Dude Movie : విభిన్నమైన కథాంశాలతో యూత్ ఆడియన్స్ ని అలరిస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని ఏర్పాటు చేసుకున్న హీరో ప్రదీప్ రంగనాథన్(Pradeep Ranganathan). షాఫ్ట్ ఫిలిమ్స్ ద్వారా పాపులారిటీ ని సంపాదించిన ఈయన తమిళం లో ‘కోమలి’ అనే చిత్రం ద్వారా డైరెక్టర్ గా సినీ ఇండస్ట్రీ కి పరిచయమయ్యాడు. ఆ సినిమా కమర్షియల్ గా పెద్ద హిట్ అయ్యింది. ఇక ఆ తర్వాత ఆయన తన స్వియ దర్శకత్వం లోనే హీరో గా నటిస్తూ ‘లవ్ టుడే’ చిత్రం చేశాడు. ఇది ఇంకా పెద్ద హిట్ అయ్యింది. ఏకంగా వంద కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ ని రాబట్టి సంచలనం సృష్టించింది. తెలుగు లో కూడా బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసింది. ఈ రెండు చిత్రాల తర్వాత ఆయన నుండి విడుదలైన లేటెస్ట్ చిత్రం ‘డ్రాగన్’ ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.
Also Read : రామ్ చరణ్ ‘జంజీర్’ డైరెక్టర్ తో సల్మాన్ ఖాన్ కొత్త సినిమా..పాపం ఫ్యాన్స్ పరిస్థితి!
తెలుగు, తమిళ భాషలకు కలిపి 150 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా తర్వాత ప్రదీప్ రంగనాథన్ సౌత్ లో ఒక బ్రాండ్ గా మారిపోయాడు. ఇప్పుడు లేటెస్ట్ గా ఆయన ‘డ్యూడ్'(Dude Movie), ‘LIK’ వంటి చిత్రాల్లో నటిస్తున్నాడు. ఇందులో ‘LIK’ షూటింగ్ పూర్తి అయ్యింది. ఇప్పుడు ఆయన ‘డ్యూడ్’ అనే చిత్రం లో నటిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాలో హీరోయిన్ గా ప్రేమలు బ్యూటీ మామితా బైజు(Mamitha Baiju) నటిస్తుంది. ఇది కూడా యూత్ ఆడియన్స్ ని టార్గెట్ చేసుకొని తెరకెక్కిస్తున్న సినిమానే. తన ప్రతీ సినిమాలో ఎదో ఒక కొత్త ట్రెండింగ్ పాయింట్ ని పట్టుకొని సినిమాలు చేయడం ప్రదీప్ రంగనాథన్ స్టైల్. ఈ సినిమా కూడా అలాంటి కథతోనే తెరకెక్కబోతుందట. ఇది హీరో హీరోయిన్ మధ్య సాగే లవ్ స్టోరీ నే, కానీ ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది.
హీరోయిన్ గర్భం దాలుస్తుంది, కానీ హీరో వల్ల కాదు..స్టోరీ చాలా ఆసక్తికరంగా ఉంది కదూ. ఈ మాత్రం చాలు ప్రదీప్ రంగనాథన్ రెచ్చిపోతాడు అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటికే వరుసగా రెండు సార్లు 150 కోట్ల రూపాయిల గ్రాస్ ని కొల్లగొట్టిన ఈ యువ హీరో, ఈసారి ఏకంగా 200 కోట్ల రూపాయిల గ్రాస్ కొల్లగొట్టే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. తమిళం లో అనేక మంది స్టార్ హీరోలు ఇంకా ఈ మార్కుని అందుకోలేదు. అక్కడి ఇండస్ట్రీ లో ఫ్యాన్ బేస్ పరంగా టాప్ 2 లో ఉండే అజిత్ కుమార్ రీసెంట్ గా ఆ మార్కుని అందుకున్నాడు అంటేనే అర్థం చేసుకోవచ్చు. పైగా తలపతి విజయ్ రాజకీయాల్లోకి వెళ్లడం తో ఆయన స్థానం ఇండస్ట్రీ లో ఖాళీ అయ్యింది. ఇప్పుడు దానిని ప్రదీప్ రంగనాథన్ భర్తీ చేసే అవకాశాలు ఉన్నాయి.