https://oktelugu.com/

India Vs South Africa Final: విరాట్.. టోర్నీ మొత్తం ఆడకా.. ఫైనల్ కోసమే దాచిపెట్టాడా?

వరుస వైఫల్యాల నేపథ్యంలో ఫైనల్‌లో అతనిపై ఆశలు లేవు. విరాట్‌ వైఫల్యంపై మ్యాచ్‌కు ముంద కెప్టెన్‌ను అడగగా.. ‘విరాట్‌ ఏంటో మాకు తెలుసు.. కీలక మ్యాచ్‌లో అతను ఉత్తమ ప్రదర్శన కనబరస్తాడని దాచుకన్నాడేమో’ అన్నాడు.

Written By:
  • Raj Shekar
  • , Updated On : June 30, 2024 / 02:58 PM IST

    India Vs South Africa Final

    Follow us on

    India Vs South Africa Final: ప్రపంచకప్‌ లాంటి టోర్నీలో విరాట్‌ కోహ్లిది తిరుగులేని రికార్డు. మిగతా జట్టంతా విఫలమైనా అతను నిలుస్తాడు. గెలిపిస్తాడన్న నమ్మకం ఉంది. గతేడాది వన్డే ప్రపంచకప్‌లో కూడా అతని ప్రదర్శన అద్భుతం. ఐపీఎల్‌ నుంచి మంచి ఫాంతో టీ20 ప్రపంచకప్‌ టోర్నీలో అడుగు పెట్టిన కోహ్లి అదరగొడతాడని అందరూ ఆశించారు. కానీ అనూహ్యంగా వరుస వైఫల్యాలతో నిరాశపర్చాడు. గ్రూప్‌ దశలో మూడు మ్యాచ్‌లలో కేవలం 5 పరుగులే చేశాడు. సూపర్‌–8లో ప్రదర్శన అంతంత మాత్రమే. సెమీఫైనల్‌లో అయినా ఆడతాడని ఆశించినా అక్కడే నిరాశే.

    ఫైనల్లీ.. ఫైనల్‌లో..
    వరుస వైఫల్యాల నేపథ్యంలో ఫైనల్‌లో అతనిపై ఆశలు లేవు. విరాట్‌ వైఫల్యంపై మ్యాచ్‌కు ముంద కెప్టెన్‌ను అడగగా.. ‘విరాట్‌ ఏంటో మాకు తెలుసు.. కీలక మ్యాచ్‌లో అతను ఉత్తమ ప్రదర్శన కనబరస్తాడని దాచుకన్నాడేమో’ అన్నాడు. అన్నట్లుగానే కోహ్లి ఫైనల్‌లో ఉత్తమ ప్రదర్శన చేశాడు. ఆత్మవిశ్వాసంతో ఇన్నింగ్స్‌ ఆడాడు. పరిస్థితులకు తగినట్లు ఆడుతూ చెలరేగాడు. ఇన్నింగ్స్‌కు మంచి ముగింపు ఇచ్చాడు.

    హాఫ్‌ సెంచరీతో ఆకట్టుకుని..
    ఫైనల్‌ మ్యాచ్‌లో 34 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న టీం ఇండియాకు కోహ్లి ఇన్నింగ్స్‌ కీలకంగా మారింది. అర్ధ శతకం వరకు ఆచితూడి ఆడిక కింగ్‌.. తర్వాత చెలరేగాడు. కీకలమైన 74 పరుగులు చేవాడు. తన వికెట్‌ పడితే జట్టుకు ఇబ్బంది గుర్తించి ఆచితూచి ఆడతూ లూజ్ బాల్స్‌ను బౌండరీలకు తరలించాడు. అక్షర్‌ పటేల్‌తో కలిసి కీలక భాగస్వామ్యం నెలకొలిపాడు. అక్షర్‌ పటేల్‌కు షాట్లు ఆడే అకవాశం ఇస్తూ తాను నిదానంగా ఆడుతూ జట్టును నిలబెట్టాడు. ఆఖర్లో అదరగొట్టాడు. అంతకముందు జరిగిన నష్టాన్ని భర్తీ చేశాడు.