https://oktelugu.com/

Pushpa 2: The Rule : విడుదలకు ముందు యూఎస్ లో పుష్ప 2 రికార్డుల మోత, అల్లు అర్జున్ క్రేజ్ పీక్స్!

ఇండియా మొత్తం పుష్ప 2 ఫీవర్ తో ఊగిపోతోంది. సౌత్ టు నార్త్ ఆడియన్స్ ఈ క్రేజీ సీక్వెల్ కోసం ఎదురు చూస్తున్నారు. కాగా యూఎస్ లో సైతం పుష్ప 2కి ఎంత డిమాండ్ ఉందో అడ్వాన్స్ బుకింగ్స్ చూస్తే అర్థం అవుతుంది. విడుదలకు ముందే పుష్ప 2 యూఎస్ లో రికార్డుల మోత మోగిస్తుంది.

Written By:
  • S Reddy
  • , Updated On : November 23, 2024 / 09:20 PM IST

    Pushpa 2: The Rule

    Follow us on

    Pushpa 2: The Rule: పుష్ప 2 వరల్డ్ వైడ్ డిసెంబర్ 5న విడుదల కానుంది. భారీగా ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. పాట్నా వేదికగా జరిగిన పుష్ప 2 ట్రైలర్ లాంచ్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్. లక్షల మంది నార్త్ ఫ్యాన్స్ అల్లు అర్జున్ కోసం పోటెత్తారు. బాలీవుడ్ లో ఇలాంటి బహిరంగ సినిమా వేడుకలు జరగవు. అల్లు అర్జున్ నయా ట్రెండ్ సెట్ చేశాడు. ఒక సౌత్ హీరో కోసం ఆ స్థాయిలో అభిమానులు గుమిగూడటం హాట్ టాపిక్ అయ్యింది. బాలీవుడ్ వర్గాలు విస్తుపోయేలా.. పుష్ప 2 ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరిగింది.

    యూఎస్ ఆడియన్స్ సైతం పుష్ప 2 కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారని అడ్వాన్స్ బుకింగ్స్ చూస్తే అర్థం అవుతుంది. పుష్ప 2 బుకింగ్స్ రికార్డ్స్ నెలకొల్పుతున్నాయి. వేగంగా వన్ మిలియన్ అడ్వాన్స్ బుకింగ్స్ అందుకున్న చిత్రంగా పుష్ప 2 నిలిచింది. అలాగే ఇప్పటి వరకు 45000 టికెట్స్ అమ్ముడుపోయాయట. ఇదొక రికార్డు. ఇప్పటి వరకు పుష్ప 2 ప్రీమియర్ బుకింగ్స్ ద్వారా $ 1256525 వసూళ్లు అందుకుంది.

    విడుదలకు మరో రెండు వారాల సమయం ఉంది. అప్పుడే వన్ మిలియన్ మార్క్ దాటి, టు మిలియన్స్ వైపు దూసుకెళుతుంది. కేవలం ప్రీమియర్స్ బుకింగ్స్ ద్వారా పుష్ప రూ. $4 మిలియన్ వసూళ్లను రాబట్టడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. పుష్ప 2 చిత్రానికి ఉన్న డిమాండ్ రీత్యా రూ. 1000 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఇక పుష్ప 2 తో అల్లు అర్జున్ వెయ్యి కోట్ల వసూళ్ల క్లబ్ లో చేరాడనిపిస్తుంది. టాలీవుడ్ నుండి ఒక్క ప్రభాస్ మాత్రమే సోలోగా వెయ్యి కోట్ల మార్క్ చేరుకున్నాడు.

    మల్టీస్టారర్ ఆర్ ఆర్ ఆర్ తో ఎన్టీఆర్, రామ్ చరణ్ ఈ లీగ్ లో ఉన్నారు. డిసెంబర్ 4 అర్థరాత్రి నుండే యూఎస్ లో ప్రీమియర్స్ ప్రదర్శన మొదలవుతుంది. దర్శకుడు సుకుమార్ పీరియాడిక్ క్రైమ్ యాక్షన్ ఎంటర్టైనర్ పుష్ప 2 తెరకెక్కిస్తున్నారు. రష్మిక మందాన హీరోయిన్ గా నటిస్తుంది. శ్రీలీల ఐటెం సాంగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ దాదాపు రూ. 400 కోట్ల బడ్జెట్ తో పుష్ప 2 నిర్మించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఫహద్ ఫాజిల్, సునీల్, అనసూయ, రావు రమేష్, జగపతిబాబు కీలక రోల్స్ చేస్తున్నారు.