https://oktelugu.com/

దంచికొట్టిన రోహిత్, కోహ్లీ.. భారత్ ఘనవిజయం

ప్రపంచంలోనే టీ20లో టాప్ 2 జట్ల మధ్య జరుగుతున్న ఫైనల్ మ్యాచ్ నువ్వానేనా అన్నట్టుగా సాగుతోంది. గెలుపు కోసం రెండు జట్లు సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి. ఇంగ్లండ్ తో జరుగుతున్న చివరి టీ20లో ఇండియా బ్యాట్స్ మెన్ చెలరేగారు. కెప్టెన్ కోహ్లీ, వైస్ కెప్టెన్ రోహిత్ లు చెలరేగి ఆడి టీమిండియాకు 224 పరుగుల భారీ స్కోరును సాధించిపెట్టారు.మొతేరా స్టేడియాన్ని పరుగుల మొతతో మోతెక్కించారు. సిక్సర్ల వర్షం కురిపించారు. బౌండరీల వరద పారింది. ఈ సిరీస్ లో తొలిసారి […]

Written By: , Updated On : March 20, 2021 / 10:18 PM IST
Follow us on

ప్రపంచంలోనే టీ20లో టాప్ 2 జట్ల మధ్య జరుగుతున్న ఫైనల్ మ్యాచ్ నువ్వానేనా అన్నట్టుగా సాగుతోంది. గెలుపు కోసం రెండు జట్లు సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి.

ఇంగ్లండ్ తో జరుగుతున్న చివరి టీ20లో ఇండియా బ్యాట్స్ మెన్ చెలరేగారు. కెప్టెన్ కోహ్లీ, వైస్ కెప్టెన్ రోహిత్ లు చెలరేగి ఆడి టీమిండియాకు 224 పరుగుల భారీ స్కోరును సాధించిపెట్టారు.మొతేరా స్టేడియాన్ని పరుగుల మొతతో మోతెక్కించారు. సిక్సర్ల వర్షం కురిపించారు. బౌండరీల వరద పారింది.

ఈ సిరీస్ లో తొలిసారి భారీ పరుగుల తుఫాన్ మోడీ స్టేడియంలో కనిపించింది. ఓపెనర్ రోహిత్ 64, కోహ్లీ 80 నాటౌట్ తో ఆకలిగొన్న పులుల్లా విరుచుకుపడిన వేళ టీమిండియా భారీ స్కోరు సాధించింది.

మధ్యలో హార్ధిక్ పాండ్యా 39 పరుగులు, సూర్యకుమార్ 32 పరుగులతో ధనాధన్ ఇన్నింగ్స్ ఆడారు. టీమిండియా బ్యాట్స్ మెన్ అంతా రెచ్చిపోవడంతో ఇంగ్లండ్ పై భారీ స్కోరు సాధ్యమైంది. టీమిండియాకు ఇంగ్లండ్ పై ఇదే అత్యధిక స్కోరు కావడం గమనార్హం.

ఇక ఇంగ్లండ్ కూడా అంతే ధీటుగా స్పందించింది. ఓపెనర్ రాయ్ ఔట్ అయినా బట్లర్, డేవిడ్ మలన్ లు రెచ్చిపోయి భారీ స్కోరు సాధించారు. టీమిండియా బౌలర్లపై విరుచుకుపడ్డారు. విజయం కోసం ఇంగ్లండ్ బ్యాట్స్ మెన్ పోరాడారు.కానీ భువనేశ్వర్, షార్దూల్ పకడ్బందీగా బౌలింగ్ చేసి చివర్లో వికెట్లు తీయడంతో భారత్ విజయం సాధించింది. విజయం కోసం చివరిదాకా పోరాడిన మలన్, బట్లర్ ఔట్ కావడంతో  తర్వాత వచ్చిన బ్యాట్స్ మెన్ నిలబడకపోవడంతో టీమిండియా విజయం సాధ్యమైంది.