Virat Kohli Birthday: ఆధునిక క్రికెట్లో విరాట్ అత్యంత ఫిట్ గా ఉంటాడు. మిగతా ఆటగాళ్లు ఎలా ఉన్నా సరే.. శారీరక సామర్థ్యానికి విరాట్ అత్యంత ప్రాధాన్యాన్ని ఇస్తాడు. వాస్తవానికి టీమిండియా క్రికెట్లో శారీరక సామర్థ్యానికి సంబంధించి విప్లవాన్ని తీసుకొచ్చిన ఘనత విరాట్ కోహ్లీదే అనడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే విరాట్ లాగా అద్భుతమైన శారీరక సామర్థ్యం ఉండాలంటే ఏం చేయాలని గూగుల్ లో తెగ శోధిస్తున్నారట. ఇంతకీ విరాట్ కోహ్లీ ఏం తింటాడు? ఏం తాగుతాడు? అనే విషయాలను ఆరా తీస్తే.. విరాట్ కోహ్లీ ఒకప్పుడు మాంసాహారం తినేవాడు. అది కూడా ఎక్కువగా తీసుకునేవాడు. సరిగ్గా ఆరు సంవత్సరాల క్రితం విరాట్ ఒక్కసారిగా మాంసాహారం మానేశాడు. ఆ తర్వాత పూర్తిగా శాకాహారిగా అవతరించాడు. 2018లో దక్షిణాఫ్రికా తో టీమిండియా టెస్ట్ సిరీస్ ఆడింది. ఆ సమయంలో విరాట్ కోహ్లీ విపరీతమైన వెన్ను నొప్పితో బాధపడ్డాడు. డాక్టర్లు పరిశీలించగా విరాట్ వెన్నెముకలోని సర్వైకల్ డిస్క్ వాపునకు గురైంది. విరాట్ కోహ్లీ శరీరంలో యూరిక్ ఆసిడ్ పెరిగింది. దానివల్ల కాల్షియం లోపం తలెత్తింది. దీంతో కోహ్లీ ఎముకలు అత్యంత బలహీనంగా మారిపోయాయి. మాంసాహారం మానేసి, శాఖాహారం తీసుకోవాలని వైద్యులు సూచించారు. నీతో అప్పటినుంచి అతడు మాంసాహారాన్ని పూర్తిగా మానేశాడు. శాకాహారాన్ని తినడం ప్రారంభించాడు. అయితే శాకాహారం తినడం మొదలు పెట్టిన తర్వాత తన శరీరంలో పూర్తిస్థాయిలో మార్పులు వచ్చాయని విరాట్ వివరించాడు. అందువల్లే డైట్ విషయంలో తాను మార్పులు చేర్పులు చేశారని విరాట్ చెప్పుకొచ్చాడు.. విరాట్ రోజుకు రెండు గంటలపాటు వర్కౌట్ చేస్తాడు. వారంలో ఒకరోజు మాత్రమే వ్యాయామానికి విరామం ఇస్తాడు. వ్యాయామంతో పాటు ఈత కూడా కొడుతుంటాడు..
అనేక పురస్కారాలు
2013లో అర్జున అవార్డును, 2017లో పద్మశ్రీ, 2018లో ఖేల్ రత్న పురస్కారాలు సొంతం చేసుకున్నాడు. 2019లో అత్యంత ప్రభావశీలురైన వందమంది జాబితాలో కోహ్లీ చోటు దక్కించుకున్నాడు. 2006 డిసెంబర్ 18న విరాట్ తండ్రి ప్రేమ్ కోహ్లీ కన్నుమూశాడు. ఆ వార్త తెలిసే సమయానికి విరాట్ ఢిల్లీ జట్టు తరఫున రంజి మ్యాచ్ ఆడుతున్నాడు. ఆ మ్యాచ్లో 90 పరుగులు చేశాడు. జట్టును ఫాలో ఆన్ గండం గట్టెక్కించాడు. అనంతరం తన తండ్రి అంత్యక్రియల్లో పాల్గొన్నారు.. దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు విరాట్ కు క్రికెట్ అంటే ఎంత ఇష్టమో. 2017 లో బాలీవుడ్ నటీమణి అనుష్కను విరాట్ పెళ్లి చేసుకున్నాడు. అంతకు ముందు వీరు చాలా రోజుల పాటు డేటింగ్ లో ఉన్నారు. వీరి వివాహం ఇటలీలో జరిగింది. 2021 జనవరి 11న వీరికి వామిక అనే కుమార్తె జన్మించింది. 2024 ఫిబ్రవరి 24న అకాయ్ అనే కుమారుడు పుట్టాడు. 2018 నుంచి విరాట్ పూర్తిగా శాకాహారిగా మారిపోయాడు. అంతర్జాతీయ క్రికెట్లో సచిన్ తర్వాత ఆ స్థాయిలో శతకాలు బాదిన ఆటగాడిగా విరాట్ నిలిచాడు. వన్డేలలో విరాట్ 50 సెంచరీలు చేశాడు.
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Virat kohli birthday he stopped eating meat he changed his diet completely do you know what virat eats
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com