Hardik Pandya: పడి లేచిన కెరటం పాండ్యా..

హార్దిక్‌ మైదానంలో అడుగు పెడితే గేలి చేయడం.. ముంబై కెప్టెన్‌గా ఎందుకు వచ్చావంటూ ఎగతాళి చేయడం.. ఆల్‌రౌండర్‌గా విఫలం కావడం.. ఈ ఏడాది ఐపీఎల్‌లో పరిగింది.

Written By: Raj Shekar, Updated On : June 30, 2024 3:05 pm

Hardik Pandya

Follow us on

Hardik Pandya: భారత జట్టు టీ20 వరల్డ్‌ కప్‌ గెలవడానికి అనేక కారణాలు ఉన్నాయి. అయితే ఈ మ్యాచ్‌లో రెండు వికుట్ల పడగొట్టిన హార్దిక్‌ పాండా కీలక పాత్ర పోషించాడు. పాండ్యా వేసిన రెండు ఓవర్లు దక్షిణాఫ్రికా చేతిలో ఉన్న మ్యాచ్‌ను భారత్‌వైపు తిప్పాయి. సాధారణంగా ఆ రెండు ఓవర్లు విజయం ఏ బైలర్‌కు అయినా స్పెషల్‌. హార్దిక్‌ పాండ్యాకు వెరీ వెరీ స్సెషల్‌ అని చెప్పాలి. ఎందుకంటే ప్రపంచకప్‌ ప్రారంభానికి ముందు పాండ్యాను గేలి చేయని నోరు లేదు. జట్టులోకి ఎందుకు తీసుకున్నారని కూడా కొందరు ప్రశ్నించారు. ఐపీఎల్‌లో పేలవ ప్రదర్శనతో మైదానంలోనే నానా మాటలు అన్నారు కొందరు మాజీలు.

ఇప్పుడు అదుర్స్‌..
హార్దిక్‌ మైదానంలో అడుగు పెడితే గేలి చేయడం.. ముంబై కెప్టెన్‌గా ఎందుకు వచ్చావంటూ ఎగతాళి చేయడం.. ఆల్‌రౌండర్‌గా విఫలం కావడం.. ఈ ఏడాది ఐపీఎల్‌లో పరిగింది. కానీ, ఇపుపడు అతని బ్యాటింగ్‌ అద్భుతమంటూ.. అతని బౌలింగ్‌ అదుర్స్‌ అని పొగుడుతున్నారు. టీ20 6పపంచకప్‌లో ఆల్‌రౌండర్‌ పాత్రకు పాండ్యా న్యాయం చేశాడని ప్రశంసిస్తున్నారు. ఇందుకు కారణం హార్దిక్‌ కష్టం. ఈమార్పునకు కారణం పాండా ధ్రుడ సంకల్పం. తన మీద తను పెట్టుకున్న నమ్మకం. హార్దిక్‌ స్థానంలో మరే ఆటగాడు ఉన్నా పీడకల లాంటి ఆ ఐపీఎల్‌ అనుభవం నుంచి ఇంత త్వరగా కోలుకునేవారు కాదు.

పీడకలలా ఐపీఎల్‌..
ఇదిలా ఉంటే.. ఐపీఎల్‌ పాండ్యాకు పీడ కలలా మారింది. రోహిత్‌ స్థానంలో సారథ్య పగ్గాలు చేపట్టిన పాండ్యాపై హిట్‌ మ్యాన్‌ ఫ్యాన్స్‌ తీవ్ర విమర్శలు చేశారు. అతని సారథ్యంలో జట్టు కూడా పేలవ ప్రదర్శనతో ఐపీఎల్‌లో చివరి స్థానంలో నిలిచింది. వ్యక్తిగతంగా కూడా హార్దిక్‌ విఫలమయ్యాడు. 13 ఇన్నింగ్స్‌లో కేవలం 216 పరుగులు చేశాడు. 11 వికెట్లు తీశాడు. దీంతో అతడికి ప్రపంచకప్‌లో చోటు దక్కడం సందేహంగానే మారింది. కానీ, అతని నైపుణ్యాలపై నమ్మకం ఉంచిన అగార్ర్‌ నేతృత్వంలోని సెలక్షన్‌ కమిటీ అవకాశం ఇచ్చింది.

అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని..
జాతీయ జట్టుకు ఆడుతున్నప్పుడే వేరే హార్దిక్‌ను చూస్తామని, టోర్నీ ప్రారంభానికి ముందు మాజీలు అభిప్రాయపడ్డారు. వారి అభిప్రాయాన్ని నిజం చేస్తూ.. వచ్చిన అవకాశాన్ని పాండ్యా సద్వినియోగం చేసుకున్నాడు. పూర్తి ఆత్మవిశ్వాసంతో టోర్నీలో మ్యాచ్‌లు ఆడాడు. బ్యాటింగ్, బౌలింగ్‌లో రాణించాడు. 8 మ్యాచ్‌లలో 11 వికెట్లు పడగొట్టాడు. 151.57 స్ట్రైక్‌రేట్‌తో 144 పురుగులు చేశాడు.

దీంతో నవిన్న నాప చేనే పండుతుంది అన్నట్లుగా ఇప్పుడు ఎగతాళి చేసిన నోళ్లే హార్దిక్‌ను ప్రశంసిస్తున్నాయి. అందుకేనేమో మ్యాచ్‌ తర్వాత పాండ్యా ఎమోషనల్‌ అయ్యాడు. కన్నీరు పెట్టుకున్నాడు. ఇన్నాళ్లూ గుండెల్లో దాచుకున్న అవమాన భారాన్ని దించేసుకున్నాడు.