Virat Kohli : ఇండియన్ క్రికెట్ లో విరాట్ కోహ్లీ(Virat Kohli) సాధించిన ఘనతలు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టెస్ట్, టీ 20, ఒన్డే ఇలా అన్ని క్రికెట్ ఫార్మట్స్ లో విరాట్ కోహ్లీ ఎన్నో సంచలన రికార్డ్స్ ని నమోదు చేసి చరిత్ర సృష్టించాడు. అలాంటి విరాట్ కోహ్లీ ఈ నెల 12 వ తారీఖున టెస్ట్ ఫార్మటు క్రికెట్ కి రిటైర్మెంట్ ని ప్రకటించిన ఘటన ఆయన అభిమానులకు గుండె పోటు తెచ్చినంత పని అయ్యింది. 36 ఏళ్ళ వయస్సు ఉన్న విరాట్ కోహ్లీ తన 14 ఏళ్ళ టెస్ట్ క్రికెట్ ఫార్మటు లో 123 మ్యాచులు ఆడి, 46.9 స్ట్రైక్ రేట్ తో 30 సెంచరీలు, 31 హాఫ్ సెంచరీలతో దాదాపుగా 9230 పరుగులు చేసి చరిత్ర సృష్టించాడు. అందులో 7 డబుల్ సెంచరీలు కూడా ఉన్నాయి. సచిన్ టెండూల్కర్, సునీల్ గవాస్కర్, రాహుల్ ద్రావిడ్ లాంటి లెజెండ్స్ తర్వాత అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్ గా విరాట్ కోహ్లీ నిలిచాడు.
Also Read : రామ్ చరణ్ ‘జంజీర్’ డైరెక్టర్ తో సల్మాన్ ఖాన్ కొత్త సినిమా..పాపం ఫ్యాన్స్ పరిస్థితి!
టెస్ట్ ఫార్మటు లో ఎన్నో అద్భుతాలు సృష్టించిన విరాట్ కోహ్లీ ఇలా రిటైర్మెంట్ ఇవ్వడం అందరికీ కోలుకోలేని షాక్ అనే చెప్పాలి. త్వరలో ఇంగ్లాండ్ తో జరగబోయే టెస్ట్ సిరీస్ లో BCCI విరాట్ కోహ్లీ పేరుని పరిశీలిస్తున్న సమయంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నాడు. కనీసం ఈ ఒక్క సిరీస్ ఆడి ఉండుంటే 10000 మార్కుని విరాట్ కోహ్లీ దాటి ఉండేవాడని, అదొక సరికొత్త రికార్డు గా నిలిచి ఉండేదని ఆయన అభిమానులు బాధ పడుతున్నారు. ఇదంతా పక్కన పెడితే మాజీ క్రికెటర్ సురేష్ రైనా(Suresh Raina) భారత ప్రభుత్వానికి విరాట్ కోహ్లీ గురించి రాసిన ఒక లేఖ ఇప్పుడు సంచలనంగా మారింది. అంతర్జాతీయ వేదికగా మన భారత త్రివర్ణ పతాకం గర్వం గా ఎగిసేలా చేసి, ఎన్నో సంచలనాత్మక రికార్డ్స్ ని నెలకొల్పిన విరాట్ కోహ్లీ కి భారత రత్న(Bharata Ratna) అవార్డు ని ఇవ్వాలంటూ ఆయన ఈ లేఖలో భారత ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేశాడు.
దేశానికీ క్రీడా రంగం లో ఎనలేని సేవలు అందించిన విరాట్ కోహ్లీ భారత రత్న పురస్కారానికి అన్ని విధాలుగా అర్హుడు అంటూ ఆయన ఈ లేఖలో పేర్కొన్నాడు. అంతే కాకుండా కొద్దీ రోజుల క్రితం ఆయన తన సొంత ఊరు ఢిల్లీ లోని జెట్లీ స్టేడియం లో ఫేర్ వెల్ మ్యాచ్ ని విరాట్ కోహ్లీ కోసం ఏర్పాటు చెయ్యాలని BCCI ని డిమాండ్ చేశాడు. ఈ మ్యాచులో విరాట్ కోహ్లీ కుటుంబ సభ్యులను కూడా ఆహ్వానించాలని , భారత క్రికెట్ కి ఆయన చేసిన సేవలకు సకల మర్యాదలతో వీడ్కోలు ఇవ్వాలని కోరాడు. సురేష్ రైనా విరాట్ పై చూపించిన ఈ శ్రద్ద, ప్రేమకు విరాట్ ఫ్యాన్స్ ఎంతో సంతోషిస్తూ సోషల్ మీడియా లో కృతఙ్ఞతలు తెలియజేస్తున్నారు