India A England Squad: టెస్ట్ సిరీస్ ప్రారంభాని కంటే ముందు.. భారత – ఏ జట్టు ఇంగ్లాండ్ బయలుదేరుతుంది. ఇంగ్లాండ్ – ఏ జట్టుతో రెండు అనధికారిక టెస్టులు ఆడుతుంది. ఇంగ్లాండ్ – ఏ జట్టుతో ఆడే భారత – ఏ జట్టును బీసీసీఐ ప్రకటించింది. అభిమన్యు ఈశ్వరన్ ను జట్టుకు సారధిగా నియమించింది. వికెట్ కీపర్ ధృవ్ జూరెల్ ను వైస్ కెప్టెన్ గా నియమించింది. భారత – ఏ జట్టులో ఆడేందుకు కరుణ్ నాయర్ కు అవకాశం లభించింది. ఇతడు ఇటీవల రాంజీ ట్రోఫీ ఫైనల్ లో విదర్భ తరఫున సెంచరీ చేశాడు. దాదాపు 8 సంవత్సరాల తర్వాత భారత జట్టులోకి ప్రవేశిస్తున్నాడు.. ఇక ఇంగ్లాండ్ ఏ జట్టుతో తలపడే భారత జట్టులో 18 మంది సభ్యులు ఉన్నారు. ఇందులో యశస్వి జైస్వాల్, శార్దుల్ ఠాకూర్, కరుణ్ నాయర్ కీలక ప్లేయర్లుగా ఉన్నారు. ఇక రెండవ అనధికారిక టెస్టు లో గిల్, సాయి సుదర్శన్ జట్టులో చేరుతారు..
Also Read: గిల్ కాదు, బుమ్రా కాదు.. ఇంగ్లాండ్ టూర్ లో ఇతడు ఉంటేనే ఇండియా గెలుస్తుంది!
ఇంగ్లాండ్ జట్టుతో జరిగే రెండు అనధికారిక టెస్టులలో ధృవ్ జూరెల్ మాత్రమే కాకుండా ఇషాన్ కిషన్ కూడా వికెట్ కీపర్ గా ఉన్నాడు. వీరిద్దరూ 2024 -25 కాలంలో ఆస్ట్రేలియాతో జరిగిన రెండు అనధికారిక టెస్టులలో టీమిండియా – ఏ తరఫున ఆడారు. కిషన్ మొదటి మ్యాచ్ ఆడగా.. ధృవ్ జూరెల్ రెండవ మ్యాచ్ ఆడాడు. ఇక ఇంగ్లాండ్ లో పర్యటించే భారత – ఏ జట్టులో ఫాస్ట్ బౌలర్ల ఎంపిక మేనేజ్మెంట్ కు సవాల్ గా మారే అవకాశం ఉంది. ఎందుకంటే భారత ఏ జట్టులో శార్దుల్ ఠాగూర్, ముఖేష్ కుమార్, ఆకాష్ దీప్, హర్షిత్ రాణా, అన్షుల్ కాంబోజ్, ఖలీల్ అహ్మద్, తుషార్ దేశ్ పాండే, ఆల్ రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి వంటి వారు ఉన్నారు. ఇక స్పీడ్ విభాగంలో మానవ్ సుతార్, హర్ష్ దుబే, హాఫ్ పిన్నర్ తనుష్ కోటియన్ కూడా ఉన్నారు.
ఈ సిరీస్ ద్వారా కరుణ్ నాయర్ భారత జాతీయ జట్టులోకి తిరిగి వచ్చే అవకాశం ఉంది. అతడు 2017లో ఆస్ట్రేలియా తో జరిగిన సిరీస్ లో తన చివరి టెస్ట్ ఆడాడు. నాయర్ దేశ క్రికెట్లో అద్భుతమైన ఫామ్ లో ఉన్నాడు. తొమ్మిది మ్యాచ్లలో 863 పరుగులు చేశాడు. 2024 -25 కాలంలో రంజి చాంపియన్స్ ట్రోఫీలో విద్యార్థుల హైయెస్ట్ స్కోర్ చేసిన సెకండ్ ప్లేయర్గా నిలిచాడు. ఇక 2023 -24 లో కౌంటి క్రికెట్లో నార్తాంప్టన్ షైర్ కు అతడు ప్రాతినిధ్యం వహించాడు. పది మ్యాచ్లలో 56.61 సగటుతో 736 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు హాఫ్ సెంచరీలు, రెండు సెంచరీలు ఉన్నాయి. ఇక ఇంగ్లాండ్ ఏ జట్టుతో తొలి మ్యాచ్ మే 30న కాంటర్బరీలో జరుగుతుంది. రెండవ మ్యాచ్ జూన్ 6న నార్తాంప్టన్ లో మొదలవుతుంది. ఇక ఇంగ్లాండ్ ఏ జట్టుతో పాడిన తర్వాత.. ఇండియా ఏ జట్టు జూన్ 13 నుంచి సీనియర్ ఇండియా జట్టుతో నాలుగు రోజుల మ్యాచ్ లో తల పడుతుంది..
ఇండియా ఏ జట్టు ఇదే..
అభిమన్యు ఈశ్వరన్ (కెప్టెన్), జైస్వాల్, కరుణ్ నాయర్, ధృవ్ జూరెల్(వైస్ కెప్టెన్), నితీష్ కుమార్ రెడ్డి, శార్దూల్ ఠాకూర్, మానవ్ సుతార్, తనుశ్ కోటియన్, ముఖేష్ కుమార్, ఆకాశ్ దీప్, హర్షిత్ రాణా, అన్షుల్ కాంబోజ్, ఖరాజ్ అహ్మద్, సర్తుల్ కాంబోజ్, తుషార్ దేశ్ పాండే, హర్ష్ దూబే.