Virat Kohli : ఐపీఎల్ లో సంచలనాత్మకమైన ఇన్నింగ్స్ తో ఇతడు వెలుగులోకి వచ్చాడు. బ్యాటింగ్ మాత్రమే కాదు బౌలింగ్ లోనూ సత్తా చాటాడు. బలమైన జట్ల పై దృఢమైన ఇన్నింగ్స్ ఆడాడు. అది అతడిని హీరోని చేసింది. జాతీయ జట్టులో అవకాశం కల్పించింది. జాతీయ జట్టులో అవకాశం వచ్చినప్పటికీ అతడు బీభత్సమైన ఎన్నిసార్లు లేదు. దుర్భేద్యమైన ఆటతీరు ప్రదర్శించలేదు. అయితే వచ్చిన అవకాశాలను మాత్రం సద్వినియోగం చేసుకున్నాడు. వేగంగా పరుగులు తీయకపోయినప్పటికీ.. సునామిలాగా విరుచుకు పడకపోయినప్పటికీ.. తన స్థాయిలో తాను ఆట తీరును ప్రదర్శిస్తున్నాడు. అయితే ఇప్పుడు అదే ఆట తీరు టీమిండియా కొండంత బలం లాగా మారింది. ఎందుకంటే పెర్త్ మైదానంలో బలమైన ఆస్ట్రేలియాపై అతడు 41 పరుగులు చేశాడు. 41 పరుగులు పెద్ద స్కోర్ కాకపోవచ్చు.. కాకపోతే జట్టు మొత్తం పెవిలియన్ వెళుతున్నప్పుడు.. అతడు ఒక్కడే స్థిరంగా నిలబడ్డాడు. దృఢంగా ఆడాడు. అతడు ఆ స్థాయిలో బ్యాటింగ్ చేశాడు కాబట్టే భారత జట్టు 150 పరుగులు చేయగలిగింది. ఆ స్కోర్ చేయగలిగింది కాబట్టే తొలి ఇన్నింగ్స్ లో 46 పరుగుల లీడ్ సంపాదించగలిగింది. లేకుంటే భారత జట్టు పరిస్థితి మరో విధంగా ఉండేది.
ఫిదా అయిపోయిన విరాట్ కోహ్లీ
నితీష్ కుమార్ రెడ్డి ఆ స్థాయిలో ఇన్నింగ్స్ ఆడటంతో.. టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ ఒక్కసారిగా అతడికి అభిమాని అయిపోయాడు. అంతేకాదు తన క్యాప్ తీసి అతడికి అందించాడు. ఈ సందర్భంగా భావోద్వేగంతో మాట్లాడాడు..” నిన్ను చూస్తే ముచ్చటేస్తోంది. చాలా కష్టపడ్డావ్. ఇక్కడ దాకా రావడానికి ఎన్నో అవాంతరాలను దాటావు. శిక్షణలో నిన్ను గమనిస్తూనే ఉన్నాను. నువ్వు ఇక్కడ ఈ స్థాయిలో ప్రదర్శన చేయడానికి పూర్తిస్థాయిలో అర్హుడివి. నీ ఆట తీరు బాగుంది. మీ సేవలు దేశానికి అవసరం. నీ ద్వారా ఎన్నో విజయాలు అందాలి. అవి జట్టు ఉన్నతిని మరింత సుస్థిరం చేయాలి. ఫలితం పక్కన పెట్టు. సంబంధాన్ని కూడా పక్కన పెట్టు. స్వేచ్ఛగా బ్యాటింగ్ చేయి. ఒత్తిడి అనే విషయాన్ని దూరం పెట్టు. నీ తొలి మ్యాచ్లో తొలి ఇన్నింగ్స్ లో నువ్వు ఆడిన ఆట ఎప్పటికీ గుర్తుండిపోతుందని” విరాట్ నితిష్ట వ్యాఖ్యానించాడు. మరోవైపు తన ఆరాధ్య క్రికెటర్ నుంచి క్యాప్ అందుకోవడాన్ని నితీష్ కుమార్ రెడ్డి గర్వంగా ఉందని చెబుతున్నాడు. విరాట్ ఆట తీరును చిన్నప్పటినుంచి చూస్తున్న తాను.. ఎంతో స్ఫూర్తి పొందానని.. చివరికి అతడి చేతుల మీదుగా క్యాప్ అందుకోవడం జీవనకాల సాఫల్య పురస్కారమని అతడు వివరించాడు. నితీష్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి. విరాట్ అన్న మాటలు కూడా సామాజిక మాధ్యమాలలో సందడి చేస్తున్నాయి.