Virat And Rohit: టీమ్ ఇండియాలో రోహిత్ శర్మకు, విరాట్ కోహ్లీకి ప్రత్యేక స్థానం ఉంటుంది. వీరిద్దరూ నెలకొల్పిన రికార్డులు బలమైనవి. వీరిద్దరూ సాధించిన విజయాలు గొప్పవి. వీరిద్దరూ అందుకున్న ఘనతలు అనితర సాధ్యమైనవి. అందువల్లే వీరిని టీమిండియాలో ROKO అని పిలుస్తుంటారు. ఆట మాత్రమే కాకుండా.. దూకుడు మాత్రమే కాకుండా.. అంతకుమించి అనే స్థాయిలో క్రికెట్ కు వీరిద్దరూ గ్లామర్ అద్దారు. అందువల్లే వీరితో క్రికెట్ ఆడిన వారు కూడా వీరిని ప్రేమిస్తుంటారు. ఆరాధిస్తుంటారు. అనుసరిస్తుంటారు.
ఆడేది అప్పుడే
టెస్ట్ నుంచి తప్పకున్న తర్వాత.. టి20 ల నుంచి కూడా విశ్రాంతి తీసుకున్న తర్వాత.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్లలో ఆడేది ఎప్పుడు అనే ప్రశ్న అందరిలోనూ వ్యక్తం అవుతున్నది. అయితే వన్డేలలో కొనసాగుతున్న విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఈ ఏడాది ఆగస్టులో అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ ఆడతారు. బంగ్లాదేశ్ జట్టుతో ఆగస్టులో జరిగే వన్డే సిరీస్లో రోహిత్, విరాట్ కోహ్లీ ఆడుతారు. అక్టోబర్లో ఆస్ట్రేలియాతో జరిగే వన్డే సిరీస్ లోనూ వీరిద్దరూ ఆడుతారు. ఇక నవంబర్లో దక్షిణాఫ్రికాతో జరిగే వన్డే సిరీస్ లోను వీరిద్దరి ఆడుతారు. 2026 జనవరిలో న్యూజిలాండ్ జట్టుతో జరిగే వన్డే సిరీస్.. అదే ఏడది జూన్ నెలలో ఆఫ్ఘనిస్తాన్ జట్టుతో జరిగే వన్డే సిరీస్.. జూలై నెలలో ఇంగ్లాండ్ జట్టుతో జరిగే వన్డే సిరీస్.. సెప్టెంబర్ లో వెస్టిండీస్ తో జరిగే వన్డే సిరీస్, అక్టోబర్లో న్యూజిలాండ్ జట్టుతో జరిగే వన్డే సిరీస్, డిసెంబర్లో శ్రీలంకతో జరిగే వన్డే సిరీస్లో వీరు కచ్చితంగా ఆడుతారు.
Also Read: ఇండియా ఏ టీం ఇదే.. ఇందులో రాణిస్తేనే జాతీయ జట్టుకు.. కరణ్ నాయర్, జురెల్ కి ఛాన్స్
రోహిత్ ఆధ్వర్యంలో టీమిండియా ఇంతవరకు వన్డే వరల్డ్ కప్ అందుకోలేదు. టీమిండియా కు ఎలాగైనా వన్డే వరల్డ్ కప్ అందివ్వాలని రోహిత్ బలంగా నిర్ణయించుకున్నాడు. అందువల్లే అతడు టెస్ట్ ఫార్మాట్ కు శాశ్వత వీడ్కోలు పలికి.. కేవలం వన్డేలకు మాత్రమే పరిమితమయ్యాడు. అప్పటిదాకా తన శరీర సామర్థ్యాన్ని కాపాడుకొని.. టీమిండియాకు వన్డే వరల్డ్ కప్ అందించిన రికార్డును సొంతం చేసుకోవాలని భావిస్తున్నాడు. ఇక 2023లో స్వదేశంలో వన్డే వరల్డ్ కప్ జరిగింది. ఆ సిరీస్లో టీమిండియా అద్భుతమైన విజయాలు సాధించింది. ఫైనల్ దాకా రాకెట్ వేగంతో దూసుకుపోయింది. అయితే ఫైనల్ మ్యాచ్లో కంగారు జట్టుతో తలపడి ఓటమిపాలైంది. తద్వారా అందించిన అవకాశాన్ని చేజార్చుకుంది. చివరి మ్యాచ్లో అన్ని విభాగాలలో తేలిపోయి ప్రత్యర్థి జట్టు ఎదుట తలవంచింది. నాటి మ్యాచ్లో ఓడిపోయిన తర్వాత హిట్ మ్యాన్ మైదానంలోనే ఏడ్చేశాడు.. విపరీతమైన దుఃఖంతో డ్రెస్సింగ్ రూమ్ బయట కూర్చుని నిర్వేదంలో కూరుకు పోయాడు. అతడిని ఓదార్చడం జట్టు సభ్యుల నుంచి కూడా కాలేదు.