇటీవల జరిగిన అల్లర్లలో అతనిపై హత్యానేరం నమోదయింది. భవిష్యత్తులో అతడు క్రికెట్ ఆడే అవకాశం లేకపోవడంతో.. అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు. అదే బంగ్లాదేశ్ చెట్టు అక్టోబర్లో దక్షిణాఫ్రికా తో రెండు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ ఆడుతుంది. ఈ సిరీస్ కు షకీబ్ ఎంపిక కావడం కష్టమనే వార్తలు వినిపిస్తున్నాయి. అందువల్లే అతడు తన చివరి టెస్ట్ మ్యాచ్ ఆడాడని జాతీయ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. కాగా, షకీబ్ కు గిఫ్ట్ ఇవ్వడం ద్వారా విరాట్ కోహ్లీపై ప్రశంసల జల్లు కురుస్తోంది. కింగ్ అని విరాట్ కోహ్లీని ఊరికే అనరని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
Virat Kohli gave his signed bat to Shakib Al Hasan.
– Picture of the day! ❤️ pic.twitter.com/mJKSDk6gnR
— Mufaddal Vohra (@mufaddal_vohra) October 1, 2024