విభేదాలు మరిచి జోడు గుర్రాలైన విరాట్ కోహ్లీ, రోహిత్

ప్రపంచ నంబర్ 1 టీ20 టీమ్ అయిన ఇంగ్లండ్ పై టీమిండియా విజయం ఓ అద్భుతమనే చెప్పాలి. ఎంతో బలమైన ఇంగ్లండ్ టీ20లో భారత్ ను చెడుగుడు ఆడింది. భారతీ్ ఎంతో కష్టపడి గెలవాల్సి వచ్చింది. వారి పేస్ కు మనోళ్లు బెంబేలెత్తారు. అయితే చివరి టీ20 ఫైనల్ లాంటి 5వ మ్యాచ్ లో భారత్ ను గెలుపు బాటలో నిలిపారంటే అది ఖచ్చితంగా కెప్టెన్ కోహ్లీ, వైస్ కెప్టెన్ రోహిత్ ఘనతే. కేఎల్ రాహుల్ విఫలమైన […]

Written By: NARESH, Updated On : March 21, 2021 9:28 am
Follow us on

ప్రపంచ నంబర్ 1 టీ20 టీమ్ అయిన ఇంగ్లండ్ పై టీమిండియా విజయం ఓ అద్భుతమనే చెప్పాలి. ఎంతో బలమైన ఇంగ్లండ్ టీ20లో భారత్ ను చెడుగుడు ఆడింది. భారతీ్ ఎంతో కష్టపడి గెలవాల్సి వచ్చింది. వారి పేస్ కు మనోళ్లు బెంబేలెత్తారు. అయితే చివరి టీ20 ఫైనల్ లాంటి 5వ మ్యాచ్ లో భారత్ ను గెలుపు బాటలో నిలిపారంటే అది ఖచ్చితంగా కెప్టెన్ కోహ్లీ, వైస్ కెప్టెన్ రోహిత్ ఘనతే.

కేఎల్ రాహుల్ విఫలమైన వేళ ఓపెనర్ గా వచ్చాడు కెప్టెన్ కోహ్లీ. రోహిత్ తో కలిసి తొలిసారి ఓపెనింగ్ చేశాడు.ప్రపంచంలోనే టాప్ బ్యాట్స్ మెన్ ఇద్దరు.. పైగా కెప్టెన్ వైస్ కెప్టెన్ లు టీమిండియా గెలుపు బాధ్యతను భుజాన వేసుకున్నారు. మునుపెన్నడూ లేని రీతిలో ఆడారు.

రోహిత్ శర్మ మొదట ఇంగ్లండ్ బౌలింగ్ ను తుత్తినియలు చేసి విరుచుకుపడగా.. కోహ్లీ సహకరించి సింగిల్స్ తీస్తూ స్ట్రైక్ రోహిత్ కు ఇచ్చాడు. ఇక రోహిత్ ఆఫ్ సెంచరీ చేసి ఔట్ అయ్యాక కోహ్లీ స్ట్రైక్ తీసుకున్నాడు. దంచడం స్ట్రాట్ చేశాడు. వీరిద్దరూ దంచికొట్టడంతో తర్వాత వచ్చిన సూర్య, హార్ధిక్ పాండ్యాకు ఈజీ అయిపోయింది. వారూ యథేచ్ఛగా షాట్లు ఆడుతూ టీమిండియాకు భారీ స్కోరును అందించారు.

నిజానికి కోహ్లీ, రోహిత్ ల మధ్య తీవ్ర విభేదాలు ఉన్నట్టు అప్పట్లో ప్రచారం జరిగింది. వీరిద్దరూ జట్టులో ఎడమొహం పెడమొహంగా ఉంటారని అంటుంటారు. మ్యాచ్ లోనూ కోహ్లీ ఎంత చొరవ తీసుకున్న రోహిత్ మాత్రం అవైడ్ చేస్తున్నట్టే కనిపించింది. ఆస్ట్రేలియా పర్యటనకు రోహిత్ ను దూరం పెట్టిన వైనంపై కోహ్లీపై తీవ్ర విమర్శలు వచ్చాయి. వీరిద్దరికి పడడం లేదన్న టాక్ నడిచింది.

అయితే టీం కోసం నిన్న ఇద్దరూ కలిసి పోరాడిన తీరు భారత ప్రేక్షకులకు కన్నుల విందుగా మారింది. వీరు ఇలా కలిసి పోయి జట్టు కోసం ఆడి టీమిండియాకు కప్ ను అందించడం చూసి అందరూ ఫిదా అయ్యారు. ఇక రోహిత్ నిన్న కోహ్లీ లేని సమయంలో కెప్టెన్ గా మైదానంలో తీసుకున్న నిర్ణయాలే ఇంగ్లండ్ ఓటమికి దారితీశాయి. ఇక రోహిత్ తో కలిసి ఖచ్చితంగా తాను ఓపెనర్ గా బ్యాటింగ్ చేస్తానని.. జట్టు కోసం కలిసి మా జోడీ కొనసాగుతుందని ప్రజంటేషన్ సెర్మనీలో కోహ్లీ అనడం విశేషం.  జోడు గుర్రాలు లాంటి వీరిద్దరూ కలిసి ఓపెనింగ్ కొనసాగించాలని భారత అభిమానులు ఆశిస్తున్నారు.