https://oktelugu.com/

Tilak Verma : తిలక్ వర్మకు ఏమైంది?.. వరుసగా మూడోది.. ఈ పునకాలు ఏంటి స్వామీ!

ఇటీవల దక్షిణాఫ్రికా జట్టుతో జరిగిన టి20 సిరీస్ లో బ్యాక్ టు బ్యాక్ సెంచరీలు చేసి అదరగొట్టిన తిలక్ వర్మ.. ఏ మాత్రం తగ్గడం లేదు. ప్రత్యర్థి జట్టు, మైదానం మాత్రమే మారుతోంది. అతని దూకుడు ఏ మాత్రం తగ్గడం లేదు.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : November 23, 2024 / 09:05 PM IST

    Tilak Verma

    Follow us on

    Tilak Verma : ప్రస్తుతం సయ్యద్ ముస్తాక్ అలీ దేశవాలి టి20 టోర్నీ జరుగుతోంది. ఈ టోర్నీలో తెలుగు ఆటగాడు తిలక్ వర్మ ఆకాశమే హద్దుగా పోయాడు. తన అద్భుతమైన ఫామ్ కొనసాగిస్తూ విధ్వంసాన్ని సృష్టించాడు. మేఘాలయ జట్టు పై తుఫాన్ ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 67 బంతుల్లోనే 151 రన్స్ చేశాడు.. 14 ఫోర్లు, పది సిక్సర్లతో ఊచ కోత కోశాడు. టి20 క్రికెట్లో తిలక్ వర్మ దక్షిణాఫ్రికా సిరీస్ తో కలిపి వరుసగా మూడు సెంచరీలు చేశాడు.. దక్షిణాఫ్రికా జట్టుతో జరిగిన చివరి రెండు టి20 మ్యాచ్లలో తిలక్ శతకాలు బాదాడు. సఫారీ లతో జరిగిన మూడు, నాలుగు టి20 మ్యాచ్ లలో అతడు వన్ డౌన్లో వచ్చాడు. కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ ను అడిగి మరీ అతడు ఆస్థానంలో బ్యాటింగ్ కు దిగాడు. ఇక మేఘాలయ జట్టుతో జరిగిన మ్యాచ్ లోను అతడు మూడో స్థానంలో బ్యాటింగ్ చేశాడు.. ఈ మ్యాచ్లో ఓపెనర్ రాహుల్ సింగ్ 0 పగులకే అవుట్ అయ్యాడు.. దీంతో క్రీీజ్ లోకి వచ్చిన తిలక్ వర్మ.. చివరి వరకు ఆడాడు. లాస్ట్ బంతికి అవుట్ అయ్యి పెవిలియన్ చేరుకున్నాడు.. తన్మయి అగర్వాల్ (55) కూడా విధ్వంసకరమైన ఆట తీరు ప్రదర్శించడంతో.. మేఘాలయ జట్టు పై హైదరాబాద్ 20 ఓవర్లు పూర్తిస్థాయిలో బ్యాటింగ్ చేసి.. నాలుగు వికెట్లు మాత్రమే నష్టపోయి 248 రన్స్ చేసింది. ఇక హైదరాబాద్ జట్టులో రాహుల్ (30) పరుగులు చేశాడు. మేఘాలయ బౌలర్లలో డిప్పు, సిగ్మా చెర్రీ రెండు వికెట్లు పడగొట్టారు. ఇన్నింగ్స్ ప్రారంభంలోనే హైదరాబాద్ జట్టు తొలి వికెట్ కోల్పోయింది. అయితే తిలక్ వర్మ రావడంతో మ్యాచ్ స్వరూపం పూర్తిగా మారింది.. మొదట్లో స్వల్పంగా ఆడిన తిలక్.. ఆ తర్వాత తన గేర్ మార్చాడు. అతడికి తన్మయి కూడా తోడయ్యాడు. దీంతో 10 ఓవర్లు ముగిసే సరికి హైదరాబాద్ జట్టు 123 రన్స్ చేసింది. ఆ తర్వాత తన్మయి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత తిలక్ తన విశ్వరూపం చూపించాడు. చివరి వరకు నిలబడి మేఘాలయ జట్టుకు చుక్కలు చూపించాడు.

    జట్టులో సుస్థిర స్థానం

    టి20 క్రికెట్లో ఆకాశమే హద్దుగా తిలక్ చెలరేగిపోతున్న నేపథ్యంలో.. అతడికి జాతీయ జట్టులో స్థానం సుస్థిరం అవుతుందని టీమిండియా అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు. అతడు అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నాడని.. ఫీల్డింగ్ లోనూ చురుకుగా కదులుతున్నాడని పేర్కొంటున్నారు. అతడు ఇదే జోరు కొనసాగిస్తే టీమిండియా బ్యాటింగ్ కు మూల స్తంభం అవుతాడని పేర్కొంటున్నారు.

    డిసెంబర్ 15 వరకు టోర్నీ..

    అయితే ఈ టోర్నీలో 38 జట్లు పాల్గొంటున్నాయి. వాటిని ఐదు గ్రూపులుగా విభజించారు. డిసెంబర్ 15 వరకు ఈ టోర్నీ నిర్వహిస్తారు.

    గ్రూపు- ఏ లో మిజోరాం, మధ్యప్రదేశ్, మేఘాలయ, హైదరాబాద్, బెంగాల్, పంజాబ్, బీహార్, రాజస్థాన్ జట్లు ఉన్నాయి.

    గ్రూప్ – బీలో తమిళనాడు, ఉత్తరాఖండ్, కర్ణాటక, గుజరాత్, సౌరాష్ట్ర, బరోడా, సిక్కిం జట్లు ఉన్నాయి.

    గ్రూప్ – సీ లో అరుణాచల్ ప్రదేశ్, ఢిల్లీ, జమ్ము కాశ్మీర్, జార్ఖండ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ జట్లు ఉన్నాయి.

    గ్రూప్ – డీ లో చండీగఢ్, చత్తీస్ గడ్, అస్సాం, విదర్భ, రైల్వేస్, పుదుచ్చేరి, ఒడిశా జట్లు ఉన్నాయి.

    గ్రూప్ – ఈ లో సర్వీసెస్, మహారాష్ట్ర, గోవా, ఆంధ్రప్రదేశ్, నాగాలాండ్, కేరళ, ముంబై జట్లు ఉన్నాయి.