Vijay Devarakonda: కల్కి మూవీలో అర్జునుడు పాత్ర చేసిన విజయ్ దేవరకొండ ఎంత తీసుకున్నాడు..? తెలిస్తే షాక్ అవుతారు!

విజువల్ వండర్ లా ఉన్న కల్కి మూవీకి ప్రేక్షకుల నుండి విశేష ఆదరణ దక్కుతుంది. ముఖ్యంగా యూఎస్ లో కల్కి చిత్రానికి బ్రహ్మరథం పడుతున్నారు. తాజా సమాచారం ప్రకారం $9.3 మిలియన్ వసూళ్లు కల్కి రాబట్టింది. కల్కి భారీ వసూళ్ల దిశగా పరుగు తీస్తుంది.

Written By: S Reddy, Updated On : June 30, 2024 2:28 pm

Vijay Devarakonda

Follow us on

Vijay Devarakonda: కల్కి 2829 AD చిత్రం గురించి దేశవ్యాప్తంగా చర్చ నడుస్తుంది. దర్శకుడు నాగ్ అశ్విన్ ప్రతిభను విమర్శకులతో పాటు ప్రేక్షకులు, చిత్ర ప్రముఖులు కొనియాడుతున్నారు. పరిమిత బడ్జెట్ లో హాలీవుడ్ రేంజ్ మూవీని అందించాడు నాగ్ అశ్విన్. దానికి మించి ఆయన రాసుకున్న కథ అందరినీ అబ్బురపరుస్తుంది. మహాభారతం, కల్కి రాక వంటి హిందూ మైథాలజీని సైన్స్ ఫిక్షన్ కి జోడించి ఎవరూ ఊహించని కథను సిద్ధం చేశాడు. ఈ కథను రాయడానికి 5 ఏళ్ళు కష్టపడినట్లు నాగ్ అశ్విన్ చెప్పుకొచ్చారు.

విజువల్ వండర్ లా ఉన్న కల్కి మూవీకి ప్రేక్షకుల నుండి విశేష ఆదరణ దక్కుతుంది. ముఖ్యంగా యూఎస్ లో కల్కి చిత్రానికి బ్రహ్మరథం పడుతున్నారు. తాజా సమాచారం ప్రకారం $9.3 మిలియన్ వసూళ్లు కల్కి రాబట్టింది. కల్కి భారీ వసూళ్ల దిశగా పరుగు తీస్తుంది. ఆదివారం కల్కి వసూళ్లు మరింత జోరుగా ఉండే అవకాశం కలదు.

కల్కి మూవీలో భైరవగా ప్రభాస్ నటించారు. దీపికా పదుకొనె, అమితాబ్, కమల్ హాసన్ కీలక రోల్స్ చేశారు. అశ్వద్ధామగా అమితాబ్ పాత్రకు ప్రశంసలు దక్కుతున్నాయి. ఈ మధ్య కాలంలో అమితాబ్ చేసిన అత్యంత గొప్ప పాత్రగా విమర్శకులు ప్రశంసిస్తున్నారు. హీరో పాత్రకు సమానమైన అశ్వద్ధామ పాత్రను అమితాబ్ అద్భుతంగా చేశారు. అలాగే కమల్ యాస్కిన్ అనే నెగిటివ్ రోల్ చేయడం విశేషం.

ప్రతి పాత్రకు ప్రాధాన్యత ఉండేలా నాగ్ అశ్విన్ జాగ్రత్త తీసుకున్నాడు. టాలీవుడ్ ప్రముఖులు, హీరోలు, హీరోయిన్స్ ఈ చిత్రంలో గెస్ట్ రోల్స్ చేయడం మరొక ఆసక్తికర విషయం. ముఖ్యంగా విజయ్ దేవరకొండ చేసిన అర్జునుడు పాత్రకు ప్రశంసలు దక్కుతున్నాయి. కనిపించేది కొద్ది నిమిషాలే అయినా విజయ్ దేవరకొండ ఆకట్టుకున్నాడు. మరి ఆ పాత్ర చేసిన విజయ్ దేవరకొండ రెమ్యూనరేషన్ గా ఎంత తీసుకున్నాడనే ఆసక్తి అందరిలో ఉంది. అయితే విజయ్ దేవరకొండ ఒక్క రూపాయి కూడా తీసుకోలేదట. గెస్ట్ రోల్స్ చేసిన దుల్కర్ సల్మాన్, మృణాల్, రాజమౌళి, రామ్ గోపాల్ వర్మ… ఎవరూ ఎలాంటి రెమ్యూనరేషన్ తీసుకోలేదని వినికిడి..